📚. ప్రసాద్ భరద్వాజ
🌻 98. సిద్ధిః, सिद्धिः, Siddhiḥ 🌻
ఓం సిద్ధయే నమః । ॐ सिद्धये नमः । OM Siddhaye namaḥ
నిరతిశయరూపత్వాద్ అచ్యుతస్సర్వవస్తుషు ।
సంవిత్త్వాత్ ఫలరూపత్వాద్ వా సిద్ధిరితి కీర్త్యతే ।
స్వర్గాదీనామ్ అనిత్యత్వాత్ అఫలత్వం బుధేరితమ్ ॥
పరమాత్ముడు 'సంవిద్' (కేవలాఽనుభవ) రూపుడు. సాధకునకు కలుగు అట్టి అనుభవమే అతని సాధనము వలన అతనికి కలుగవలసిన సిద్ధి. కావున పరమాత్మ 'సిద్ధి' అనబడుచున్నాడు.
లేదా పరమాత్ముడు నిరతిశయ రూపుడు - తన రూపమును మించునది మరి ఏదియు లేని ఏ రూపము కలదో అట్టి రూపము తానే యగు వాడు. అట్టి స్థితి కంటే గొప్ప స్థితి ఏదియు లేదు. కావున అట్టి సర్వోత్తమ రూపమే తాను అగు పరమాత్ముడు తానే (సర్వోత్తమమగు) 'సిద్ధి' అనదగియున్నాడు.
లేదా ఏ కర్మలకును ఏ యోగాదిసాధనములకును ఫలము పరమాత్ముడు తానే కావున అట్టి విష్ణుపరమాత్మ 'సిద్ధి' (ఫలము) అనబడుచున్నాడు. స్వర్గము మొదలగు ఫలములును వేరగునవి యున్నవికదా! అనిన వినాశమునందునవి కావున అవి సర్వోత్తమ ఫలములు అనదగినవి కాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 98 🌹
📚. Prasad Bharadwaj
🌻 98.Siddhiḥ 🌻
OM Siddhaye namaḥ
Niratiśayarūpatvād acyutassarvavastuṣu,
Saṃvittvāt phalarūpatvād vā siddhiriti kīrtyate,
Svargādīnām anityatvāt aphalatvaṃ budheritam.
निरतिशयरूपत्वाद् अच्युतस्सर्ववस्तुषु ।
संवित्त्वात् फलरूपत्वाद् वा सिद्धिरिति कीर्त्यते ।
स्वर्गादीनाम् अनित्यत्वात् अफलत्वं बुधेरितम् ॥
The Supreme Lord is of Saṃvid form or one that can only be experienced. Such ultimate experience of a Sādhaka or devotee is what which is 'Siddhi'. This is a reason why God is known by the divine name 'Siddhiḥ'.
Or His is the ultimate consciousness. There is no other supreme form than His form. Hence He being the One who is such an ultimate blissful consciousness, He himself is known as 'Siddhi'.
Or He being the final fruit of a Sādhaka’s devoted efforts, He, the Lord Viṣṇu, is 'Siddhi'. Of course, there are other sought after results like paradise; but since these are not permanent states, they are not eternally blissful.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अजस्सर्वेश्वरस्सिद्धस्सिद्धिस्सर्वादिरच्युतः ।वृषाकपिरमेयात्मा सर्वयोगविनिस्सृतः ॥ ११ ॥
అజస్సర్వేశ్వరస్సిద్ధస్సిద్ధిస్సర్వాదిరచ్యుతః ।వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ ౧౧ ॥
Ajassarveśvarassiddhassiddhissarvādiracyutaḥ ।Vr̥ṣākapirameyātmā sarvayogavinissr̥taḥ ॥ 11 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 99 / Vishnu Sahasranama Contemplation - 99🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 99. సర్వాదిః, सर्वादिः, Sarvādiḥ 🌻
ఓం సర్వాదయే నమః | ॐ सर्वादये नमः | OM Sarvādaye namaḥ
సర్వాదిస్సర్వభూతానామాదికారణమచ్యుతః సర్వభూతములకును ఆదికారణము అగువాడు.
