వివేక చూడామణి - 140 / Viveka Chudamani - 140


🌹. వివేక చూడామణి - 140 / Viveka Chudamani - 140🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 28. ప్రారబ్దము - 3 🍀


459. సృతుల యొక్క మాటలు వ్యర్ధము కాదు. అవి ఆత్మకు పుట్టుక లేదని, అది శాశ్వతమైనదని, దానికి తరుగులేదని చెప్పుచున్నవి. అందువలన ఎవరైన దానిలో జీవిస్తున్నటైన అట్టి వ్యక్తికి ప్రారబ్దము ఎలా వర్తిస్తుంది? వర్తించదని భావము.

460. ప్రారబ్దము యొక్క ఫలితము కేవలము వ్యక్తి తాను శరీరముతో పోల్చుకొన్నంత కాలము ఉంటుంది. కాని ఏ వ్యక్తి తాను బ్రహ్మమును తెలుసుకొన్న తరువాత తనను తాను శరీరముతో పోల్చుకోడు అందువలన ప్రారబ్దము యొక్క ఫలితమును తోసిపుచ్చవలెను.

461. శరీరానికి ప్రారబ్దమును జోడించుట తప్పని సరిగా సరైనది కాదు. ఏవిధముగా ఒక దానిని ఇంకొక దానిపై రుద్దుట సమంజసమైనది. అబద్దమైనది ఏవిధముగా జన్మిస్తుంది? జన్మించనిదేదైనా ఉంటే అది ఎలా మరణిస్తుంది? అందువలన ప్రారబ్దమనేది అంతా అసత్యము.

462,463. అజ్ఞానము యొక్క ఫలితాలను తొలగించిన (అందుకు జ్ఞాన విత్తనము పాదు కొల్పాలి) అపుడు ఈ శరీరము ఎలా జీవిస్తుంది? అజ్ఞానులను తృప్తిపరచుటకు ఈ ప్రారబ్దము అను మాటను సృతులు పల్కినవిగాని, నిజానికి జ్ఞానము పొందిన వానికి ఈ ప్రారబ్దము లేనిదే అవుతుంది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹





🌹 VIVEKA CHUDAMANI - 140 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 28. Fate - 3 🌻


459. The Shrutis, whose words are infallible, declare the Atman to be "birthless, eternal and undecaying". So, the man who lives identified with That, how can Prarabdha work be attributed ?

460. Prarabdha work can be maintained only so long as one lives identified with the body. But no one admits that the man of realisation ever identifies himself with the body. Hence Prarabdha work should be rejected in his case.

461. The attributing of Prarabdha work to the body even is certainly an error. How can something that is superimposed (on another) have any existence, and how can that which is unreal have a birth ? And how can that which has not been born at all, die ? So how can Prarabdha work exist for something that is unreal ?

462-463. "If the effects of ignorance are destroyed with their root by knowledge, then how does the body live?" – it is to convince those fools who entertain a doubt like this, that the Shrutis, from a relative standpoint, hypothesise Prarabdha work, but not for proving the reality of the body etc., of the man of realisation.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


21 Oct 2021

No comments:

Post a Comment