శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 2 / Sri Devi Mahatyam - Durga Saptasati - 2



🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 2 / Sri Devi Mahatyam - Durga Saptasati - 2 🌹

✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ


అధ్యాయము 1

🌻. మధు కైటభుల వధ వర్ణనము - 2 🌻

అతణ్ణి ఇలా ప్రశ్నించాడు : నీవు ఎవరు? ఇక్కడికి రావడానికి కారణము ఏమిటి? శోకగ్రస్తునిలా, ఖిన్నునిలా, కానిపిస్తున్నావెందుకు? సస్నేహంగా పలుకబడ్డ ఈ రాజవాక్యాలను విని వైశ్యుడు వినయపూర్వకంగా (శిరస్సు) వంచి రాజుకు ఇలా బదులిచ్చాడు. (18-19)

వైశ్యుడు పలికెను : నేను సమాధి అనే పేరుగల వైశ్యుణ్ణి, ధనికుల ఇంట జన్మించాను. ధనంపై దురాశతో అసాధువృత్తిని అవలంబించి నా భార్యాపుత్తులు నన్ను విడనాడి, నా ధనాన్ని అపహరించి, నన్ను తరిమేసారు.

భార్యాపుత్తులను ధనాన్ని కోల్పోయి, ఆప్త బంధువులచే విడనాడబడి దుఃఖీ పహతుడనై నేను ఈ అడవికి వచ్చాను. ఇక్కడ ఉండటం వల్ల నా స్వజనుల, భార్యాపుత్రుల కుశలాకుశలాలు నాకేమీ తెలియడంలేదు. (20-23)

ఇంటివద్ద వారిప్పుడు క్షేమంగా ఉన్నారా, క్షేమాన్ని కోల్పోయి దుర్దశను అనుభవిస్తున్నారా? వారిప్పుడు ఎలా ఉన్నారు? నా సుతులు సత్ప్రవర్తనులై ఉన్నారా? దుష్ప్రవర్తనులై ఉన్నారా? (25)

రాజు పలికెను : లోభంతో నీ ధనాన్నపహరించి నిన్ను నిరసించిన నీ

పుత్త దారాదులయెడల నీ మనస్సు ఎలా స్నేహబంధం కలిగి ఉంది?

వైశ్యుడు పలికెను : మీరు ఇప్పుడు ఎలా పలికారో అలాగే, ఆ భావమే, నాకు కూడా స్ఫురించింది. నేను ఏం చేయగలను? నా మనస్సు కాఠిన్యం వహింపకుంది. ధనంపై పేరాసతో తండ్రిపై నెయ్యాన్ని, స్వజనంపై ప్రేమను, పూర్తిగా విడనాడి భర్తయైన నన్ను వెళ్ళగొట్టిన వారిపైనే అది గాఢానురాగము కలిగి ఉంది. (26–31)

నాకిది తెలిసినా, ఇది దోషమని గ్రహించలేకున్నాను, ఉదార చిత్తుడవైన ఓ రాజా! బంధువులు దుర్గుణులైనా చిత్తం వారిపై ప్రేమాయత్తమై ఉంటోందే, ఏం చిత్రం! వారికై నేను నిట్టూర్పులు విడుస్తూ భేదం పొందుతున్నాను. ఆ అప్రీతిపరులపై నా మనస్సు నిష్ఠురత పూనకుంది. నేను ఏం చేయగలను? (32–34)

మార్కండేయుడు పలికెను : ఓ విప్రా ! అంతట సమాధి అనే ఆ వైశ్యుడూ, సురథుడు అనే ఆ రాజసత్తముడూ కలసి మేధసముని వద్దకు వచ్చి సముచిత మర్యాదలొనరించి, కూర్చొని అనేక విషయాలను గూర్చి (ఆయనతో) ప్రసంగించారు. (35–38)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Devi Mahatyam - Durga Saptasati - 2   🌹

✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj


Chapter 1
🌻 Description of Killing of Madhu and Kaidabha - 2
🌻

asked him: 'Ho! Who are you? What is the reason for your coming here? Wherefore do you appear as if afflicted with grief and depressed in mind?' Hearing this speech of the king, uttered in a friendly spirit, the merchant bowed respectfully and replied to the king. The merchant said:

20-25. 'I am a merchant named Samadhi, born in a wealthy family. I have been cast out by my sons and wife, who are wicked through greed of wealth. My wife and sons have misappropriated my riches, and made me devoid of wealth. Cast out by my trusted kinsmen, I have come to the forest grief-stricken. Dwelling here, I do not know anything as regards good of bad of my sons, kinsmen and wife. At present is welfare or ill-luck theirs at home? How are they? Are my sons living good or evil lives?' The king said:

26-28. 'Why is your mind affectionately attached to those covetous folk, your sons, wife and others, who have deprived you of your wealth?' The merchant said:

29-34. 'This very thought has occurred to me, just as you have uttered it. What can I do? My mind does not become hard; it bears deep affection to those very persons who have driven me out in their greed for wealth, abandoning love for a father and attachment to one's master and kinsmen. I do not comprehend although, I know it. O noble hearted king, how it is that the mind is prone to love even towards worthless kinsmen. On account of them I heave heavy sighs and feel dejected. What can I do since my mind does not become hard towards those unloving ones? Markandeya said:

35-38. Then O Brahmana, the merchant Samadhi and the noble king together approached the sage (Medhas); and after observing the etiquette worthy of him and as was proper, they sat down and conversed (with him ) on some topics. The king said:

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవీమహత్యము #DeviMahatyam


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


10 Oct 2020

No comments:

Post a Comment