మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 38
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 38 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : పద్మావతి దేవి
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. కృష్ణావతార పరమార్థము 🌻
అడవిలో వెదురుచెట్లు చిక్కగా పొదలై పెరిగి గాలికి కదులును. కదలిక వలన వెదురు బొంగులు ఒకదానికొకటి రాచుకొని నిప్పు పుట్టును. దానితో వెదుర్లు అంటుకొనును. ఇట్లు రగిలిన కారుచిచ్చునకు మరల గాలియే తోడగును. దానితో వనమంతయు మండిపోవును.
అదే విధముగ భూమికి బరువైన లోకభీకర లక్షణములతో రాజులు సంపదలు పెంచుకొని మహాసేనలు అక్షౌహిణులుగా పోషించి ప్రజలను బాధ పెట్టుచుండిరి.
అప్పుడు భగవంతుడు వారిలోని కామక్రోధములైన అసుర లక్షణములనే కదలించి వారి నడుమ యుద్ధప్రేమ పుట్టించెను.
యుద్ధమున సారథియై పనిచేసి వారందరిని నంతము చేసి భూభారము తొలగించెను.
ఇది కృష్ణావతార పరమార్థములలో నొకటి. తాను ఆయుధము ధరింపకయే సంహారము చేసెను. తాను మాత్రము శాంతుడై కాంతల నడుమ సామాన్య మానవుని వలె సంచరించెను.
🌹 🌹 🌹 🌹 🌹
09 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment