శివగీత - 47 / ŤĤĔ ŚĨVĂ-ĞĨŤĂ - 47


🌹.  శివగీత - 47 / The Siva-Gita - 47  🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ
ఏడవ అధ్యాయము

🌻. విశ్వరూప సందర్శన యోగము - 1 🌻

శ్రీరామ ఉవాచ:

భగవ! న్యన్మయా స్పష్టం - తత్త థైవ స్థితం విభో !
అత్రోత్తరం మయా లబ్దం - త్వత్తో నైన మహేశ్వర ! 1

పరిచ్చిన్న పరీమాణే - దేహే భగవత స్తవ,
ఉత్పత్తి స్సర్వ భూతానాం - స్థితిర్వా విలయః కథమ్ ? 2

స్వస్వాది కార సంబద్దా కథం - నామ స్థితా స్సురా :,

తే సర్వేత్వం కథం దేవ! - భువనాని చతుర్ధశ 3
త్వత్త స్శ్రుత్వాపి దేవాత్ర - సందేహొ మే మహాన భూత్,

అప్రత్యాయిత చిత్త స్య - సంశయం చేత్తు మర్హసి 4
ఓ స్వామీ!

ఇంతవరకు నేనడిగిన ప్రశ్నకు సమాధానము అనుగ్రహించక పోయితిరి. ప్రాణులు పరిమిత పరిమాణంబగు నిజ శరీరంబున ఎటులద్భ వించుచున్నది. ఏ విధముగా పరిమిత పరిమాణంబగు నిజ శరీరంబున ఎటుల ఉద్భవించుచున్నది? ఏ విధముగా వర్ధిల్లుచున్నది? మళ్ళీ ఏవిధముగా లయ మగుచున్నది?

తమ తమ అధికారములో నుండి సృష్ట్యాదుల గావింపుచున్న బ్రహ్మాది దేవతలును చతుర్దశ భువనంబులను నీ వెట్లైతివి? నాకు తెలియచేయుము.

ఈ విషయమునంతయు నీ వలన పలుమార్లు ఆలకించినప్పటికిన్ని నా చిత్తము నిశ్చలముగా నుండనందులకు సంశయించితిని, కనుక ఇట్టి సంశయమును నివారించుటకు మీరే సమర్ధులు.

శ్రీభగవానువాచ:-

వటబీజే సు సూక్ష్మే పి - మహావటరుర్యథా,
సర్వదా స్తే న్యథా వృక్షః - కుత అయాతి త ద్వద 5

తద్వన్మ తనౌ రామ! - భూతానా మాగ తిర్లయ:,
మహా సైంధవ పిండోపి - జలే క్షి ప్తో విలీయతే 6

న దృశ్యతే పునః పాకా - తత్త ఆయాతి పూర్వవత్,
ప్రాతః ప్రాత ర్యథా లోకో - జాయతే సూర్య మండలాత్ 7

ఏవం మత్తో జగత్సర్వం - జాయతేస్తి విలీయతే,
మయ్యేవ సకలం రామ! - తద్వ జ్ఞానీహి సువ్రత! 8

ఓ రామా!

జగత్తులో మిక్కిలి చిన్నదగు మర్రి విత్తనములో గొప్పవట (మర్రి) వృక్షము నిండి యుండి సమయము ననుసరించి మరల వెలువడునట్లుగా నిఖిల ప్రాణికోటి నా శరీరమునుండే బయలుదేరు చున్నవి. మళ్ళీ నాయందే లీనమగుచున్నవి.

సైంధవ పిండము (ఉప్పు ముద్దను) జలములో బడవైచిన యది కరిగిపోయి మరల పాకము చేయగా మొదటి స్వరూపమునే బొందునట్లుగా ప్రాతఃకాలమున వెలుగుతో నిండి జగత్తును ప్రకాశింపచేయు విధమున సమస్త లోకములు నానుండే బుట్టి నాలోనే లయంబగుచున్నవి.

శ్రీరామ ఉవాచ:-

కథి తేపి మహాభాగ !- దిగ్జడ స్య య థా దిశి
నివర్తతే భ్రమో నైవ - తద్వ న్మమ కరోమికి మ్ 9

శ్రీరాముడు పలుకుచున్నాడు:-

ఓ మహానుభావా! నే వెన్ని రకాలుగా నాకు బోధించినప్పటికిన్ని దిగ్భ్రాంతి చెందిన మానవుడికి దిక్కుతోచనట్లుగా, నాకేమియు తెలియుటలేదు. నేనేమి చేయుదును?

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹  The Siva-Gita - 47  🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 07 :
🌻 Vishwaroopa Sandarshana Yoga - 1
🌻

Sri Rama said:

O Swami! Till now I didn't get clarification on my root doubt.

How are all the creatures originating from your body of perceivable and limited dimensions? How are they getting survived? And again how are they getting dissolved in you?

How are you present in the form of Brahma and other gods doing their respective duties and how are you in the form of these vast fourteen worlds? Kindly clarify this to me.

This has already been told by you but I am not able to get clarity over this subject. Hence I have this doubt, and you alone are capable of clarifying my doubt.

Sri Bhagavan said:

O Rama! In this world as like as inside the small banyan seed a giant banyan tree resides and when right time comes from that small seed's core a huge banyan tree comes outside; in the same way, the entire creation and creatures emerge from my body.

And at the end of time they again enter inside me only. The way Saindhava (salt) melts in water and becomes one with it and when water gets evaporated it regains its previous form viz. salt;

similarly all these worlds take birth from me and enter back into me only.

Sri Rama said: O Mahanubhava! In whatever number of ways through whatever examples you tried to explain me that concept; like a confused person who fails to discern, I am not able to understand that properly. What should i do now?

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

30.Aug.2020

No comments:

Post a Comment