శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 29, 30 / Sri Lalitha Chaitanya Vijnanam - 29, 30

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 18 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 29, 30 / Sri Lalitha Chaitanya Vijnanam - 29, 30 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

12 అనాకలిత సాదృశ్య చుబుకశ్రి విరాజిత

కామేశ బద్ధమాంగాల్య సూత్ర శోభిత కంధర

🌻 29. 'అనాకలిత సాదృశ్య చుబుకశ్రి విరాజిత 🌻

అమ్మవారి చుబుకంతి నిరుపమానము. అనగా దేనితోనూ

పోల్చిచెప్పుటకు సాధ్యపడని అంశము. సరస్వతి మొదలుకొని సమస్త కవులకు వర్ణించుటకు ఏ ఉపమానము లభ్యముకానంత అందమైన చుబుకము అమ్మవారి చుబుకము. సాధకుడు తనకు తానుగ ఊహించు కొనవలసిన అందమైన చుబుకమేగాని, పోల్చిచెప్పుటకు ఉపమానము లేదు.

కొన్ని దివ్య విషయములు సాధకుని ఊహకు వదలుట సహజమైన ఋషి సంప్రదాయము. సాధకుడు తనకు తానుగా కాంతి రూపమును ఊహించుట ఇచ్చట సంకేతింపబడినది. నామమును స్తోత్రము చేయునప్పుడు తత్సంబంధమైన కాంతిరూపమును ఉపాసకుడు ఊహింపవలెను.

కాంతివంతమైన రూపమును తాను ఊహించి దర్శించుచున్న కొలదియూ ఉపాసకునిలో కాంతి పెరుగును. యాంత్రికమైన స్తోత్రాదికములు చేయుటలో శ్రమయేగాని, ఫలము దక్కదు. దేవి నామములను, ప్రత్యేకించి ఆయా రూపములను వర్ణించు నామములను పఠించునపుడు కాంతి రూపమును దర్శించుట ఉపాసకునకు ప్రాథమిక కర్తవ్యము.

కాంతిని స్తోత్రాదికములు చేయుచూ ఊహించుట దీక్షగ సాగినచో సాధకుడు తన పరిసరములను మరచి కాంతిలోకమున చేరును. కాంతి లోకమున మనసు నిలబడుటవలన బుద్ధికిని, మనసునకును వంతెన నిర్మాణము కాగలదు. అది కారణముగ సాధకునియందు క్రమశః దైవీస్వభావము ఏర్పడుట, ముఖము నందు, కన్నులయందు కాంతి పెరుగుట జరుగగలదు.

నిరుపమానమైన, కాంతివంతమైన చుబుకము అందమైన దేవి ముఖమునకు దీటుగ నూహించి, శ్రీదేవి ముఖధ్యానము పరిపూర్తి గావించుకొన వలెను. కేశపాశములు మొదలుకొని చుబుకము వరకు గల వర్ణనము స్తోత్రము చేయువాని మనస్సును ఆకర్షింపచేయగలదు. పన్నెండవ నామము నుండి ఇరవైతొమ్మిదవ నామము వరకు పదునెనిమిది నామములతో దేవి ముఖ వర్ణనము రమణీయముగ చిత్రింపబడినది.

అర్థసహితముగ మనసు పెట్టి ఈ నామములను రాగయుక్తముగ ఆలాపన చేయు సత్సాధకునకు శ్రీదేవి ముఖము సమస్త సన్మంగళములను కూర్చును గాక!

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹  Sri Lalitha Chaitanya Vijnanam - 29  🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 29. Anākalita sādṛśya cibuka śrī-virājitā अनाकलित-सादृश्य-चिबुक-श्री-विराजिता (29) 🌻

She has the most beautiful chin. Saundarya Laharī (verse 67) says “Your incomparable chin that is touched by the forepart of the hand of Śiva is raised frequently out of His eagerness to drink the nectar of your lower lip.”

