శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 314-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 314-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 314-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 314-1🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀

🌻 314-1. 'రాకేందువదనా' 🌻


పూర్ణ చంద్రునివంటి ముఖము కలది శ్రీమాత అని అర్థము. 'ఇందు' అనగా చంద్రుడు. 'రాకా'పూర్ణిమ తిథి అంత్య భాగము. రాకేందువదనా' పున్నమి చంద్రుని వంటి ముఖము. పున్నమి చంద్రుడు ఆరోగ్యవంతులకు ఆహ్లాదము నిచ్చును. ప్రశాంతమైన మనస్సు గలవారికి పున్నమి చంద్రుడు దివ్యానుభూతులను కలిగించగలడు. పౌర్ణమి తిథి అంతమున చంద్రుడు సూర్యునికి పూర్ణముగ ఉన్ముఖుడై యుండును.

అందువలన చంద్రుని యందు సూర్యుని కాంతి పరిపూర్ణముగ ప్రతిబింబించును. పున్నమి తిథియందు కూడ ఈ సమయము పూర్ణ చంద్రుని స్థితి. ఈ సమయమునకు ముందుగాని, వెనుకగాని చంద్రుని కాంతి మిక్కుటమై అతిశయించి వుండదు. పౌర్ణమి తిథి కాలమంతయు పౌర్ణమి చంద్రుడని పిలువబడుచున్ననూ నిజమగు పూర్ణస్థితి రాకా సమయమే. 'రాకా' కాలమును దర్శించుటకు పౌర్ణమి తిథి అంతము, బహుళ పాడ్యమి ప్రారంభము చంద్రుని చంద్రకాంతిని దర్శింపవలెను. చంద్రుడు ప్రతిబింబించు మనోప్రజ్ఞ. సూర్యుడు ఆత్మప్రజ్ఞ.

మనస్సు నందు ఆత్మప్రజ్ఞ పరిపూర్ణముగ ప్రతిబింబించు శుభసమయమే రాకా సమయము. ఈ సమయమునందే సత్పురుషులకు దివ్యదర్శన ములు జరుగుచుండును. దివ్యపురుషులను దర్శించుటకు కూడ ఇది తగిన సమయము. ' రాకా' సమయమునకు ఆరు గంటల పూర్వము నుండి ఆరుగంటల ఉత్తరభాగము వరకు సత్సాధకులు దివ్యపురుషుల దర్శనము చేయుటకు అవకాశమున్నది. అట్టి మహిమ కలది రాకా.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 314 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya
Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻

🌻 314. Rākenduvadanā राकेन्दुवदना (314)-1 🌻


Her face is compared to the full moon. Full moon is without blemishes. The full moon represents the dot (bindu) above the letter ‘Ī’ which gives rise to the bīja īṁ (ईं). At this stage the letter Ī (ई) has only a dot above it making it as īṁ (ईं), which is yet to transform as kāmakalā.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


20 Oct 2021

No comments:

Post a Comment