🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 15 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 10. ఆశ్రమమునకు దారి - 1 🌻
గురువు ననుసరించుట, గురువిచ్చిన సూచనలు పాటించుట వలన కలుగు శ్రేయస్సు, సాధారణముగ సాధకులు గమనించుచునే యుందురు. అదియే పరమార్థముకాదని గుర్తింపవలెను. అది కేవలము మొదటి మెట్టు మాత్రమే. తదుపరి తనదైన యజ్ఞార్థ జీవిత మొకటి గురుబోధనలు ఆధారముగా చేసుకొని నిర్మింపవలెను.
బోధనలు పునాదివలె పని చేయవలెను. గురుబోధ యందు సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస అను అంశములు సాధ్యములు. అవి పునాదిగ సంఘ శ్రేయస్సునుద్దేశించి ఒక యజ్ఞార్ధ కర్మను నిర్వర్తించుట సాధకుని పురోభివృద్ధికి రెండవ మెట్టు.
సంఘమున యజ్ఞార్థకర్మలను నిర్వర్తించుట పర్వతారోహణము వలె కొంత కష్టముగ నుండును. పునాదులను నమ్మి ధర్మమును విశ్వసించి స్థిరమైన బుద్ధితో ఓపికగ బహుకాలము ఆచరించుట వలన కార్యము ఫలించును. ఈ సమయమున మాటిమాటికి గురువును పిలుచుట, సహాయమర్థించుట వీలుపడదు. ప్రార్థన ద్వారా గురుబలము నందుకొని పని చేయుట మాత్రమే నియమము. పైకి చూచుట, సహాయ మర్థించుట కాక సమర్పణ బుద్ధితో సంకల్పించిన యజ్ఞార్థ కర్మలు మాత్రమే యుండవలెను.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
20 Oct 2021
No comments:
Post a Comment