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🌹.   శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 30 / Sri Lalitha Chaitanya Vijnanam - 30  🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

12 అనాకలిత సాదృశ్య చుబుకశ్రి విరాజిత

కామేశ బద్ధమాంగాల్య సూత్ర శోభిత కంధర

🌻 30. కామేశ బద్ధమాంగాల్య సూత్ర శోభిత కంధర 🌻

కామేశ్వరునిచే కట్టబడిన సౌభాగ్యకారకమైన మంగళసూత్రముచే ప్రకాశించు మెడగలది శ్రీదేవి. ఇచ్చట వర్ణనము శ్రీదేవి మెడనుగూర్చి అందమైన ఆమె మెడకు మంగళసూత్రము మరింత శోభ కలిగించినది.

ఆ మంగళసూత్రము కూడ విశిష్టమైనది. ఎందువలనన కామమునకు ఈశ్వరుడగు శివునిచే కట్టబడినది కదా! శివుడు కామేశ్వరుడు. అనగా మన్మథునకు కూడ ప్రభువు.

మన్మథుడు అతని కనుసన్నల ఆజ్ఞల ననుసరించి జీవించవలసినదే. కామమును ఉజ్జీవింప జేయుటకు, హరించుటకు అధికారముగల ఈశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రమిది.

సాధారణముగ జీవులలో మంగళసూత్ర ధారణము చేయు సమయమున పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఒకరి కనులలోనికి ఒకరు చూచుకొనునప్పుడు కాముడు జనించి ఒకరికొకరు ఆకర్షితులగుదురు.

దాంపత్య జీవనమున పరస్పర ఆకర్షణ ప్రాథమికముగ కామాకర్షణయే. మంగళసూత్ర ధారణ కారణముగ మన్మథుడుధ్భవించి చెలరేగును.

కాని, ఇచ్చట మంగళసూత్రము కట్టినది కామేశుడు. మన్మథుడు తనంతట తానుగ చెలరేగుటకు అవకాశము లేదు.

అందుచే వర్ణింపబడిన మంగళసూత్రము విశిష్టమైనది. ఆ మంగళసూత్రము అలంకరించిన మెడ కూడ సరిసమానమైన విశిష్టత గలది. శ్రీదేవి కాంతులీను మెడవలన మంగళ సూత్రము శోభించుచున్నది.

పరమశివుడు కట్టిన మంగళసూత్రము కారణముగ అమ్మవారి మెడకూడ శోభించుచున్నది. మంగళసూత్రము కామసంజనకము కానప్పుడు అది సౌభాగ్య కారణ మగును. కనులు కనులతో కలసిన సమయమున జీవాకర్షణము జనియించినచో వివాహము సౌభాగ్యప్రదము కాగలదు. అట్టి సౌభాగ్యమును సూచించు సూత్రము కావున అది వట్టి దారము కాక మంగళసూత్రమైనది. మంగళ సూత్ర ధారణము వేదము నందు ప్రస్తావింపబడలేదు.

దక్షిణభారతమున ఏర్పడిన ప్రాచీన సంప్రదాయ మిది. స్త్రీ-పురుషులకు పరస్పర బాధ్యతలను, బద్ధ జీవనమును గుర్తుచేయు సంకేతమే ధరింపబడిన మంగళసూత్రము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Lalitha Chaitanya Vijnanam - 30   🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 30. Kāmeśa- baddha- māṅgalya- sūtra- śobhita- kandharā कामेश-बद्ध-माङ्गल्य-सूत्र-शोभित-कन्धरा (30) 🌻

Her neck is adorned with the māṅgalya sūtra (married women wear this) tied by Kāmeśvara.

Saundarya Laharī (verse 69) says “The three lines on your neck indicating the number of strings in the auspicious cord fastened at the time of your wedding shine like boundaries, delimiting the position of the gamut, the repositories, of the treasures of various kinds of melodious rāga-s (tunes).”

The tying of māṅgalya sūtra is not discussed in Veda-s and possibly a custom followed in later days.

As per sāmudrikā śāstra, (interpretation of features of the body) three fine lines in the forehead, eyes or hip indicate prosperity.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


10 Oct 2020

No comments:

Post a Comment