శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 77 / Sri Gajanan Maharaj Life History - 77



🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 77 / Sri Gajanan Maharaj Life History - 77 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 15వ అధ్యాయము - 3 🌻

ప్రఖ్యాత న్యాయవాదులు తిలక్ ను చట్టరీత్యా ఆదుకునేందుకు పరిగెత్తారు, మరికొంతమంది దైవరీత్యా ఈశిక్షనుండి ఆదుకునేందుకు ప్రయత్నించదలిచారు. లోకమాన్య విచారణ నిమిత్తం, గొప్ప వ్యక్తి అయిన శ్రీదాదాసాహెబ్ ఖాపరడే అమరావతి నుండి బొంబాయి వెళ్ళారు. ఇలావెళుతూ అకోలాలో శ్రీకొల్హాట్కర్తో నువ్వు షేగాంవెళ్ళి తిలకను ఈవినాశనం నుండి రక్షించమని శ్రీగజానన్ మహారాజును అర్ధించు, నేనే షేగాం వెళదామని కోరుకున్నాను కానీ ఈ విచారణ కోసంనేను బొంబాయి వెళ్ళితీరాలి, కనుక వెళ్ళి శ్రీమహారాజును అభ్యర్ధించమని అన్నారు.

తిలక్ భక్తుడయిన కొల్హాట్కర్ వెంటనే షేగాం వెళ్ళారు. కానీ అతను అక్కడికి చేరేసరికి శ్రీమహారాజు నిద్రపోతూ ఉండడం చూసాడు. ఆయన మూడురోజులవరకు లేవలేదు. నిజాయితీ పరుడయిన శ్రీకొల్హాట్కరు ఆమూడురోజులూ అక్కడనుండి కదలలేదు. ఆయనకు తిలక్ మీదఉన్న ప్రేమ, ఆత్మీయత మరియు భక్తి నిజంగా గొప్పవి. నిప్పులేకుండా బొబ్బలు ఎక్కవు, ఆత్మీయతలేకుండా దుఖంలేదు అని మరాఠీలో సామెత ఉంది.

నాలుగో రోజున శ్రీమహారాజు లేచి... మీ ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. శ్రీరామదాసు స్వామి ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ మొఘలాయిలు శివాజీని నిర్భంధించారు. మంచివాళ్ళు కష్టాన్ని అనుభవిస్తే తప్ప విముక్తి సాధ్యంకాదు. కంసుడి చరిత్ర గుర్తు తెచ్చుకోండి, నేను అంటున్నది ఏమిటో మీకు అర్ధంఅవుతుంది. నేను ఒక రొట్టె ఇస్తాను, సాధ్యమయినంత త్వరలో తిలక్ ను దానిని తినమనండి. ఈప్రసాదం అయిన రొట్టెవలన, అతను చాలా దూరంవెళ్ళి పోయినా, ఒక మహాకార్యం చేస్తాడు, ఇది అనివార్యం అని శ్రీమహారాజు అన్నారు. ఇది అంతావిన్న కొల్హాట్కర్ కలవరపడ్డాడు.

శ్రీమహారాజుకు నమస్కరించి ఆయన ఇచ్చిన రొట్టెతో అతను వెళ్ళిపోయాడు. బొంబాయిలో అంతా వర్నించి శ్రీతిలక్ కు ప్రసాదం అయిన రొట్టెను ఇచ్చాడు. కొల్హాట్కర్ నుండి అదివిన్న తిలక్ శ్రీగజానన్ మహారాజు ఒకగొప్ప యోగి, ఆయన అన్నది నిజమే అవచ్చు. మీరు ఖచ్చితంగా గెలవలేరు, ఎందుకంటే ప్రభుత్వం తమని రక్షించుకుందుకు న్యాయశాస్త్రాన్ని పాటిస్తుంది.

స్వప్రయోజనం లేకపోతే న్యాయానికి కట్టుబడి ఉండడం అనేది లోకం అంగీకరించిన సత్యం. నేను ఒకగొప్ప కార్యం చేస్తానని శ్రీమహారాజు అన్నారు, అదినేను అర్ధం చేసుకోలేకపోతున్నాను. యోగులు భూత, భవిష్యత్తు, వర్తమానలను గూర్చి తెలిసి ఉంటారు.

మనం సాధారణ మానవులం, కనుక భవిష్యత్తులో ఏమి జరగబోయేదీ వేచిచూద్దాం అన్నారు. పళ్ళు లేకపోవడంతో, తిలక్ ఆప్రసాదం అయిన రొట్టెను పొడిచేసుకుని తిన్నారు. ఆ తదుపరి ఆయనకు కారాగారశిక్ష విధించి, గీత మీద అతిప్రసిద్ధమయిన ప్రబంధం వెలువడిన మండలే కారాగారానికి పంపించారు.

