శివగీత - 110 / The Siva-Gita - 110



🌹. శివగీత - 110 / The Siva-Gita - 110 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 14

🌻. పంచ కోశో పాసన - 6
🌻


భోక్త్రుత్వం సాక్షితా చేతి- ద్వై దంత స్యోప పద్యతే,

ఆత పశ్చాపి తచ్చాయా -తత్ప్రకాశే విరాజతే .26


ఏకో భోజయితా తత్ర - భుంక్తేన్యః కర్మణ ఫలమ్,

క్షేత్రజ్ఞ రధివం విద్ధి - శరీరం రధమేవతు. 27


బుద్దింతు సారధిం విద్ధి - ప్రగ్రహం తు మనస్తదా,

ఇంద్రియాణి హయాన్విద్ది - విషయాం స్తే షు గోచరాన్ 28


ఇంద్రి యైర్మవ సా యుక్తం - భోక్తారం విద్ధి పూరుషమ్,

ఏవం శాంత్యాది యుక్తస్స -న్నుపాస్తే యస్సదా ద్విజః 29


ఉద్ఘాట్యో ద్ఘా ట్యైక మేకం - యద్యేవం కదళీ తరో:,

వల్క లాని తతః పశ్చా- ల్లభతే సార ముత్తమమ్ 30


తదైవ పంచ కోశేషు - మనస్సం క్రమయన్ క్రమాత్,

తేషాం మధ్యే తతస్సార - మాత్మాన మపి విందతి. 31


పరమాత్ముని తేజము (ప్రకాశము -వెల్తురు ) నుండి యెండ మరియు నీడలు ప్రకాశించు చున్నవి. దృగ్గో చర మగుచున్నవి. సుఖ దుఃఖాదులను అనుభవించు వాడొక్కడే. మిగతా వాడు కర్మ ఫలము లను భావించు చున్నాడు. శరీరమును రధము గాను, క్షేత్రజ్ఞు డైన జీవుని రధికుని గాను, బుద్దిని సారధి గాను ,మనస్సును కళ్ళెముగాను తెలిసి కొనుము.

ఇంద్రియములను గుర్రములు గాను, ఇంద్రియ గోచరములగు విషయములను ఆ యశ్వములు సంచరించు ప్రదేశములుగాను, ఇంద్రియములు మరియు మనస్సు చేతను కూడిన యాత్మను ఉపభోక్తయగు పురుషుని గాను తెలిసి కొనుము.

మానవుడు అరటి చెట్టు యొక్క పట్టలను,(పై భాగములను ) ఒక్కొక్క దానిని క్రమముగా దీసి వైచి కొనుచు, పిదప దాని యొక్క ఉత్తమమైన (సార భూతమగు ) కాదా నే విధముగా బడయుచున్నాడో అదే ప్రకారముగా శాంతి- శమ -దమాది సత్వ గుణ సంపన్నుడై సర్వదా నన్నుపాసన చేయు భక్తుడు అన్నమయాది పంచ కోశముల యందోక్కొక్క దానిని క్రమముగా నిరాకరించుచు, పోయి చివరకు యందలి సార భూతమగు నాత్మను గుర్తించు చున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 The Siva-Gita - 110 🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj


Chapter 14

🌻 Panchakoshopasana - 6
🌻

From the aura of the Paramatman the shine and shadow are created and are visible to the eye. There is only one who enjoys and suffers the joys and pains. The others only assume/feel the fruits of Karma.

One should consider this body as the chariot, the Kshetrajna (Jiva) as the passenger, Intellect as the charioteer, Mind as the reins, Indriyas as the horses, the visible elements as the fields where those horses wander, and finally one should consider this Atman together with the Indriya and Manas which is the consumer

(upabhokta), as the Purusha.

As like as the peel of the banana tree and gets the inside main essence for food, same way a human should peel off his external blankets using the tools called ShantiSamaDama kind of Satwa qualities. and by always worshiping me and such a devotee discards gradually, the five Kosas (annamaya etc ), and finally realizes the actual essence called as the Atman (self).

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


09 Nov 2020



No comments:

Post a Comment