✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -28 🌻
బ్రహ్మణోరవ్యక్తః - బ్రహ్మణః అవ్యక్తః - అవ్యక్తాన్ మహత్, మహదోర్ మహదహంకారః, మహదహంకారో ఆకాశః, ఆకాశాత్ వాయుః, వాయోరగ్నిః, అగ్నయోరాపః, ఆపయోః పృథ్విః, పృథ్వియోః ఓషధిః, ఓషదియోరన్నం, అన్నయోర్ జీవై సః, ఇతి క్రమశః
ఈ రకంగా క్రమసృష్టి ఏర్పడింది. ఇది మీ అందరికి బాగా అందుబాటులో ఉన్నటువంటి, తెలిసి ఉన్నటువంటి విశేషమే! సాంఖ్య విచారణ క్రమంలో, మొట్టమొదటి పాఠం, క్రమసృష్టి విధానాన్ని బోధించడమే మొట్టమొదటి పాఠం.
మొట్టమొదట ఏమున్నదయ్యా? ఆకాశం ఉన్నది అని మానవుడు అంటున్నాడు. ఎందుకని? ఆయనకు తెలిసినంత మేరలో అంతటా వ్యాపకం అయివున్నది ఆకాశం మాత్రమే. కానీ, తత్వతః - ‘తత్ త్వం’ అనే విచారణను చేపట్టినప్పుడు మాత్రమే, తత్ త్వం తత్వమసి, అనేటటువంటి వాక్య విచారణ ద్వారా చేపట్టిన వాళ్ళకు మాత్రమే, ఈ ఆకాశం నుంచి అవతలికి, ఈ ఆకాశం పంచభూతాలలో భాగమైనటువంటి ఆకాశం.
వాతావరణం మనకు అందుబాటులో ప్రాణవాయువు యొక్క ప్రసారమున్నంత వరకూ ఏదైతే చెప్పుకుంటున్నామో, దానిని ఆకాశము అంటున్నాము. విజ్ఞాన వ్యవస్థ కూడా చాలా రకాలైనటువంటి వాతావరణ విభజనని చేసింది. రోబోస్పియర్, ఎయిరోస్పియర్, మిసోస్పియర్ ఈ రకంగా చాలా విభజనలను చేసింది.
కాబట్టి, ట్రోపికల్ రీజియన్ ఏదైతే ప్రాణవాయువు ప్రసారం ఉన్నంతవరకూ ఉన్నదానిని మాత్రమే మనం ఆకాశంగా లెక్కవేస్తున్నాము. దాని అవతల ఉన్నదంతా కూడా అపంచీకృతమైనటువంటిదంతా ఉంది. ఇవతల ఉన్నదంతా పంచీకృతంగా ఉన్నది. కాబట్టి, పంచీకృత మనేటటువంటి పద్ధతి ఏర్పడిన తరువాతే, సృష్టి ఏర్పడింది.
ఈ సృష్టి అంతా, ఈ పంచభూతాలు ఆకాశము, అగ్ని, వాయువు, జలము, పృథ్వి. ఈ అయిదు భూతములు కూడా ఒక దానితో ఒకటి సగం సగం అపంచీకృతములుగా ఉండిపోయి, మిగిలిన సగములన్నీ ఒకదానితో ఒకటి సంయోజన వియోజనాలు జరుగబట్టి, అంటే 1/8, 1/8, 1/8, 1/8 గా విడిపోయాన్నమాట. ఆ 1/8 లు అన్నీ మళ్ళా కలిసిపోయాయన్నమాట. ఈ రకంగా కలిసిపోయి అన్నీ జడచేతనాత్మకమైనటువంటి సృష్టి అంతా ఏర్పడింది.
స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టి అంతా ఏర్పడింది. ఆ జీవసృష్టిలో ఇంద్రియాలు, గోళకాలు అన్నీ ఏర్పడినాయి. ఆ ఇంద్రియాలు, గోళకాలు సృష్టిలో మళ్ళా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైన జ్ఞాన సృష్టి ఏర్పడింది. ఆ జ్ఞాన సృష్టిలో మనోవికాసం కలిగినటువంటి మానవుడు ఉత్పన్నమయ్యాడు.
అట్టి ఉత్పన్నమైన మానవుడిలో బుద్ధి వికాసం కలిగినటువంటి, నాగరిక మానవుడు ఉత్పన్నమయ్యాడు. అట్టి బుద్ధి వికాసం కలిగినటువంటి వాళ్ళల్లో ‘తత్వమసి’ - మహావాక్య విచారణ చేయగలిగినటువంటి మహర్షులు ఉత్పన్నమయ్యారు. అట్టి మహర్షులలో మరలా బ్రహ్మజ్ఞానులు ఉత్పన్నమయ్యారు. ఈ రకముగా తత్త్వ విచారణ చేపట్టెటటువంటి, ఉత్తమాధికారివయ్యేటట్లుగా మానవుడు తయారు కావాలి.
అట్లా తయారవ్వడానికి ఉపయోగ పడేటటువంటి సద్విచారణ, తత్వవిచారణ, త్వం పరము, తత్ పదము అనేటటువంటి విభజనని స్పష్టముగా తెలుసుకుని, అవి రెండూ ఏకత్వము పొందేటటువంటి, తత్త్వమసి, అసి పదాన్ని ఎవరైతే చూసుకుంటారో, వాళ్ళు మాత్రమే, ఒక దానిని దాటి మరొక దానిని, ఒక స్థితిని దాటి మరొక స్థితిలోకి, జ్ఞాన వ్యాపకత ద్వారా, జ్ఞాన వ్యావృత్తి ద్వారా, అంటే మనిషేమీ ఆకాశమంత అవ్వడు.
కానీ, అతని యొక్క బుద్ధి వికాసం వ్యాపకం చెంది, ‘బుద్ధి గ్రాహ్యమతీంద్రయం’ - అతీతముగా ఉన్నటువంటి, ఇంద్రియ జ్ఞానమునకు అతీతముగా ఉన్నటువంటి, పరతత్వాన్ని తెలుసుకో గలిగేటటువంటి సమర్థతని మానవుడు సాధించగలుగుతాడు
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
09 Nov 2020
Please join and share with your friends.
You can find All my messages from beginning in these groups.
Facebook group : . చైతన్య విజ్ఞానం – Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/
Facebook Hastags: (Search these Hastags on Facebook)
#ChaitanyaVijnanam #PrasadBhardwaj
WhatsApp: . AMRUTASYA PUTRAAHA
https://chat.whatsapp.com/HrBxBAaKb0g73IXeMhwXmx
Whatsapp Group: గాయత్రి శక్తి Gāyatri Śakti
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin
Telegram group : . చైతన్య విజ్ఞానం – Chaitanya Vijnanam
https://t.me/ChaitanyaVijnanam
Telegram group: విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama.
Exclusively for శ్రీ మాహా విష్ణువు సంబంధిత జ్ఞానం కోసం.
https://t.me/vishnusahasra
Telegram group: ్రీ దత్తాత్రేయ చైతన్యం – Sri Datta Chaitanya
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA
Telegram group: శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam
https://t.me/srilalithadevi
Telegram: శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam
https://t.me/SriMataChaitanyam
Telegram channel : . చైతన్య విజ్ఞానం – Chaitanya Vijnanam
https://t.me/Spiritual_Wisdom
Telegram Channel: Seeds Of Consciousness
This channel is dedicated to Seeds of consciousness given by various masters.
https://t.me/Seeds_Of_Consciousness
Blogs/Websites:
www.incarnation14.wordpress.com
www.dailybhakthimessages.blogspot.com
No comments:
Post a Comment