:: భగవద్గీత - విశ్వరూపసందర్శన యోగము ::
కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోఽప్యాదికర్త్రే ।
అనన్త దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ ॥ 37 ॥
మహాత్మా! అనంతరూపా! దేవదేవా! జగదాశ్రయా! సత్, అసత్తులకు (స్థూలసూక్ష్మ జగత్తులకు రెండింటికిని) పరమైనట్టి అక్షర (నాశరహిత) పరబ్రహ్మ స్వరూపూడవు నీవే అయియున్నావు. బ్రహ్మదేవునకుగూడ ఆదికారణరూపుడవు కనుకనే సర్వోత్కృష్టుడునగు నీకేల నమస్కరింపకుందురు?
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 99 🌹
📚 Prasad Bharadwaj
🌻 99.Sarvādiḥ 🌻
OM Sarvādaye namaḥ
Sarvādissarvabhūtānāmādikāraṇamacyutaḥ / सर्वादिस्सर्वभूतानामादिकारणमच्युतः As He is the primal cause of all beings, the beginning of all.
Bhagavad Gītā - Chapter 11
Kasmācca te na nameranmahātman garīyase brahmaṇo’pyādikartre,
Ananta deveśa jagannivāsa tvamakṣaraṃ sadasattatparaṃ yat. (37)
:: श्रीमद्भगवद्गीता - विश्वरूपसंदर्शन योग::
कस्माच्च ते न नमेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे ।
अनन्त देवेश जगन्निवास त्वमक्षरं सदसत्तत्परं यत् ॥ ३७ ॥
And why should they not bow down to You, O exalted One, who is greater (than all) and who is the first Creator even of Brahmā! O infinite One, supreme God, Abode of the Universe, You the Immutable, being and non-being, (and) that which is Transcendental.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अजस्सर्वेश्वरस्सिद्धस्सिद्धिस्सर्वादिरच्युतः ।वृषाकपिरमेयात्मा सर्वयोगविनिस्सृतः ॥ ११ ॥
అజస్సర్వేశ్వరస్సిద్ధస్సిద్ధిస్సర్వాదిరచ్యుతః ।వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ ౧౧ ॥
Ajassarveśvarassiddhassiddhissarvādiracyutaḥ ।Vr̥ṣākapirameyātmā sarvayogavinissr̥taḥ ॥ 11 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
09 Nov 2020
Please join and share with your friends.
You can find All my messages from beginning in these groups.
Facebook group : . చైతన్య విజ్ఞానం – Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/
Facebook Hastags: (Search these Hastags on Facebook)
#ChaitanyaVijnanam #PrasadBhardwaj
WhatsApp: . AMRUTASYA PUTRAAHA
https://chat.whatsapp.com/HrBxBAaKb0g73IXeMhwXmx
Whatsapp Group: గాయత్రి శక్తి Gāyatri Śakti
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin
Telegram group : . చైతన్య విజ్ఞానం – Chaitanya Vijnanam
https://t.me/ChaitanyaVijnanam
Telegram group: విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama.
Exclusively for శ్రీ మాహా విష్ణువు సంబంధిత జ్ఞానం కోసం.
https://t.me/vishnusahasra
Telegram group: ్రీ దత్తాత్రేయ చైతన్యం – Sri Datta Chaitanya
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA
Telegram group: శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam
https://t.me/srilalithadevi
Telegram: శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam
https://t.me/SriMataChaitanyam
Telegram channel : . చైతన్య విజ్ఞానం – Chaitanya Vijnanam
https://t.me/Spiritual_Wisdom
Telegram Channel: Seeds Of Consciousness
This channel is dedicated to Seeds of consciousness given by various masters.
https://t.me/Seeds_Of_Consciousness
Blogs/Websites:
www.incarnation14.wordpress.com
www.dailybhakthimessages.blogspot.com
No comments:
Post a Comment