మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 170
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 170 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. భావ బలము - 5 🌻
ఇంకొక యధార్థమేమనగా, ఉద్వేగమనునది ఉప్పెన కెరటములుగా మార్పు చెందు చుండును. భక్తి అట్లు గాక, నిశ్చల జలముల వలె మన యందు నిండిపోవును. స్పూర్తితో పుష్టి నొందిన భక్తి (పరమ ప్రేమ) అనభూతి కలిగిన వానిలో దృక్పథము మార్పు చెందుట జరుగదు. నాకు, నీ యెడల ప్రేమను అసత్యపు పేరుతో ఉద్వేగపూరితమైన సంగమున్నచో, అది తప్పక మిక్కిలి ధృడమై తీరును.
మరియు అతి ధృడమైన ద్వేషమును కలిగించకుండ యుండదు. ఉద్వేగ బంధితుడగు జీవుడు పశుప్రాయుడే. సెలవు రోజున తన ప్రియ స్నేహితుడు అతని వేరొక స్నేహితునితో కలిసి చరించుట గాంచినచో ఫలితమేమి? తనకు, అవతలి వాని యెడల గల ప్రేమకు ఫలముగా, అసూయా రోషములతో దుఃఖించుట దక్కును. ఇది ఉద్వేగముతో కలుషీకృతమైన ప్రేమ యొక్క ఫలితము.
...✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
27 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment