1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 21, గురువారం, ఆక్టోబర్ 2021 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 264 🌹
3) 🌹. శివ మహా పురాణము - 463🌹
4) 🌹 వివేక చూడామణి - 140 / Viveka Chudamani - 140🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -92🌹
6) 🌹 Osho Daily Meditations - 81 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 140 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 140🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*21, అక్టోబర్ 2021*
*జగద్గురు శ్రీకృష్ణుని ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా
ఉండాలని కోరుకుంటూ....*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. భగవద్గీతాసారము -19 🍀*
*యోగ మార్గమున ఉన్నవారు స్థిర ప్రయోజనముతో ఒకే లక్ష్యమును కలిగి యుందురు. ఓ కురునందనా! స్థిర ప్రయోజనము లేనివారి బుద్ధి అనేక విధములుగా నుండును. మనకు చాలా విషయములు తెలియును. కాని, వాటిని ఆచరించు స్పూర్తి లేదు. ఆచరణ శూన్యతయే కారణముగ సమస్త జ్ఞానము అక్కరకు రాకుండ యున్నది.బుద్ధిని పరిపరి విధములుగ పోనీయక తెలిసిన విషయము లందు నిర్దిష్టముగ నియమించి ఆచరించమని గీత నిర్దేశించు చున్నది. ఈ సూత్ర మంగీకరింపని వానికి జీవితము ఒక ఎడారి!*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
దక్షిణాయణం, వర్ష ఋతువు
చాంద్రమానం : బాధ్రపద మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 22:17:46 వరకు తదుపరి కృష్ణ విదియ
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: అశ్విని 16:18:19 వరకు తదుపరి భరణి
యోగం: వజ్ర 20:59:50 వరకు తదుపరి సిధ్ధి
కరణం: బాలవ 09:19:33 వరకు
వర్జ్యం: 11:54:30 - 13:39:30 మరియు
26:56:36 - 28:43:12 ?
దుర్ముహూర్తం: 10:03:55 - 10:50:34 మరియు
14:43:49 - 15:30:28
రాహు కాలం: 13:28:00 - 14:55:28
గుళిక కాలం: 09:05:36 - 10:33:04
యమ గండం: 06:10:41 - 07:38:08
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23
అమృత కాలం: 08:24:30 - 10:09:30
సూర్యోదయం: 06:10:41
సూర్యాస్తమయం: 17:50:24
వైదిక సూర్యోదయం: 06:14:16
వైదిక సూర్యాస్తమయం: 17:46:48
చంద్రోదయం: 18:27:24, చంద్రాస్తమయం: 06:34:35
సూర్య రాశి: తుల,. చంద్ర రాశి: మేషం
ఆనందాదియోగం: మానస యోగం - కార్య లాభం 16:18:19
వరకు తదుపరి పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి
పండుగలు :
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 PARAMA PUJYA GURUDEV PANDIT SRIRAM SHARMA ACHARYA AND MATA BHAGAVATHI DEVI IDOLS and PADUKAS FOR EVERYDAY WORSHIPPING 🌹*
🍀 AKHILA VISWA GAYATRI PARIWAR 🍀
*SHANTHIKUNJ, HARIDWAR*
*Prasad Bharadwaj*
🙏 🌹 🙏
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -264 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 7-1
*🍀 7. ఈశ్వర ప్రణిధానము -1 - పరమాత్మ తానుగ ఎల్లప్పుడును ఉన్నవాడు. అతని సహజ లక్షణము శాశ్వతమగు ఉనికి. తన నుండి ఉద్భవించు ప్రకృతియే సమస్తమును నిర్వహించు చుండును. తన నుండి బలము గొని, అనేకానేక విధములుగ సృష్టి నిర్మాణము చేయును. ప్రాణికోట్లు పుట్టుట, పెరుగుట, పోషింప బడుట, వృద్ధి చెందుట, తిరోగ మించుట, తనలోనికి కలిసిపోవుట ఇత్యాది కృత్యములన్నియు ప్రకృతి చేష్టలే. సమస్త సృష్టికిని కర్తృత్వము ప్రకృతిదే అని, తాను కర్త కాదని తెలుపుచున్నాడు. 🍀*
సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ |
కల్పయే పున స్తాని కల్పాదౌ విస్పజా మ్యహమ్ II 7
తాత్పర్యము : ప్రళయ కాలమున ప్రాణికోట్లన్నియు నా ప్రకృతిని చేరును. నా ప్రకృతి నన్నుచేరి హృదయమున నుండును. మరల నా ప్రకృతి నా హృదయమునుండి వెలువడి ప్రాణికోట్లను వెలువరించును.