ఇదే ఆయన చేసిన గొప్ప కార్యం, మరియు ఆయనకు జగత్గురు అనే గౌరవం సంపాదించింది. అనేక ప్రబంధాలు గీతమీద అనేకమంది విజ్ఞులు తమతమ జీవంచిన సమయానుసారం వారివారి జీవనసరళి మీద ఆధారపడి సామాన్యమానవుని ఉద్ధారణకొరకు వ్రాసారు.

కొంతమంది అద్వైతం ఆధారంగా చేసుకుని వ్రాస్తే కొంతమంది ద్వైతం ఆధారంగా చేసుకున్నారు. మరికొంతమంది గీత కర్మ గురించి బోధించిందని తలచారు. గీత మీద ప్రబంధం శ్రీతిలక్ చేసిన గొప్ప కార్యం, మరి ఏదీ దీనతో పోల్చలేనిది. ఇది తిలక్ ను అజన్మునిగా చేసి ఆయన కీర్తిని దూరదూరాలకు వ్యాపింపచేసింది. స్వాతంత్రం సంపాదించడం ఈ గీతా ప్రబంధం కంటే గొప్ప విషయం కాకపోవచ్చు.

స్వాతంత్రం పొందడం ఒక అద్భుతమైన భౌతిక ప్రకృతికలిగినది కానీ గీత మానవజాతిని ఈదైహిక బంధనాలనుండి విముక్తి పొందించి సామాజిక క్రమశిక్షణ నిలబెడుతుంది. ఈ కార్యంవల్ల సూర్య, చంద్రులున్నంత వరకు బాలగంగాధర్ తిలక్ పేరు, కీర్తి ఉంటాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Gajanan Maharaj Life History - 77   🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj


🌻 Chapter 15 - part 3 🌻

Renowned lawyers rushed to defend Tilak on the legal side, while other devotees wanted to try the spiritual way to save him from the punishment.

Shri Dadasaheb Khaparde was a great man; he went to Bombay from Amravati to attend the trial of Lokmanya Tilak. On the way, at Akola, he said to Kolhatkar, You should go to Shegaon and request Shri Gajanan Maharaj to save Tilak from this calamity.

In fact, I wish to go to Shegaon myself, but have to attend this trial at Bombay. So go and request Shri Gajanan Maharaj .” Kolhatkar, a devotee of Tilak, immediately went to Shegaon, but upon reaching there came to know that Shri Gajanan Maharaj was sleeping.

Shri Gajanan Maharaj did not get up for three days. Kolhatkar, being very sincere man, did not move from there for all of those three days. His love, affection and reverence for Tilak were really great. It is said in Marathi that there cannot be a boiling without fire, and grief without affection.

On the fourth day, Shri Gajanan Maharaj woke up and said, Your all efforts will be fruitless. Remember that, despite the blessing from Shri Ramdas Swami, Shivaji was arrested by Moguls.

There can be no Liberation unless good people suffer. Remember the history of Kansa, and you will understand what I say. I will give you a piece of bread, take it and let Tilak eat it at the earliest.

With the Prasad of this bread, he will do some great work. Though going far away, it cannot be avoided.” Hearing all this, Kolhatkar got confused. He bowed before Shri Gajanan Maharaj and went away with the bread given to him for Tilak.

At Bombay, he narrated everything at gave the Prasad of bread to Shri Tilak. Hearing it from Kolhatkar, Tilak said, Shri Gajanan Maharaj is a great saint and whatever He said must be true.

You will definitely not succeed, as the Government will follow the law to defend itself. It is a universal truth that the law is strictly adhered to, when self interest is not involved.

Shri Gajanan Maharaj said that I will do some great work, which I am not able to understand. Saints know all the past, present and the future. We are ordinary men, so let us see what happens in the future.” As he had not teeth, Tilak powdered the Prasad of bread and ate it.

Thereafter, he was sentenced to imprisonment and sent to Mandalay where was born the memorable treatise on the Geeta by the Lokmanya. This was the great work done by him and earned the respect like ‘Jagat Guru’.

Many treatises were written on the Geeta and every intellectual interpreted it, on the background of the era he lived in, to aid with the liberation of the common man. Some of them interpreted it on ‘Adwait’ and others on ‘Dwait’ philosophy, while some thought that it preached ‘Karma’.

The treatise on Geeta by Shri Tilak was itself a great work done by him, incomparable with anything else. It made Tilak immortal and spread his fame far and wide. Even achieving the independence would not have been so great a work as this treatise on Geeta.

Achieving independence is something material and transient in nature, but Geeta can achieve liberation of human beings from material bondage and also help keep up the social discipline. By this work, the fame and name of BaI Gangadhar Tilak will last as long as the sun and moon shine.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj


10 Oct 2020


No comments:

Post a Comment