🌹 . శ్రీ శివ మహా పురాణము - 540 / Sri Siva Maha Purana - 540 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 48 🌴
🌻. కన్యాదానము - 5 🌻
అపుడు ఆ పర్వతరాజగు హిమవంతడు మిక్కిలి ప్రసన్నుడై శివునకు కన్యాదానాంగముగా యథోచితమగు పురస్కారమునిచ్చెను (47). అపుడా హిమవంతుని బంధువులు పార్వతిని భక్తితో పూజించి విధి విధానముగా అనేక మంచి ద్రవ్యములను శివునకిచ్చిరి (48).
ఓ మహర్షీ ! అపుడు సంతసించిన మనస్సు గల హిమవంతుడు శివ పార్వతుల ఆనందము కొరకు బహు విధములు ద్రవ్యముల నొసంగెను (49). ఆయనకు వివిధ రత్నములను, రత్నములతో చేసిన సుందరమగు ఆభరణములను, వివిధ పాత్రలను, రక్షాబంధములను ఇచ్చెను (50). లక్ష గోవులు, సవారీకి సజ్జితము చేయబడిన వంద గుర్రములు, చక్కని ఆభరణములతో అలంకరింపబడి అనురాగము కలిగిన లక్ష దాసీలు (51). కోటి ఏనుగులు, కోటి బంగరు రథములు ఈయబడెను. ఓ మునీ! ఆ రథములలో శ్రేష్ఠరత్నములు పొదుగబడెను (52).
ఈ విధముగా హిమవంతడు తన కుమార్తె యగు పార్వతిని పరమేశ్వరుడగు శివునకు యథావిధిగా ఇచ్చి కృతార్థుడాయెను (53). అపుడు ఆ పర్వతరాజు చేతులు జోడించి శుక్లయజుర్వేద మాధ్యం దిన శాఖ యందలి స్తోత్రమును చక్కని స్వరముతో పఠించి ఆనందముతో పరమేశ్వరుని స్తుతింతచెను (54). తరువాత వేదవేత్త యగు ఆ హిమవంతునిచే అజ్ఞాపించబడిన మహర్షులు అపుడు పరమోత్సాహముతో పార్వతిని శిరస్సుపై అభిషేకించిరి (55).
ఓ మునీ! వారు అపుడు శివుని నామమును ఉచ్చరించి యధావిధిగా ప్రోక్షణమును చేసిరి. అచట మహానందమును కలిగించు మహోత్సవము ప్రవర్తిల్లెను (56).
శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో కన్యాదాన వర్ణనము అనే నలుబది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (48).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 540 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 48 🌴
🌻 The ceremonious entry of Śiva - 5 🌻
47. Then the gleeful lord of mountains gave the ancillary articles of present to Śiva in a fitting manner.
48. Then his kinsmen worshipped Śiva with devotion and gave Pārvatī and monetary presents to Śiva in accordance with the various injunctions of the Śāstras.
49. O excellent sage, in order to please Śiva and Pārvatī, the delighted Himavat presented many gifts of articles.
50. He gave to Śiva some articles as dowry. Different kinds of gems and gemset vessels were given to him.
51. He gave a hundred thousand cows, a hundred horses duly fitted up and a hundred thousand servant maids of loving nature and endowed with all necessary articles.
52. O sage, he gave a crore of elephants and chariots inlaid with gold and made beautiful by gems.
53. Thus Himavat attained perfect satisfaction after giving his daughter Pārvatī to Śiva, the great lord, in accordance with the rules.
54. Then the lord of mountains with palms joined in reverence eulogised lord Śiva joyously with the hymns of the Yajurveda.[4]
55. Then at his behest, the sages jubilantly performed the holy ablution over the head of Pārvatī. Being conversant with the Vedas he asked them specially to perform this.
56. Repeating the names of lord Śiva, they performed Paryukṣaṇa rite.[5] There was a great jubilation and gaiety, O sage.
Continues....
🌹🌹🌹🌹🌹
27 Mar 2022
No comments:
Post a Comment