మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 92


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 92 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. చేయవలసినది- చేయదలచినది - 8 🌻


పరమాత్మ యందు ఉండటం మొదలు పెట్టిన తరువాత సాధన చేయక పోవటం ఉండదు. నిరంతరం నిత్యం ఉండేదే సాధన.

ఇది చేస్తే ఏం వస్తుంది? అది చేస్తే ఏం వస్తుందని కొందరడుగుతుంటారు. "స్నానం చేస్తే ఏం వస్తుందండీ" అని మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాఫీ తాగితే ఏం వస్తుందండీ, ఎన్నాళ్ళు త్రాగాలి? అన్నం తింటే ఏం వస్తుంది ఎన్నాళ్ళు తినాలి? ఈ ప్రశ్నలు రావేం? ఆ ప్రశ్నలకు అర్థం ఎంతో ఈ అనుష్ఠానం చేస్తే ఏం వస్తుంది? అనే ప్రశ్నకు కూడా అర్థం అంతే. ఒళ్ళు క్షాళనం చేసికొంటే ఏం వస్తుంది? గుడ్డలు మార్చుకుంటే ఏం వస్తుంది? ఏమీ రాదు. అది చేయకపోతే రోగం వస్తుంది. స్నానం చేయకపోతే రోగం వస్తుందనేది సత్యం తప్ప చేస్తే ఏం రాదు. అలాగే గుడ్డలు మార్చుకోకపోతే కంపుకొడుతుందనేది సత్యం.

సత్యము, సచ్చిదానంద రూపము, పరమాత్మ స్వరూపమైన విషయం ధ్యానంలో నిలబడి ఉండి దానిలో మన పనులు మనం చేసికొంటూ ఉండటమే. ఈ శరీరమును ఒక రథంగా, ఇంద్రియములను రథమునకు కట్టేసిన గుర్రములుగా, మనస్సును పగ్గంగా, రథంలో ప్రయాణం చేస్తున్న రథి అయిన జీవుడు తనకు సారధి (భగవంతుని) ని వరణ చేసికొనవలెను. ఈ సాధనంతా దాని కోసమే.

తనకు రథం తోలిపెట్టే సారధి ఎవడా? అని వెతుక్కోవాలి. ఈ వెతుక్కోవటం చూపించుట కొరకే అర్జునుడు తన జీవితాన్ని నాటకంగా నడిపాడు. అర్జునుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి సహాయం (సారధిగా) అపేక్షించుట దీనికి సంకేతం.‌ మానవజీవిత రంగంలో ప్రతి ఒక్కడు పరమాత్మను తనకు సహాయంగా ఆవాహన చేసి తన హృదయంలోనికి ఆహ్వానం చేసికొనుటకు సంకేతంగా మహాభారతంలో ఈ ఘట్టం ఉన్నది.


....✍️ మాస్టర్ ఇ.కె.

🌹 🌹 🌹 🌹 🌹


21 Oct 2021

No comments:

Post a Comment