వివరణము : ఇచ్చట దైవము స్వతః సిద్ధమగు తన స్థితిని ఆవిష్కరించు చున్నాడు. సమస్త సృష్టికిని కర్తృత్వము ప్రకృతిదే అని, తాను కర్త కాదని తెలుపుచున్నాడు. తాను కర్తృత్వమునకు ఆవల శాశ్వతుడుగ ఎట్టి స్థితి మార్పులు లేక అక్షరముగ నుండు బ్రహ్మమని, తన నుండి ఏర్పడిన ప్రకృతియే ఇచ్ఛా జ్ఞాన క్రియలుగ రూపాంతరము చెంది, సమస్తమును సృష్టించి, పెంచి, పోషించి మరల వెనుకకు తిరోగమనము చెంది తనను చేరుచున్నదని, తాను కేవలము ప్రకృతికాధారముగ నున్న వాడేకాని, తానేమియు చేయుట లేదని తెలుపుచున్నాడు.
పరమాత్మ తానుగ ఎల్లప్పుడును ఉన్నవాడు. అతని సహజ లక్షణము శాశ్వతమగు ఉనికి. తననుండి ఉద్భవించు ప్రకృతియే సమస్తమును నిర్వహించుచుండును. తన నుండి బలముగొని, అనేకానేక విధములుగ సృష్టి నిర్మాణము చేయును. ప్రాణికోట్లు పుట్టుట, పెరుగుట, పోషింప బడుట, వృద్ధి చెందుట, తిరోగ మించుట, తనలోనికి కలిసిపోవుట ఇత్యాది కృత్యములన్నియు ప్రకృతి చేష్టలే.
ప్రాణికోట్లన్నిటికిని ప్రకృతియే మూలము. ప్రకృతికి తాను మూలము. తన నుండి పుట్టిన ప్రకృతినుండి పుట్టిన ప్రాణి కోట్లకు ప్రకృతియే స్వామి. ప్రకృతికి తాను స్వామి. తాను ప్రకృతికి ఆవలివాడు. జీవులు ప్రకృతికి ఈవలివారు. జీవులు ప్రకృతికి లోబడి యుందురు. తాను ప్రకృతికి మూలమగుటచే ప్రకృతికి లోబడి యుండు వాడు కాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 463🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 33
*🌻. సప్తర్షుల ఉపదేశము - 1 🌻*
ఋషులిట్లు పలికిరి -
శివుడు జగములకు తండ్రి అనియు, శివాదేవి తల్లి అనియు పెద్దలు చెప్పెదరు. కావున నీవు కన్యను మహాత్ముడగు శంకరునకిమ్ము (1). ఓ హిమగిరీ! ఇట్లు చేసినచో నీ జన్మ సార్థకమగును. నీవు జగద్గురువునకు గురువు కాగలవు. సందేహము లేదు (2).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ మహర్షీ! హిమవంతుడు సప్తర్షుల ఈ మాటలను విని వారికి చేతులు జోడించి నమస్కరించి ఇట్లు పలికెను (3).
హివమంతుడిట్లు పలికెను-
మహాత్ములారా! సప్తర్షులారా! శివుని ఆజ్ఞచే మీరు చెప్పిన మాట పూర్వమే నాచేత ప్రమాణముగా స్వీకరింపబడినది (4). ఇప్పుడే ఒక వైష్ణవధర్మానుయాయి అగు బ్రాహ్మణుడు వచ్చి శివుని ఉద్దేశించి విపరీతమగు మాటలను మహాప్రీతితో పలికినాడు (5). అప్పటి నుండియూ పార్వతి తల్లి జ్ఞానభ్రష్టురాలై యోగియగు రుద్రునితో పార్వతి యొక్క వివాహమునకు అంగీకరించుట లేదు (6).
ఆమె మిక్కలి దుఃఖితురాలై మాసిన వస్త్రములను ధరించి కోపగృహములో ప్రవేశించినది. ఓ ఋషులారా! బోధించిననూ ఆమె తెలుసు కొనుట లేదు. ఆమె చాల మొండి పట్టుతో నున్నది (7). నేను కూడ జ్ఞానము కోల్పోతిని. నేను సత్యమునే పలుకుచున్నాను.
