శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 359 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 359 -1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 359 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 359 -1🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀

🌻 359-1. 'తాపసారాధ్యా' 🌻


తాపసులచే ఆరాధింపబడునది శ్రీమాత అని అర్థము. జన్మ తాపములనుండి తరించుటకు తపస్సు ఒక ఉపాయము. జన్మ తాపములు మూడుగ ముందు నామములలో తెలుపబడినవి. వాని నుండి విమోచనము చెందుటకు సతతము శ్రీమాత నారాధించుట ఉత్తమోత్తమ ఉపాయము. ఆరాధన మనగా సర్వకాల సర్వావస్థల యందును శ్రీమాత చైతన్యమునే అంతట అన్నిట దర్శించు ప్రయత్నము. పంచ భూతములుగను, జీవుల ఆకారములుగను, కనపడు వస్తువుల ఆకారములుగను, వాని వాని స్వభావములుగను శ్రీమాతయే యున్నదని భావించి దర్శించుటకు చేయు ప్రయత్నమే ఆరాధన. ఇట్టి ఆరాధనమునకు సకాలము అకాలము లేదు. అన్ని కాలముల యందు దర్శన చింతన యుండును.

పుణ్య ప్రదేశములు, హీన ప్రదేశములు అని లేదు. అన్ని ప్రదేశముల యందు దర్శన చింతనయే యుండును. పాప రూపములు పుణ్య రూపములు లేవు. అన్ని రూపములందునూ శ్రీమాతనే దర్శించు ప్రయత్న ముండును. అట్లే అన్ని నామములు కూడ శ్రీమాతవే అను భావము వుండును. ఇట్లు భావించుట దర్శించుట నిజమగు తపస్సు. ఇట్టి తపస్సు చేయువారికి క్రమముగ అన్నిటియందు శ్రీమాత దర్శనము జరుగుట ఆరంభించును. విశ్వాత్మకమగు శుద్ధ చైతన్యము శ్రీమాతయే గనుక అది మాత్రము నిలచి ఇతరములు బాధింపని స్థితి ఏర్పడును. ఇట్టి అనన్యస్థితిలో తాపములు హరింప బడి తపస్సు చేయు జీవులు ఉద్ధరింపబడుదురు. ఈ ప్రయోజనమునకే శ్రీమాత ఆరాధనము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 359-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 79. Tapatrayagni santapta samahladana chandrika
Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻

🌻 359. Tāpasārādhyā तापसाराध्या 🌻


She is worshipped by ascetics. The ascetics are highly respectable as they abstain from all pleasurable objects in order to seek the Supreme Brahman. They do not worship demigods or goddesses as their only aim is to realize the Ultimate Reality. Worship by such ascetics goes to confirm that She is the Brahman.

There is yet another interpretation. Tāpa means bondage which is the root of all miseries. Sārādhyā is split into sāra (essence) + ā (deep) + dhyā (dhyān or meditation). The bondage arising out of saṁsāra can only be removed by meditating on Her. Through the essence of deep meditation, bondage can be removed.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


27 Mar 2022

No comments:

Post a Comment