🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 30 🌻
215. పుణ్యం చేస్తే, అందరికీ దానం చేస్తే, గుళ్ళుగోపురాలు దర్శిస్తే జ్ఞానం కలుగుతుందా! దానివల్ల పుణ్యం రావచ్చును, ఐశ్వర్యం రావచ్చును. దానివల్ల కొడుకులు వృద్ధిలోకి రావచ్చు. అదీకాదు మోక్షార్థి చేయవలసినది. ఏ పనీ చెయ్యడు. ఏ పని చేసినా వైరాగ్యబుద్ధితో చెయ్యాలి.
216. తన మనుగడకు కావలసిన కనీస వసతులు ఎక్కడ లభిస్తే అక్కడ ఉండటమే! మోక్షేఛ్ఛ కలిగిన వాళ్ళ మార్గం ఇలా ఉంటుందని ఉపదేశం చెయ్యమని శుకుడికి నారదుడు బోధచేసాడు. తాను లేకపోతే, తన కుక్కపిల్లకు అన్నంపెట్టేవాళ్ళుకూడా లేరని, అది బ్రతకదని కొందరు వాపోతుంటారు.
217. అలాగే తాను పదవీవిరమణ చేస్తే చనిపోతే, తన భార్యా పుత్రులకు ఆధారం లేకుండా పోతుందని కూడా చింతిస్తూ ఉంటారు. అది నిజం కాదు. తాత్కాలికంగా అది సత్యంగా కనబడుతుందే తప్ప అది యథార్థం కాదు. అలా చెప్పినవాళ్ళు హఠాత్తుగా పోయిన తరువాత కూడా, ఇంకా అనేకమంది జీవిస్తూనే ఉన్నారు. బాగానే ఉన్నారు. ఏదో ఒకటి పొందనే పొందుతారు. ఎవరి కర్మ వాళ్ళదే!
218. అంతేకాని, నా మీద వాళ్ళు ఆధారపది ఉన్నారు అనేటటువంటి ‘ఆధార-ఆధేయ భావం’ మరొక జీవుడితో కల్పించుకోవటము అవిద్య, అజ్ఞానం అని పెద్దలు చెపుతున్నారు. వాస్తవానికి జీవులందరూ స్వతంత్రులే. పరస్పర సంబంధాలు కల్పితాలే.
219. మోక్షేఛ్ఛ కలిగిన వాడు తన మార్గాన్ని తను చూచుకోవాలి. ఒక ధర్మంకోసం మోక్షేఛ్ఛను వదిలిపెట్టినవాడు మోక్షేఛ్ఛ కలిగినవాడెట్లా అవుతాడు? మోక్షమందు వాడికి ఇఛ్ఛ ఉండేటట్లయితే, ధర్మంకూడా అతడి దృష్టిలోకి రాకూడదు. కర్తవ్యము మొదలైనవాటిని భావన చేయటం మోక్షవిషయంలో ధర్మంకాదు.
220. కాబట్టి ఆత్మయొక్క తేజోబలం చేత, దాని యొక్క మహత్తు చేత ఆత్మయే స్వయంగా బుద్ధిని తనలో లీనం చేసుకుంటుంది. అందుకై మోక్షార్థి అయినవాడు నిష్క్రియుడై కర్తవ్యలక్షణాదులు ఏమీ లేకుండా సర్వారంభ త్యాగిలా ఉండటమే అతడి ధర్మం.
221. ఎప్పుడూ కూడా, సంసారంలో కలిగిన బాధలు తనవి అనుకోవటం, పొరుగూళ్ళో ఎవరికో సుఖం కలుగుతున్నదని అసూయతో తను దుఃఖపడటం ఈ రెండూకూడా ఒకటే. తన శరీరంలో కలిగిన బాధను గురించి దుఃఖపడటం కూడా, ఇంకొకచోట ఎవరికో కలిగిన దుఃఖాన్ని చూచి తను దుఃఖించటం వంటిదే. ఈ రెండింటికీ తేడాయేలేదు.
223. దీని అర్థ మనం ఎలా చెప్పాలి అంటే – గ్రమాంతరంలో ఎవరో ఉన్నాడు, వాడికి ఏదో దుఃఖం కలిగింది. అది ఎలాంటిదో, తన శరీరానికి కలిగిన దుఃఖం కూడా అలాంటిదే! అంటే ఆ దుఃఖమూ తనది కాదు. అట్టి దృక్పథం మోక్షార్థి అవలంబించాలని నారదుడి బోధ.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
09 Nov 2020
No comments:
Post a Comment