భిక్షరూపధారియగు మహేశ్వరునకు కుమార్తెను ఇచ్చుట నాకు ఇచ్చగించుట లేదు (8).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! శివమాయచే విమోహితుడైన పర్వతరాజు మునుల యెదుట నిలబడి ఇట్లు పలికి మిన్నకుండెను (9). ఆ ఏడ్గురు ఋషులు శివమాయను కొనియాడి, పిదప అరుంధతిని మేనక వద్దకు పంపిరి (10). జ్ఞానమును ఇచ్చే ఆ అరుంధతి భర్త ఆజ్ఞను గైకొని, వెంటనే పార్వతి మరియు మేన ఉన్నచోటకు వెళ్లెను (11). ఆమె అచటకు వెళ్లి శోకముచే పరాభూతయై పరుండియున్న మేనను చూచెను. అపుడా సాధ్వి మెల్లగా మధురము, హితమునగు వచనము నిట్లు పలికెను (12).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 140 / Viveka Chudamani - 140🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 28. ప్రారబ్దము - 3 🍀*
459. సృతుల యొక్క మాటలు వ్యర్ధము కాదు. అవి ఆత్మకు పుట్టుక లేదని, అది శాశ్వతమైనదని, దానికి తరుగులేదని చెప్పుచున్నవి. అందువలన ఎవరైన దానిలో జీవిస్తున్నటైన అట్టి వ్యక్తికి ప్రారబ్దము ఎలా వర్తిస్తుంది? వర్తించదని భావము.
460. ప్రారబ్దము యొక్క ఫలితము కేవలము వ్యక్తి తాను శరీరముతో పోల్చుకొన్నంత కాలము ఉంటుంది. కాని ఏ వ్యక్తి తాను బ్రహ్మమును తెలుసుకొన్న తరువాత తనను తాను శరీరముతో పోల్చుకోడు అందువలన ప్రారబ్దము యొక్క ఫలితమును తోసిపుచ్చవలెను.
461. శరీరానికి ప్రారబ్దమును జోడించుట తప్పని సరిగా సరైనది కాదు. ఏవిధముగా ఒక దానిని ఇంకొక దానిపై రుద్దుట సమంజసమైనది. అబద్దమైనది ఏవిధముగా జన్మిస్తుంది? జన్మించనిదేదైనా ఉంటే అది ఎలా మరణిస్తుంది? అందువలన ప్రారబ్దమనేది అంతా అసత్యము.
462,463. అజ్ఞానము యొక్క ఫలితాలను తొలగించిన (అందుకు జ్ఞాన విత్తనము పాదు కొల్పాలి) అపుడు ఈ శరీరము ఎలా జీవిస్తుంది? అజ్ఞానులను తృప్తిపరచుటకు ఈ ప్రారబ్దము అను మాటను సృతులు పల్కినవిగాని, నిజానికి జ్ఞానము పొందిన వానికి ఈ ప్రారబ్దము లేనిదే అవుతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 140 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 28. Fate - 3 🌻*
459. The Shrutis, whose words are infallible, declare the Atman to be "birthless, eternal and undecaying". So, the man who lives identified with That, how can Prarabdha work be attributed ?
460. Prarabdha work can be maintained only so long as one lives identified with the body. But no one admits that the man of realisation ever identifies himself with the body. Hence Prarabdha work should be rejected in his case.
461. The attributing of Prarabdha work to the body even is certainly an error. How can something that is superimposed (on another) have any existence, and how can that which is unreal have a birth ? And how can that which has not been born at all, die ? So how can Prarabdha work exist for something that is unreal ?
