2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 30-2 - 342 - శ్రద్ధాభక్తులు🌹
3) 🌹. శివ మహా పురాణము - 540 / Siva Maha Purana - 540 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -170🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 159 / Osho Daily Meditations - 159🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 359 / Sri Lalitha Chaitanya Vijnanam - 359🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 27, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*
*🍀. ద్వాదశ ఆదిత్య ధ్యాన శ్లోకాలు - 12 🍀*
*🌟 12. పర్జన్యః –*
క్రతుర్వార్చా భరద్వాజః పర్జన్యః సేనజిత్ తథా |
విశ్వశ్చైరావతశ్చైవ తపస్యాఖ్యం నయంత్యమీ
ప్రపంచం ప్రతపన్ భూయో వృష్టిభిర్మాదయన్ పునః |
జగదానందజనకః పర్జన్యః పూజ్యతే మయా
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ధర్మ మార్గమే ఓటమి తెలియని మార్గం. ఏది ఏమైనా విడవకు ధర్మ మార్గం. అదే నీకు ముక్తికి మార్గం. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ దశమి 18:05:48 వరకు
తదుపరి కృష్ణ ఏకాదశి
నక్షత్రం: ఉత్తరాషాఢ 13:33:59 వరకు
తదుపరి శ్రవణ
యోగం: శివ 20:14:47 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: వణిజ 07:02:37 వరకు
వర్జ్యం: 17:21:40 - 18:53:08
దుర్ముహూర్తం: 16:50:31 - 17:39:25
రాహు కాలం: 16:56:38 - 18:28:18
గుళిక కాలం: 15:24:57 - 16:56:38
యమ గండం: 12:21:35 - 13:53:16
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:45
అమృత కాలం: 07:29:00 - 09:00:00
మరియు 26:30:28 - 28:01:56
సూర్యోదయం: 06:14:51
సూర్యాస్తమయం: 18:28:18
చంద్రోదయం: 02:36:46
చంద్రాస్తమయం: 13:56:31
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: మకరం
అమృత యోగం - కార్య సిధ్ది 07:51:00
వరకు తదుపరి ముసల యోగం - దుఃఖం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -342 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 30 📚*
*🍀 30-2. శ్రద్ధాభక్తులు - కనపడుచున్నది, వినపడుచున్నది దైవమే అని గుర్తుండిన చాలును. దీని వలన నిత్య స్మరణము, అనన్యచింతన సహజముగ నుండును. అట్టి వానికి సూటిగ దైవ సంబంధ మేర్పడును. తత్కారణముగ సాలోక్య, సామీప్య, సాయుజ్య, సారూప్యములు సిద్ధించును. రాజవిద్య యందు ఒకే ఒక సూత్రము తెలుప బడినది. అన్నిట అంతట, లోపల బయట దైవమును దర్శించుట. 🍀*
*30. అపి చేత్పుదురాచారో భజతే మా మనన్యభాక్ |*
*సాధురేవ సమంతవ్య స్సమ్యగ్వ్యవసితో హి సః ||*
*తాత్పర్యము : ఎంత దురాచారు డైనప్పటికిని అనన్య భక్తితో నన్ను సేవించునేని అతడు స్థిరమైన మనసును బొంది క్రమముగ సత్పురుషుడుగ తలంప బడుచున్నాడు.*
*వివరణము : రాజవిద్య యందు ఒకే ఒక సూత్రము తెలుప బడినది. అన్నిట అంతట, లోపల బయట దైవమును దర్శించుట. ఇది అందరికిని ప్రయత్నమున అందుబాటగు విషయము. పూజలు చేయుట, అభిషేకములు చేయుట, హోమములు చేయుట, యాగములు చేయుట- ఇత్యాదివి ఆవశ్యకత లేదు. మంత్రములు పేనుట (మరల మరల స్మరించుట), తంత్రశాస్త్రము నేర్చుకొనుట, యంత్రములను ధరించుట అవసరమే లేదు. వేద పారాయణములు, మండల దీక్షలు, తీర్ధయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనములు అవసరము లేదు. ప్రదక్షిణములు, పర్వతారోహణములు ఇత్యాది శ్రమ దైవము తెలుపలేదు. చూచుటకు కన్నులున్నవి. వినుటకు చెవు లున్నవి. కనపడుచున్నది, వినపడుచున్నది దైవమే అని గుర్తుండిన చాలును.*
*దీని వలన నిత్య స్మరణము, అనన్యచింతన సహజముగ నుండును. అట్టి వానికి సూటిగ దైవ సంబంధ మేర్పడును. తత్కారణముగ సాలోక్య, సామీప్య, సాయుజ్య, సారూప్యములు సిద్ధించును. విపరీతమగు ఆచారకాండలు, సంప్రదాయములు, కట్టు బాట్లు అనెడి తామరతంపర లేమియు ఉండవు. దైవాను సంధానము సులభముగ తెరిపిగ యుండును. దైవాను సంధానము ఎప్పుడునూ ఉండును. అట్లుండుటయే రాజయోగము. అందులకు మూలము రాజవిద్య. ఇట్లు సూటిగ దైవముతో మానవుడు అనుసంధానము చెందు విధానము ఉండగా, డొంక తిరుగుడు మార్గములలో శ్రమ పడుట వృథా.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 540 / Sri Siva Maha Purana - 540 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 48 🌴*
*🌻. కన్యాదానము - 5 🌻*
అపుడు ఆ పర్వతరాజగు హిమవంతడు మిక్కిలి ప్రసన్నుడై శివునకు కన్యాదానాంగముగా యథోచితమగు పురస్కారమునిచ్చెను (47). అపుడా హిమవంతుని బంధువులు పార్వతిని భక్తితో పూజించి విధి విధానముగా అనేక మంచి ద్రవ్యములను శివునకిచ్చిరి (48).
ఓ మహర్షీ ! అపుడు సంతసించిన మనస్సు గల హిమవంతుడు శివ పార్వతుల ఆనందము కొరకు బహు విధములు ద్రవ్యముల నొసంగెను (49). ఆయనకు వివిధ రత్నములను, రత్నములతో చేసిన సుందరమగు ఆభరణములను, వివిధ పాత్రలను, రక్షాబంధములను ఇచ్చెను (50). లక్ష గోవులు, సవారీకి సజ్జితము చేయబడిన వంద గుర్రములు, చక్కని ఆభరణములతో అలంకరింపబడి అనురాగము కలిగిన లక్ష దాసీలు (51). కోటి ఏనుగులు, కోటి బంగరు రథములు ఈయబడెను. ఓ మునీ! ఆ రథములలో శ్రేష్ఠరత్నములు పొదుగబడెను (52).
ఈ విధముగా హిమవంతడు తన కుమార్తె యగు పార్వతిని పరమేశ్వరుడగు శివునకు యథావిధిగా ఇచ్చి కృతార్థుడాయెను (53). అపుడు ఆ పర్వతరాజు చేతులు జోడించి శుక్లయజుర్వేద మాధ్యం దిన శాఖ యందలి స్తోత్రమును చక్కని స్వరముతో పఠించి ఆనందముతో పరమేశ్వరుని స్తుతింతచెను (54). తరువాత వేదవేత్త యగు ఆ హిమవంతునిచే అజ్ఞాపించబడిన మహర్షులు అపుడు పరమోత్సాహముతో పార్వతిని శిరస్సుపై అభిషేకించిరి (55).
ఓ మునీ! వారు అపుడు శివుని నామమును ఉచ్చరించి యధావిధిగా ప్రోక్షణమును చేసిరి. అచట మహానందమును కలిగించు మహోత్సవము ప్రవర్తిల్లెను (56).
శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో కన్యాదాన వర్ణనము అనే నలుబది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (48).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 540 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 48 🌴*
*🌻 The ceremonious entry of Śiva - 5 🌻*
47. Then the gleeful lord of mountains gave the ancillary articles of present to Śiva in a fitting manner.
48. Then his kinsmen worshipped Śiva with devotion and gave Pārvatī and monetary presents to Śiva in accordance with the various injunctions of the Śāstras.
49. O excellent sage, in order to please Śiva and Pārvatī, the delighted Himavat presented many gifts of articles.
50. He gave to Śiva some articles as dowry. Different kinds of gems and gemset vessels were given to him.
51. He gave a hundred thousand cows, a hundred horses duly fitted up and a hundred thousand servant maids of loving nature and endowed with all necessary articles.
52. O sage, he gave a crore of elephants and chariots inlaid with gold and made beautiful by gems.
53. Thus Himavat attained perfect satisfaction after giving his daughter Pārvatī to Śiva, the great lord, in accordance with the rules.
54. Then the lord of mountains with palms joined in reverence eulogised lord Śiva joyously with the hymns of the Yajurveda.[4]
55. Then at his behest, the sages jubilantly performed the holy ablution over the head of Pārvatī. Being conversant with the Vedas he asked them specially to perform this.
56. Repeating the names of lord Śiva, they performed Paryukṣaṇa rite.[5] There was a great jubilation and gaiety, O sage.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 170 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. భావ బలము - 5 🌻*
*ఇంకొక యధార్థమేమనగా, ఉద్వేగమనునది ఉప్పెన కెరటములుగా మార్పు చెందు చుండును. భక్తి అట్లు గాక, నిశ్చల జలముల వలె మన యందు నిండిపోవును. స్పూర్తితో పుష్టి నొందిన భక్తి (పరమ ప్రేమ) అనభూతి కలిగిన వానిలో దృక్పథము మార్పు చెందుట జరుగదు. నాకు, నీ యెడల ప్రేమను అసత్యపు పేరుతో ఉద్వేగపూరితమైన సంగమున్నచో, అది తప్పక మిక్కిలి ధృడమై తీరును.*
*మరియు అతి ధృడమైన ద్వేషమును కలిగించకుండ యుండదు. ఉద్వేగ బంధితుడగు జీవుడు పశుప్రాయుడే. సెలవు రోజున తన ప్రియ స్నేహితుడు అతని వేరొక స్నేహితునితో కలిసి చరించుట గాంచినచో ఫలితమేమి? తనకు, అవతలి వాని యెడల గల ప్రేమకు ఫలముగా, అసూయా రోషములతో దుఃఖించుట దక్కును. ఇది ఉద్వేగముతో కలుషీకృతమైన ప్రేమ యొక్క ఫలితము.*
...✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 159 / Osho Daily Meditations - 159 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 159. పూజించడం 🍀*
*🕉. పూజించడం లేదా ఆరాధన అనేది ఒక దృక్పథం. లోపల అనుభూతి చెందాల్సిన విషయం. ఆరాధన అంటే ఏమిటో ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. 🕉*
*ఆరాధన అనేది పసి హృదయంతో వాస్తవికతకు చేరువ అవడం. గణించడం కాదు, చాకచక్యం కాదు. దానిలో విశ్లేషించడం లేదు, కానీ విస్మయం లాంటి అద్భుతమైన అనుభూతిని కలిగి ఉంటుంది. అదెలాంటిది అంటే మీ చుట్టూ రహస్యమైనది ఏదో ఉందన్న భావన, దాచబడి ఉన్నవాటి ఉనికి యొక్క స్పర్శ, విషయాలు కనిపించే విధంగా లేవు అన్న తలంపు, స్వరూపం కేవలం అంచు మాత్రమే అని తెలిసి రావడం, కనిపిస్తున్న రూపానికి మించినది ఏదో ప్రాముఖ్యత కలిగినది దాగి ఉంది అనే అనుభూతి. ఒక పిల్లవాడు సీతాకోకచిలుక వెంట పరుగెత్తినప్పుడు, అతను పూజించే వాడు. లేదా అతను అకస్మాత్తుగా ఒక మార్గం గుండా వచ్చి ఒక పువ్వును చూసినప్పుడు - కేవలం ఒక సాధారణ గడ్డి పువ్వు, కానీ పిల్లవాడు లోతైన ఆశ్చర్యంతో అక్కడ నిలబడి ఉంటాడు.*
*లేదా అతను ఒక పామును చూసినప్పుడు మరియు ఆశ్చర్యంగా మరియు శక్తితో నిండినప్పుడు. పిల్లవాడికి ప్రతి క్షణం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ పిల్లవాడు ఏమీ తీసుకోడు; అది పూజా వైఖరి. కానీ మీరు ఎప్పుడైతే విషయాలను తేలికగా తీసుకోవడం ప్రారంభిస్తారో , ఇది ఇంతే అనుకోవడం మొదలు పెడతారో , మీరు గట్టి పడిపోతున్నారని అర్ధం. వెంటనే మీలోని పసితనం కనుమరుగవుతుంది, మీ అద్భుతం చనిపోతుంది. హృదయంలో ఆశ్చర్యం లేనప్పుడు, అక్కడ ఇంక పూజ అనేది ఉండదు. ఆరాధన అంటే జీవితం చాలా రహస్యమైనదని, దానిని అర్థం చేసుకోవడానికి నిజంగా ఏ మార్గం లేదని, అన్నింటికంటే అది అతీతమైనదని అర్థం అవడం; అక్కడ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. మనం ఎంత ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, అది మరింత తెలియదని అనిపించే స్థితి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 159 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 159. WORSHIP 🍀*
*🕉 The attitude if worship is something that has to be felt within. People have completely forgotten what worship really means. 🕉*
*Worship is approaching reality with a child's heart--not calculating, not cunning, not analyzing, but full of awe, of a tremendous feeling of wonder. It is a feeling of mystery surrounding you, the presence of the hidden, that things are not as they appear to be. It is to know that the appearance is just the periphery, that beyond the appearance something of tremendous significance is hiding. When a child runs after a butterfly, he is worshipful. Or when he suddenly comes across a path and sees a flower-just an ordinary grass flower, but the child stands there in deep wonder.*
*Or when he comes across a snake and is surprised and full of energy. Each moment brings some surprise. The child takes nothing for granted; that is the attitude of worship. Never take anything for granted. Once you start taking things for granted, you are settling. Your child is disappearing, your wonder is dying, and when there is no wonder in the heart, there can be no worship. Worship means that life is so mysterious that there is really no way to understand it. It surpasses understanding; all our efforts fail. And the more we try to know, the more unknowable it seems.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 359 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 359 -1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।*
*తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀*
*🌻 359-1. 'తాపసారాధ్యా' 🌻*
*తాపసులచే ఆరాధింపబడునది శ్రీమాత అని అర్థము. జన్మ తాపములనుండి తరించుటకు తపస్సు ఒక ఉపాయము. జన్మ తాపములు మూడుగ ముందు నామములలో తెలుపబడినవి. వాని నుండి విమోచనము చెందుటకు సతతము శ్రీమాత నారాధించుట ఉత్తమోత్తమ ఉపాయము. ఆరాధన మనగా సర్వకాల సర్వావస్థల యందును శ్రీమాత చైతన్యమునే అంతట అన్నిట దర్శించు ప్రయత్నము. పంచ భూతములుగను, జీవుల ఆకారములుగను, కనపడు వస్తువుల ఆకారములుగను, వాని వాని స్వభావములుగను శ్రీమాతయే యున్నదని భావించి దర్శించుటకు చేయు ప్రయత్నమే ఆరాధన. ఇట్టి ఆరాధనమునకు సకాలము అకాలము లేదు. అన్ని కాలముల యందు దర్శన చింతన యుండును.*
*పుణ్య ప్రదేశములు, హీన ప్రదేశములు అని లేదు. అన్ని ప్రదేశముల యందు దర్శన చింతనయే యుండును. పాప రూపములు పుణ్య రూపములు లేవు. అన్ని రూపములందునూ శ్రీమాతనే దర్శించు ప్రయత్న ముండును. అట్లే అన్ని నామములు కూడ శ్రీమాతవే అను భావము వుండును. ఇట్లు భావించుట దర్శించుట నిజమగు తపస్సు. ఇట్టి తపస్సు చేయువారికి క్రమముగ అన్నిటియందు శ్రీమాత దర్శనము జరుగుట ఆరంభించును. విశ్వాత్మకమగు శుద్ధ చైతన్యము శ్రీమాతయే గనుక అది మాత్రము నిలచి ఇతరములు బాధింపని స్థితి ఏర్పడును. ఇట్టి అనన్యస్థితిలో తాపములు హరింప బడి తపస్సు చేయు జీవులు ఉద్ధరింపబడుదురు. ఈ ప్రయోజనమునకే శ్రీమాత ఆరాధనము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 359-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 79. Tapatrayagni santapta samahladana chandrika*
*Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻*
*🌻 359. Tāpasārādhyā तापसाराध्या 🌻*
*She is worshipped by ascetics. The ascetics are highly respectable as they abstain from all pleasurable objects in order to seek the Supreme Brahman. They do not worship demigods or goddesses as their only aim is to realize the Ultimate Reality. Worship by such ascetics goes to confirm that She is the Brahman.*
*There is yet another interpretation. Tāpa means bondage which is the root of all miseries. Sārādhyā is split into sāra (essence) + ā (deep) + dhyā (dhyān or meditation). The bondage arising out of saṁsāra can only be removed by meditating on Her. Through the essence of deep meditation, bondage can be removed.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment