నిర్మల ధ్యానాలు - ఓషో - 82


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 82 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ


🍀. నిన్ను నువ్వు కనిపెట్టాలి. నువ్వెవరో కనిపెట్టాలి. అప్పుడు నువ్వు దేవుడని గుర్తిస్తావు. ఏ క్షణం నువ్వు దేవుడని గుర్తిస్తావో సమస్త అస్థిత్వం దైవత్వంలో ధగధగ లాడుతుంది. ప్రతి మనిషీ దేవుడే. అది అపూర్వమైన ఆనందం. సమస్త అస్తిత్వం దైవత్వంతో నీకు కనిపిస్తుంది. 🍀

ప్రతి మనిషీ దేవుడే. ఎవడూ మరొకటేదో అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే వున్నది దేవుడు మాత్రమే. దేవుడు అస్తిత్వానికి పర్యాయపదం. నువ్వు వున్నావంటే దేవుడు వున్నట్లే. కానీ ఆ విషయం మనం గుర్తించం. దాని పట్టింపే మనకుండదు. కాబట్టి సమస్య దైవత్వాన్ని ఎట్లా అందుకోవాలన్నది కాదు. దాన్ని ఎట్లా గుర్తించాలన్నదే ప్రశ్న. అది మనం మరిచిపోయిన భాష.

అక్కడ అప్పటికే వున్న దాన్ని మీరు గుర్తించడానికి సాయపడడం. ఏదీ సాధించాల్సిన పని లేదు. నిన్ను నువ్వు కనిపెట్టాలి. నువ్వెవరో కనిపెట్టాలి. అప్పుడు నువ్వు దేవుడని గుర్తిస్తావు. ఏ క్షణం నువ్వు దేవుడని గుర్తిస్తావో సమస్త అస్థిత్వం దైవత్వంలో ధగధగ లాడుతుంది. ప్రతి మనిషీ దేవుడే. అది అపూర్వమైన ఆనందం సమస్త అస్తిత్వం దైవత్వంతో నీకు కనిపిస్తుంది. నీ చుట్టు దేవతలు చుట్టు ముట్టి వుంటారు. సహజంగా నీ హృదయం నించీ గొప్ప ఆనందం పొంగిపొర్లుతుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


20 Oct 2021

No comments:

Post a Comment