భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 97
🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 97 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శంఖలిఖిత మహర్షులు - 3 🌻
14. అంతఃకరణలో ధర్మంమీద శ్రద్ధకలిగినవాడు భారతదేశం మళ్ళీ ఒక భూలోకస్వర్గం అవుతుంది. ఋషులకు మనయందు అనుగ్రహం ఉందికాని, మాటవినని కొడుకును తండ్రి ఎలా చూస్తాడు?
15. అలాగే, వారి మార్గాన్ని అనుసరించకపోవడంచేత మనకు ఒక దోషం సంక్రమించింది. ఈ రాజకీయ స్వాతంత్రము, ఈ ఇండస్ట్రీస్, కమ్మునికేషన్స్ వీటివల్ల మనకు వచ్చేటటువంటి గొప్ప ఏమీలేదు.
16. దీనివల్ల మనకు ఆత్మగౌరవం పెరగదు. జ్ఞానం పెరగదు. శాంతి సుఖములుకూడా దీనివల్ల అసలే పెరగవు. అశాంతి, అసౌఖ్యము, దుఃఖము, భయము, ఎప్పుడూ ఆపద, మృత్యుభయము ఇవన్నీ మనను వెంటాడుతూనే ఉంటాయి, ఇన్నీ ఉండికూడా ఈ సంపదలన్నీ ఎప్పుడూ మనిషి విషయంలో శాశ్వతంకాదు. దేశానికి సంపద శాశ్వతం కావచ్చుకానీ మనిషికి కాదు.
17. “ఈ పశువధ మానండి. ఇది చాలా భయంకరంగా ఉంది” అని చాలా మంది పదేపదే వాస్తున్నారు, అనేకమంది అంటున్నారు. అంటే, ఇన్ని పశువులను వధించటము క్రూరమని నేడు అంటున్నాదు. ఇంత భారీస్థాయిలో ప్రతీ ఊళ్ళోను అనేకవందల పశువులను చంపడం నాడు లేదు. ఇప్పుడు లక్షలాది పశువులను ఒక్కొక్కరోజున క్షణంలో చంపేటటువంటి ఈ యాంత్రిక విధానం ఎప్పుడాఇతే వచ్చిండో, అది ఆలోచించదగిన విషయం.
18. మన మహర్షులు చెప్పినటువంటి బోధలు, వారు మనకిచ్చిన ప్రాపంచికమైన కర్తవ్యాలు మరచిపోయామని గుర్తుచేసుకోవాలి. వారు లోకహితం కోరి మనకు ఎన్నో ధర్మాలు చెప్పారు. తమ సంతానం మాత్రమే బాగుండాలనికాదు. మహర్షుల యొక్క ఉద్దేశ్యం తమ సంతానంవలన లోకానికి హితం జరగాలి. తద్వారా సంతానం పుణ్యశ్లోకులుకావాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
30.Aug.2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment