🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 81 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 33
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. అథ పవిత్రారోపణ విధానమ్ - 1 🌻
అగ్ని రువాచ
పవిత్రారోపణం వక్ష్యే వర్షపూజాఫలం హరేః | ఆషాఢాదౌ కార్తికాన్తే ప్రతిప త్త్యజ్యతే తిథిః. 1
శ్రియా గౌర్యా గణశస్య సరస్వత్యా గుహస్య చ | మార్తణ్డమాతృదుర్గాణాం నాగర్షిహరిమన్మథైః. 2
శివస్య బ్రహ్మణస్తద్వద్ద్వితీయాదితిథేః క్రమాత్ | యస్య దేవస్య యో భక్తః పవిత్రా తస్య సా తిథిః. 3
అగ్నిదేవుడు పలికెను : మునీ! ఇపుడు నేను పవిత్రారోపణమను గూర్చి చెప్పెదను. సంత్సరమునందు ఒక మారు పవిత్రారోపణము చేసినచో, సంవత్సర మంతయు శ్రీహరి పూజ చేసిన ఫలము నిచ్చును. ఆషాఢశుక్ల ఏకాదశి మొదలు కార్తిక శుక్లైకాదశి వరకు నున్న కాలమున పవిత్రారోపణము చేయవలెను.
ప్రతిపత్తు విడువవలెను. ద్వితీయాదితిథులు క్రమముగ లక్ష్మాదిదేవతల తిథులు. ద్వితీయ లక్ష్మికి, తృతీయ గౌరికి, చతుర్థి గణశునికి, పంచమి సరస్వతికి, షష్ఠి కుమారస్వమికి, సప్తమి సూర్యునకు, అష్టమి మాతృదేతలకు, నవమి దుర్గకు, దశమి నాగులకు, ఏకాదశి ఋషులకు, ద్వాదశి విష్ణువునకు, త్రయోదశి మన్మథునకు, చతుర్దశి శివునకు, పౌర్ణమాస్యవాస్యలు బ్రహ్మకు సంబంధించినవి. ఏ ఉపాసకుడు ఏ దేవతను ఉపాసించునో ఆతనికి ఆ దేవతయొక్క తిథి పవిత్ర మైనది.
ఆరోహణే తుల్యవిధిః పృథఙ్ మన్త్రాదికం యది | సౌవర్ణం రాజతం తామ్రం నేత్రకార్పాసకాదికమ్. 4
పవిత్రారోపణవిధి అందరు దేవతలకును సమానమే. మంత్రాదులు మాత్రమే ఆయా దేవతలకు వేరు వేరుగా నుండును. పవిత్రకమును నిర్మించుటకై బంగారము, వెండి రాగి తీగలను నూలు దారముగాని ఉపమోగింపవలెను.
బ్రాహ్మణ్యా కర్తితం సూత్రం తదలాభే తు సంస్కృతమ్ |
ద్విగుణం త్రిగుణీకృత్య తేన కుర్యాత్ పవిత్రకమ్. 5
అష్టోత్తరశతాదూర్ధ్వం తదర్ధం చోత్తమాదికమ్ | క్రియాలోపవిఘాతార్థం యత్త్వయాభిహితం ప్రభో. 6
మయా తత్ర్కియతే దేవ యథా యత్ర పవిత్రకమ్ | అవిఘ్నం తు భవేదత్ర కురు నాథ జయావ్యయ. 7
బ్రాహ్మణస్త్రీచేతితో వడికిన నూలు చాల శ్రేష్ఠమైనది. అది లభించనిచో ఏ దారము నైనను గ్రహించి, దానిని సంస్కరించి, ఉపమోగింపవలెను.
దారమును మూడుపేటలు చేసి, మరల దానిని మూడు పేటలు చేసి, దానితో పవిత్రకమును నిర్మింపవలెను. నూట ఎనిమిది మొదలు అధికము లగు తంతువులతో నిర్మించిన పవిత్రకము ఉత్తమాదిశ్రేణికి చెందినదిగ పరిగణింపబడుచున్నది.
పవిత్రరోపణమునకు ముందు ఇష్టదేవతను గూర్చి ఈ విధముగ ప్రార్థింపవలెను. ''ప్రభూ! క్రియాలోపమువలన కలిగిన దోషమును తొలగించుటకై నీవు ఏ సాధమును చెప్పినావో దానినే నేను చేయుచున్నాను.
ఎక్కడ ఏ పవిత్రకము ఆవశ్యకమో అక్కడ అట్టి పవిత్రకమునే అర్పించగలను. నీ కృపచే ఈ కార్యమునందు విఘ్నబాధ లేవియు కలుగకుండుగాక. అవినాశి యైన పరమేశ్వరా! నీకు జయ మగుగాక.
ప్రార్థ్యతన్మణ్డలాయాదౌ గాయత్ర్యా బన్ధయేన్నరః | ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. 8
తన్నో విష్ణుః ప్రచోదయాద్దేవదేవానురూపతః | జానూరునాభినాసాన్తం ప్రతిమాసు పవిత్రకమ్. ప9
పాదాన్తా వనమాలా స్యాదష్టోత్తర సహస్రతః | మాలాం తు కల్పసాధ్యాం వా ద్విగుణాం షోడశాఙ్గులామ్. 10
కర్ణికా కేసరం పత్రం మన్త్రాద్యం మణ్డలాన్తకమ్ | మణ్డలాఙ్గులమాత్రైక చక్రాబ్జాదౌ పవిత్రకమ్. 11
స్థణ్డిలే7ఙ్గులమానేన ఆత్మనః సప్తవింశతిః |
ఈ విధముగ ప్రార్థించు పవిత్రకమును ఇష్టదేవతామండలమునకు గాయత్రీమంత్రముతో కట్టవలెను. ''ఓం నమో నారాయణాయ విద్మహే, వాసుదేవాయ దీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్'' అనునది ఇష్టదేవత యగు నారాయణుని గాయత్రీమంత్రము. ఈ గాయత్రీ ఇష్టదేవతానామానుసారముగ ఉండును. దేవప్రతిమలపై అర్పించుటకు అనేకవిధములగు పవిత్రకము లుండును.
విగ్రహముయొక్క నాభివరకు వచ్చునది ఒకటి; తొడలవరకు వచ్చునది మరి యొకటి మోకాళ్ళవరకు వచ్చునది మరియొకటి. పాదములవరకు వ్రేలాడునది ఒకటి. చివరిదానికి వనమాల అని పేరు. దానిని ఒక వెయ్యి ఎనిమిది దారములతో నిర్మింపవలెను.
సాధారణమాలను శక్త్యనుసారము నిర్మింపవలెను. లేదా అది పదునారు అంగుళములకంటె రెట్టింపు పెద్దదిగా ఉండవలెను. కర్ణికా-కేసర-దళాదులుగల యంత్ర-చక్రదిమండలములపై వేయు పవిత్రకము పైనుండి క్రిందివరకును కప్పునదిగా ఉండవలెను.
ఒక చక్రము, ఒక కమలము ఉన్న మంక్షలముపై ఆ మండలము ఎన్ని అంగుళము లున్నదో అన్ని అంగుళముల పవిత్రకము అర్పింపవలెను. వేదిపై అర్పించు పవిత్రకము తన చేతి అంగుళములతో ముప్పదియేడు అంగుళముల పొడ వుండవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం
30.Aug.2020
No comments:
Post a Comment