462-463. "If the effects of ignorance are destroyed with their root by knowledge, then how does the body live?" – it is to convince those fools who entertain a doubt like this, that the Shrutis, from a relative standpoint, hypothesise Prarabdha work, but not for proving the reality of the body etc., of the man of realisation.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 92 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. *చేయవలసినది- చేయదలచినది - 8 🌻*
*పరమాత్మ యందు ఉండటం మొదలు పెట్టిన తరువాత సాధన చేయక పోవటం ఉండదు. నిరంతరం నిత్యం ఉండేదే సాధన.*
*ఇది చేస్తే ఏం వస్తుంది? అది చేస్తే ఏం వస్తుందని కొందరడుగుతుంటారు. "స్నానం చేస్తే ఏం వస్తుందండీ" అని మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాఫీ తాగితే ఏం వస్తుందండీ, ఎన్నాళ్ళు త్రాగాలి? అన్నం తింటే ఏం వస్తుంది ఎన్నాళ్ళు తినాలి? ఈ ప్రశ్నలు రావేం? ఆ ప్రశ్నలకు అర్థం ఎంతో ఈ అనుష్ఠానం చేస్తే ఏం వస్తుంది? అనే ప్రశ్నకు కూడా అర్థం అంతే. ఒళ్ళు క్షాళనం చేసికొంటే ఏం వస్తుంది? గుడ్డలు మార్చుకుంటే ఏం వస్తుంది? ఏమీ రాదు. అది చేయకపోతే రోగం వస్తుంది. స్నానం చేయకపోతే రోగం వస్తుందనేది సత్యం తప్ప చేస్తే ఏం రాదు. అలాగే గుడ్డలు మార్చుకోకపోతే కంపుకొడుతుందనేది సత్యం.*
*సత్యము, సచ్చిదానంద రూపము, పరమాత్మ స్వరూపమైన విషయం ధ్యానంలో నిలబడి ఉండి దానిలో మన పనులు మనం చేసికొంటూ ఉండటమే. ఈ శరీరమును ఒక రథంగా, ఇంద్రియములను రథమునకు కట్టేసిన గుర్రములుగా, మనస్సును పగ్గంగా, రథంలో ప్రయాణం చేస్తున్న రథి అయిన జీవుడు తనకు సారధి (భగవంతుని) ని వరణ చేసికొనవలెను. ఈ సాధనంతా దాని కోసమే.*
*తనకు రథం తోలిపెట్టే సారధి ఎవడా? అని వెతుక్కోవాలి. ఈ వెతుక్కోవటం చూపించుట కొరకే అర్జునుడు తన జీవితాన్ని నాటకంగా నడిపాడు. అర్జునుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి సహాయం (సారధిగా) అపేక్షించుట దీనికి సంకేతం. మానవజీవిత రంగంలో ప్రతి ఒక్కడు పరమాత్మను తనకు సహాయంగా ఆవాహన చేసి తన హృదయంలోనికి ఆహ్వానం చేసికొనుటకు సంకేతంగా మహాభారతంలో ఈ ఘట్టం ఉన్నది.*
....✍️ *మాస్టర్ ఇ.కె.*
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 81 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 81. WORSHIP 🍀*
*🕉 One need not go to the church or to the temple or to the mosque; wherever you are, be blissful, and there is the temple. The temple is a subtle creation of your own energy. if you are blissful, you create the temple around you. 🕉*
In the temples we are just doing fake things. In the temples we offer flowers that are not ours; we borrow them, from the trees. They were already offered to God on the trees, and they were alive on the trees; you have killed them, you have murdered something beautiful, and now you are offering those murdered flowers to God and not even feeling ashamed. I have watched.
Particularly in India people don't take the flowers of their own plants: "they pick them from the neighbors, and nobody can prevent them, because this is a religious country and they are picking flowers for religious purposes. People burn lights and candles, but they are not theirs; people burn incense and create fragrance, but all is borrowed.
The real temple is created by blissfulness-and all these things start happening on their own. If you are blissful you will find a few flowers are being offered, but those flowers are of your consciousness; there will be light, but that light is of your own inner flame; there will be fragrance, but that fragrance belongs to your very being. This is true worship.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 140 / Sri Lalita Sahasranamavali - Meaning - 140 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 140. స్వతంత్రా, సర్వతంత్రేశీ, దక్షిణామూర్తి రూపిణీ ।
సనకాది సమారాధ్యా, శివజ్ఞాన ప్రదాయినీ ॥ 140 ॥ 🍀*
🍀 723. స్వతంత్రా :
తన ఇష్టప్రకారము ఉండునది
🍀 724. సర్వతంత్రేశీ :
తాను ఉపదేసించిన తంత్రమునకు తానె దేవతైయున్నది
🍀 725. దక్షిణామూర్తిరూపిణీ :
దక్షిణామూర్తి రూపము ధరించినది
🍀 726. సనకాది సమారాధ్యా :
సనక, సనంద, సనత్కుమార, సనత్ సుజాత సనాతనులు అను దేవఋషులచే ఆరాధింపబడునది
🍀 727. శివఙ్ఞానప్రదాయినీ :
ఆత్మఙ్ఞానమును ఇచ్చునది
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 140 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 140. Svatantra sarvatantreshi dakshanamurtirupini
Sanakadi samaradhya shivagynana pradaeini ॥ 140 ॥ 🌻*
🌻 723 ) Swathanthra -
She who is independent
🌻 724 ) Sarwa thanthresi -
She who is goddess to all thanthras (tricks to attain God)
🌻 725 ) Dakshina moorthi roopini -
She who is the personification of God facing South (The teacher form of Shiva)
🌻 726 ) Sanakadhi samaradhya -
She who is being worshipped by Sanaka sages
🌻 727 ) Siva gnana pradhayini -
She who gives the knowledge of God
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment