1) 🌹 శ్రీమద్భగవద్గీత - 541 / Bhagavad-Gita - 541🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 98, 99 / Vishnu Sahasranama Contemplation - 98 99🌹
3) 🌹 Sripada Srivallabha Charithamrutham - 329 🌹
4)🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 29 / Sri Devi Mahatyam - Durga Saptasati - 29🌹
5) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 98🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 117 🌹
7) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 104 / Gajanan Maharaj Life History - 104 🌹
8) *🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 44 🌹*
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 80, 81 / Sri Lalita Chaitanya Vijnanam - 80, 81🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 456 / Bhagavad-Gita - 456 🌹
11) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 71 📚
12) 🌹. శివ మహా పురాణము - 269 🌹
13) 🌹 Light On The Path - 25🌹
14) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 156 🌹
15) 🌹. శివగీత - 110 / The Siva-Gita - 110🌹*
17) 🌹 Seeds Of Consciousness - 219🌹
16) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 95 🌹
18) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 58 / Sri Vishnu Sahasranama - 58🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 8 🌴*
08. అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరమ్ |
అపరస్పరమ్బూతం కిమన్యత్ కామహైతుకమ్ ||
🌷. తాత్పర్యం :
ఈ జగము అసత్యమనియు, ఆధారములేనిదనియు, నియామకుడెవ్వడును దీనికి లేడనియు, సంగమాభిలాష చేతనే ఉత్పన్నమైనట్టి దీనికి కామము తప్ప వేరొక్కటి కారణము కాదనియు వారు పలుకుదురు.
🌷. భాష్యము :
అసురస్వభావులు ఈ జగమును భ్రాంతి యని నిర్ణయింతురు. దీనికి కార్యకారణములు గాని, నియామకుడుగాని, ప్రయోజనముకాని లేవనియు సర్వము మిథ్యయనియు వారు భావింతురు. ఈ జగత్తు భౌతిక చర్య, ప్రతిచర్య వలన యాదృచ్చికముగా ఏర్పడినదని పలుకుదురే కాని ఒక ప్రత్యేక ప్రయోజనార్థమై భగవానునిచే సృష్టింపబడినదని వారు భావింపజాలరు. ఈ జగత్తు దానంతట అదే వచ్చియున్నందున దాని వెనుక భగవానుడు ఒకడున్నాడని నమ్మవలసిన అవసరము లేదనెడి తమ స్వంత సిద్ధాంతమును వారు కలిగియుందురు.
వారి ఆత్మ మరియు భౌతికపదార్థము (అనాత్మ) నడుమగల వ్యత్యాసమును గమనింపరు. అదేవిధముగా దివ్యాత్మను (భగవానుని) కూడా వారు అంగీకరింపఋ. వారి ఉద్దేశ్యమున సమస్తమును పదార్థమే. అనగా సమస్త విశ్వము అజ్ఞానమయమేనని వారి భావము. సమస్తము శూన్యమేయనియు మరియు కనిపించునదంతటికి మన అజ్ఞానమే కారణమనియు వారు తలతురు. నిజమునకు అస్తిత్వము లేనటువంటి పెక్కింటిని మనము స్వప్నము నందు సృష్టించినట్లుగా, వైవిధ్యముగల సృష్టులన్నియు అజ్ఞానము యొక్క ప్రదర్శనయేనని వారు నిశ్చయముగా పలుకుదురు.
కాని మేల్కాంచినంతనే అదియంతయు స్వప్నమేయని మనము గుర్తింతురు. దానవస్వభావులు జీవితము స్వప్నము వంటిదే యని పలికెను, ఆ స్వప్నమును అనుభవించుటలో అతి ప్రవీణులై యుందురు. తత్కారణముగా జ్ఞానమార్జించుటకు బదులు తమ స్వప్ననగర మందే మరింతగా వారు బంధింపబడుచుందురు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 541 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 08 🌴*
08. asatyam apratiṣṭhaṁ te
jagad āhur anīśvaram
aparaspara-sambhūtaṁ
kim anyat kāma-haitukam
🌷 Translation :
They say that this world is unreal, with no foundation, no God in control. They say it is produced of sex desire and has no cause other than lust.
🌹 Purport :
The demonic conclude that the world is phantasmagoria. There is no cause and effect, no controller, no purpose: everything is unreal. They say that this cosmic manifestation arises due to chance material actions and reactions. They do not think that the world was created by God for a certain purpose. They have their own theory: that the world has come about in its own way and that there is no reason to believe that there is a God behind it.
For them there is no difference between spirit and matter, and they do not accept the Supreme Spirit. Everything is matter only, and the whole cosmos is supposed to be a mass of ignorance. According to them, everything is void, and whatever manifestation exists is due to our ignorance in perception. They take it for granted that all manifestation of diversity is a display of ignorance, just as in a dream we may create so many things which actually have no existence.
Then when we are awake we shall see that everything is simply a dream. But factually, although the demons say that life is a dream, they are very expert in enjoying this dream. And so, instead of acquiring knowledge, they become more and more implicated in their dreamland.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 98, 99 / Vishnu Sahasranama Contemplation - 98, 99 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 98. సిద్ధిః, सिद्धिः, Siddhiḥ 🌻*
*ఓం సిద్ధయే నమః । ॐ सिद्धये नमः । OM Siddhaye namaḥ*
నిరతిశయరూపత్వాద్ అచ్యుతస్సర్వవస్తుషు ।
సంవిత్త్వాత్ ఫలరూపత్వాద్ వా సిద్ధిరితి కీర్త్యతే ।
స్వర్గాదీనామ్ అనిత్యత్వాత్ అఫలత్వం బుధేరితమ్ ॥
పరమాత్ముడు 'సంవిద్' (కేవలాఽనుభవ) రూపుడు. సాధకునకు కలుగు అట్టి అనుభవమే అతని సాధనము వలన అతనికి కలుగవలసిన సిద్ధి. కావున పరమాత్మ 'సిద్ధి' అనబడుచున్నాడు.
లేదా పరమాత్ముడు నిరతిశయ రూపుడు - తన రూపమును మించునది మరి ఏదియు లేని ఏ రూపము కలదో అట్టి రూపము తానే యగు వాడు. అట్టి స్థితి కంటే గొప్ప స్థితి ఏదియు లేదు. కావున అట్టి సర్వోత్తమ రూపమే తాను అగు పరమాత్ముడు తానే (సర్వోత్తమమగు) 'సిద్ధి' అనదగియున్నాడు.
లేదా ఏ కర్మలకును ఏ యోగాదిసాధనములకును ఫలము పరమాత్ముడు తానే కావున అట్టి విష్ణుపరమాత్మ 'సిద్ధి' (ఫలము) అనబడుచున్నాడు. స్వర్గము మొదలగు ఫలములును వేరగునవి యున్నవికదా! అనిన వినాశమునందునవి కావున అవి సర్వోత్తమ ఫలములు అనదగినవి కాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 98🌹*
📚. Prasad Bharadwaj
*🌻 98.Siddhiḥ 🌻*
*OM Siddhaye namaḥ*
Niratiśayarūpatvād acyutassarvavastuṣu,
Saṃvittvāt phalarūpatvād vā siddhiriti kīrtyate,
Svargādīnām anityatvāt aphalatvaṃ budheritam.
निरतिशयरूपत्वाद् अच्युतस्सर्ववस्तुषु ।
संवित्त्वात् फलरूपत्वाद् वा सिद्धिरिति कीर्त्यते ।
स्वर्गादीनाम् अनित्यत्वात् अफलत्वं बुधेरितम् ॥
The Supreme Lord is of Saṃvid form or one that can only be experienced. Such ultimate experience of a Sādhaka or devotee is what which is 'Siddhi'. This is a reason why God is known by the divine name 'Siddhiḥ'.
Or His is the ultimate consciousness. There is no other supreme form than His form. Hence He being the One who is such an ultimate blissful consciousness, He himself is known as 'Siddhi'.
Or He being the final fruit of a Sādhaka’s devoted efforts, He, the Lord Viṣṇu, is 'Siddhi'. Of course, there are other sought after results like paradise; but since these are not permanent states, they are not eternally blissful.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अजस्सर्वेश्वरस्सिद्धस्सिद्धिस्सर्वादिरच्युतः ।वृषाकपिरमेयात्मा सर्वयोगविनिस्सृतः ॥ ११ ॥
అజస్సర్వేశ్వరస్సిద్ధస్సిద్ధిస్సర్వాదిరచ్యుతః ।వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ ౧౧ ॥
Ajassarveśvarassiddhassiddhissarvādiracyutaḥ ।Vr̥ṣākapirameyātmā sarvayogavinissr̥taḥ ॥ 11 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 99 / Vishnu Sahasranama Contemplation - 99🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 99. సర్వాదిః, सर्वादिः, Sarvādiḥ 🌻*
*ఓం సర్వాదయే నమః | ॐ सर्वादये नमः | OM Sarvādaye namaḥ*
సర్వాదిస్సర్వభూతానామాదికారణమచ్యుతః సర్వభూతములకును ఆదికారణము అగువాడు.
:: భగవద్గీత - విశ్వరూపసందర్శన యోగము ::
కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోఽప్యాదికర్త్రే ।
అనన్త దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ ॥ 37 ॥
మహాత్మా! అనంతరూపా! దేవదేవా! జగదాశ్రయా! సత్, అసత్తులకు (స్థూలసూక్ష్మ జగత్తులకు రెండింటికిని) పరమైనట్టి అక్షర (నాశరహిత) పరబ్రహ్మ స్వరూపూడవు నీవే అయియున్నావు. బ్రహ్మదేవునకుగూడ ఆదికారణరూపుడవు కనుకనే సర్వోత్కృష్టుడునగు నీకేల నమస్కరింపకుందురు?
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 99🌹*
📚 Prasad Bharadwaj
*🌻 99.Sarvādiḥ 🌻*
*OM Sarvādaye namaḥ*
Sarvādissarvabhūtānāmādikāraṇamacyutaḥ / सर्वादिस्सर्वभूतानामादिकारणमच्युतः As He is the primal cause of all beings, the beginning of all.
Bhagavad Gītā - Chapter 11
Kasmācca te na nameranmahātman garīyase brahmaṇo’pyādikartre,
Ananta deveśa jagannivāsa tvamakṣaraṃ sadasattatparaṃ yat. (37)
:: श्रीमद्भगवद्गीता - विश्वरूपसंदर्शन योग::
कस्माच्च ते न नमेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे ।
अनन्त देवेश जगन्निवास त्वमक्षरं सदसत्तत्परं यत् ॥ ३७ ॥
And why should they not bow down to You, O exalted One, who is greater (than all) and who is the first Creator even of Brahmā! O infinite One, supreme God, Abode of the Universe, You the Immutable, being and non-being, (and) that which is Transcendental.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अजस्सर्वेश्वरस्सिद्धस्सिद्धिस्सर्वादिरच्युतः ।वृषाकपिरमेयात्मा सर्वयोगविनिस्सृतः ॥ ११ ॥
అజస్సర్వేశ్వరస్సిద్ధస్సిద్ధిస్సర్వాదిరచ్యుతః ।వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ ౧౧ ॥
Ajassarveśvarassiddhassiddhissarvādiracyutaḥ ।Vr̥ṣākapirameyātmā sarvayogavinissr̥taḥ ॥ 11 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Sripada Srivallabha Charithamrutham - 329 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 49
*🌻 Giving life to dead 🌻*
Sripada said, “Visvaso phala dayakam’. If you have such strong belief in Me, your husband will certainly come back to life. But, I will tell you a way out without transgressing the rule of karma.
You sell your ‘mangal sutram’ and buy fire wood equal to the weight of your husband. That firewood will be utilized to cook food. With that, your inauspiciousness will be burnt away.
The inauspiciousness of loosing your mangalyam, the inauspiciousness of your husband’s body being burnt, and the inauspiciousness of the food cooked by burning the firewood which attracted death vibrations will all cool down.” After doing what all He said, her husband came back to life.
Sripada used to attract the different types of sinful karmas into the firewood. In that way the firewood would burn and tasty food would be ready. He was thus granting the auspiciousness
through ‘prasad’.
*🌻 Sripada’s special grace on a poor Brahmin 🌻*
On another occasion, one old Brahmin came for Sripada’s darshan. He wailed that if Sripada, did not show grace on him, he had no other option except suicide. Sripada brought a burning
firewood and branded that Brahmin. That Brahmin suffered for a long time.
Sripada said, ‘Oh! Brahmin! You wanted to commit suicide. If I had ignored, you would have really committed suicide. So I destroyed all the vibrations of sinful karmas related to suicide, by branding you with fire. Now you will not have the distress of poverty. You take this cooled firewood wrapping in your upper cloth and carefully take it to your house.’ He did the same.
When he went and opened the knot, the firewood became gold. Brahmin’s distress of poverty was removed. Sripada used to destroy the sinful ‘karmas’ of His devotees in wonderful methods through His Agni Vidya. Sometimes,
He would get vegetables like brinjal and lady fingers specially. He would attract the vibrations of sinful acts of his devotees into them. Such vegetable preparations would be compulsorily fed to the devotee. Karma faults would be destroyed.
One girl could not be married though she became mature. Noticing that she had ‘kuja dosha’, she was asked to bring red gram, made to prepare a food item with it. He told all including her to eat it. After the bond of karma was removed that way, she was married to a suitable bridegroom. He used to order some people to bring cow ghee for the purpose of cooking in darbar. He would ask some more people to light lamps with cow ghee.
When there was a severe distress or in case of girls not getting married, He would tell them to worship Ambika on Fridays in ‘Rahu Kaalam’.
Once, one person became ill and bedridden. Sripada ordered to light a lamp with mustard oil in his room and see that it would be burning by pouring oil through out the night. When they did so,
the devotee was cured of his disease. One devotee was in a state of extreme poverty.
Sripada told him, if a lamp was lighted with cow ghee in their house uninterruptedly for one week, Lakshmi ‘kala’ would enter that house. Thus He would remove the karma bonds of His devotees in many different methods. It is humanly impossible to try to know all those methods.
End of Chapter 49
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 29 / Sri Devi Mahatyam - Durga Saptasati - 29 🌹*
✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
*అధ్యాయము 8*
*🌻. రక్తబీజ వధ - 3 🌻*
29. ఆ మహాసురులు శివునిచేత తెలుపబడిన దేవీ వాక్యాలు విని రోషపూరితులై కాత్యాయని* ఉన్న చోటికి వెళ్ళారు.
30. అంతట గర్వకోపపూర్ణులైన ఆ సురవైరులు మొదటనే దేవిపై బాణాలను, బల్లాలను, ఈటెలను కురిపించారు.
31. ఆ ప్రయోగింపబడిన బాణాలను, శూలాలను, బల్లాలను, గండ్రగొడ్డండ్లను ఆమె పూర్తిగా లాగబడిన తన వింటి నుండి వెడలేమహాబాణాలతో అవలీలగా ఛేదించివేసింది.
32. అంతట అతని (శుంభుని) ఎదుటే శత్రువులను శూలపుపోట్లతో చీల్చివేస్తూ, పుట్టైపిడి గల బెత్తంతో మర్దిస్తూ, కాళి చరించింది.
33. బ్రహ్మాణి తాను ఎచటికి పోయినా తన కమండలూదకాలను శత్రువులపై చల్లి వారిని ధైర్య, శౌర్య విహీనులనుగా చేస్తోంది.
34. మాహేశ్వరి త్రిశూలంతో, వైష్ణవి చక్రంతో, కౌమారి బల్లెంతో కోపంగా దైత్యులను పరిమార్చారు.
35. ఐంద్రి ప్రయోగించిన వజ్రాయుధంతో చీల్చబడి దైత్యులు దానవులు నూర్లకొలద్దీ నేలకూలారు. వారి నుండి రక్తపునదులు పారాయి.
36. వారాహియొక్క ముట్టెదెబ్బలవలన ధ్వంసము చేయబడి,
కోరలమొనపోటులవలన గుండెలో గాయపడి, చక్రపు తాకుడువలన చీల్చివేయబడి (అసురులు) పడిపోయిరి.
37. నారసింహి ఆకసమును, దిక్కులను తననాదములతో నిండించుచు, తన గోళ్లతో చీల్పబడిన ఇతర మహాసురులను భక్షించుచు యుద్ధములో సంచరించెను.
38. శివదూతి యొక్క భయంకరములగు అట్టహాసముల (పెద్దనవ్వు) వలన ధైర్యముసడలి అసురులు నేలపై కూలిపడుచుండిరి. ఆ కూలినవారిని ఆమె భక్షించుచుండెను.
39. రోషపూరితలైన మాతృకలు - వివిధోపాయాలతో మహాసురులను ఇలా మర్దించడం చూసి సురవైరి సైనికులు పారిపోయారు.
40. మాతృగణం వల్ల పీడింపబడి దైత్యులు పారిపోవడాన్ని చూసి రక్తబీజమహాసురుడు కుపితుడై యుద్ధం చేయడానికి ముందుకు వచ్చాడు.
41. అతని శరీరం నుండి రక్తబిందువు భూమిపై పడినప్పుడల్లా అతనిలాంటి అసురుడొకడు భూమి నుండి లేస్తున్నాడు.
42. ఆ మహాసురుడు గదాహస్తుడై ఇంద్రాణితో పోరాడాడు. ఆమె అంతట తన వజ్రాయుధంతో అతనిని కొట్టింది.
43. వజ్రాయుధపు దెబ్బవల్ల అతని నుండి వెంటనే రక్తం అతిశయంగా కారింది. ఆ రక్తం నుండి అతని రూపంతో, అతని పరాక్రములైన యుద్ధవీరులు ఉత్పత్తి అవసాగారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 29 🌹*
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj
*CHAPTER 8:*
*🌻 The Slaying of Raktabija - 3 🌻*
29. Those great asuras, on their part, hearing the words of the Devi communicated by Shiva, were filled with indignation and went where Katyayani stood.
30. Then in the very beginning, the enraged foes of the devas poured in front on the Devi showers of arrows, javelins and spears.
31. And lightly, with the huge arrows shot from her full-drawn bow, she clove those arrows, spears, darts and axes hurled by them.
32. Then, in front of him (Shumbha), stalked Kali, piercing the enemies to pieces with her spear and crushing them with her skull-topped staff.
33. And Brahmani, wherever she moved, made the enemies bereft of valour and prowess by sprinkling on them the water from her Kamandalu.
34. The very wrathful Maheshvari slew the daityas with her trident, and Vaisnavi, with her discus and Kaumari, with her javelin.
35. Torn to pieces by the thunderbolt which come down upon them, hurled by Aindri, daityas and danavas fell on the earth in hundreds, streams of blood flowing out of them.
36. Shattered by the boar-formed goddess (Varahi) with blows of her snout, wounded in their chests by the point of her tusk and torn by her discus, (the asuras) fell down.
37. Narasimhi filling all the quarters and the sky with her roars, roamed about in the battle, devouring other great asuras torn by her claws.
38. Demoralised by the violent laughter of Shivaduti, the asuras fell down on the earth; she then devoured them who had fallen down.
39. Seeing the enraged band of Matrs crushing the great asuras thus by various means, the troops of the enemies of devas took to their heels.
40. Seeing the asuras harassed by the band of Matrs and fleeing, the great asura Raktabija strode forward to fight in wrath.
41. Whenever from his body there fell to the ground a drop of blood, at that moment rose up from the earth asura of his stature.
42. The great asura fought with Indra's shakti with club in his hand; then Aindri also struck Ranktabija with her thunderbolt.
43. Blood flowed quickly and profusely from him who was wounded by the thunderbolt. From the blood rose up (fresh) combatants of his form and valour.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 98 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆత్మను తెలుసుకొను విధము -28 🌻*
బ్రహ్మణోరవ్యక్తః - బ్రహ్మణః అవ్యక్తః - అవ్యక్తాన్ మహత్, మహదోర్ మహదహంకారః, మహదహంకారో ఆకాశః, ఆకాశాత్ వాయుః, వాయోరగ్నిః, అగ్నయోరాపః, ఆపయోః పృథ్విః, పృథ్వియోః ఓషధిః, ఓషదియోరన్నం, అన్నయోర్ జీవై సః, ఇతి క్రమశః
ఈ రకంగా క్రమసృష్టి ఏర్పడింది. ఇది మీ అందరికి బాగా అందుబాటులో ఉన్నటువంటి, తెలిసి ఉన్నటువంటి విశేషమే! సాంఖ్య విచారణ క్రమంలో, మొట్టమొదటి పాఠం, క్రమసృష్టి విధానాన్ని బోధించడమే మొట్టమొదటి పాఠం.
మొట్టమొదట ఏమున్నదయ్యా? ఆకాశం ఉన్నది అని మానవుడు అంటున్నాడు. ఎందుకని? ఆయనకు తెలిసినంత మేరలో అంతటా వ్యాపకం అయివున్నది ఆకాశం మాత్రమే. కానీ, తత్వతః - ‘తత్ త్వం’ అనే విచారణను చేపట్టినప్పుడు మాత్రమే, తత్ త్వం తత్వమసి, అనేటటువంటి వాక్య విచారణ ద్వారా చేపట్టిన వాళ్ళకు మాత్రమే, ఈ ఆకాశం నుంచి అవతలికి, ఈ ఆకాశం పంచభూతాలలో భాగమైనటువంటి ఆకాశం.
వాతావరణం మనకు అందుబాటులో ప్రాణవాయువు యొక్క ప్రసారమున్నంత వరకూ ఏదైతే చెప్పుకుంటున్నామో, దానిని ఆకాశము అంటున్నాము. విజ్ఞాన వ్యవస్థ కూడా చాలా రకాలైనటువంటి వాతావరణ విభజనని చేసింది. రోబోస్పియర్, ఎయిరోస్పియర్, మిసోస్పియర్ ఈ రకంగా చాలా విభజనలను చేసింది.
కాబట్టి, ట్రోపికల్ రీజియన్ ఏదైతే ప్రాణవాయువు ప్రసారం ఉన్నంతవరకూ ఉన్నదానిని మాత్రమే మనం ఆకాశంగా లెక్కవేస్తున్నాము. దాని అవతల ఉన్నదంతా కూడా అపంచీకృతమైనటువంటిదంతా ఉంది. ఇవతల ఉన్నదంతా పంచీకృతంగా ఉన్నది. కాబట్టి, పంచీకృత మనేటటువంటి పద్ధతి ఏర్పడిన తరువాతే, సృష్టి ఏర్పడింది.
ఈ సృష్టి అంతా, ఈ పంచభూతాలు ఆకాశము, అగ్ని, వాయువు, జలము, పృథ్వి. ఈ అయిదు భూతములు కూడా ఒక దానితో ఒకటి సగం సగం అపంచీకృతములుగా ఉండిపోయి, మిగిలిన సగములన్నీ ఒకదానితో ఒకటి సంయోజన వియోజనాలు జరుగబట్టి, అంటే 1/8, 1/8, 1/8, 1/8 గా విడిపోయాన్నమాట. ఆ 1/8 లు అన్నీ మళ్ళా కలిసిపోయాయన్నమాట. ఈ రకంగా కలిసిపోయి అన్నీ జడచేతనాత్మకమైనటువంటి సృష్టి అంతా ఏర్పడింది.
స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టి అంతా ఏర్పడింది. ఆ జీవసృష్టిలో ఇంద్రియాలు, గోళకాలు అన్నీ ఏర్పడినాయి. ఆ ఇంద్రియాలు, గోళకాలు సృష్టిలో మళ్ళా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైన జ్ఞాన సృష్టి ఏర్పడింది. ఆ జ్ఞాన సృష్టిలో మనోవికాసం కలిగినటువంటి మానవుడు ఉత్పన్నమయ్యాడు.
అట్టి ఉత్పన్నమైన మానవుడిలో బుద్ధి వికాసం కలిగినటువంటి, నాగరిక మానవుడు ఉత్పన్నమయ్యాడు. అట్టి బుద్ధి వికాసం కలిగినటువంటి వాళ్ళల్లో ‘తత్వమసి’ - మహావాక్య విచారణ చేయగలిగినటువంటి మహర్షులు ఉత్పన్నమయ్యారు. అట్టి మహర్షులలో మరలా బ్రహ్మజ్ఞానులు ఉత్పన్నమయ్యారు. ఈ రకముగా తత్త్వ విచారణ చేపట్టెటటువంటి, ఉత్తమాధికారివయ్యేటట్లుగా మానవుడు తయారు కావాలి.
అట్లా తయారవ్వడానికి ఉపయోగ పడేటటువంటి సద్విచారణ, తత్వవిచారణ, త్వం పరము, తత్ పదము అనేటటువంటి విభజనని స్పష్టముగా తెలుసుకుని, అవి రెండూ ఏకత్వము పొందేటటువంటి, తత్త్వమసి, అసి పదాన్ని ఎవరైతే చూసుకుంటారో, వాళ్ళు మాత్రమే, ఒక దానిని దాటి మరొక దానిని, ఒక స్థితిని దాటి మరొక స్థితిలోకి, జ్ఞాన వ్యాపకత ద్వారా, జ్ఞాన వ్యావృత్తి ద్వారా, అంటే మనిషేమీ ఆకాశమంత అవ్వడు.
కానీ, అతని యొక్క బుద్ధి వికాసం వ్యాపకం చెంది, ‘బుద్ధి గ్రాహ్యమతీంద్రయం’ - అతీతముగా ఉన్నటువంటి, ఇంద్రియ జ్ఞానమునకు అతీతముగా ఉన్నటువంటి, పరతత్వాన్ని తెలుసుకో గలిగేటటువంటి సమర్థతని మానవుడు సాధించగలుగుతాడు
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 118 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
110
Sloka:
Anadyayakhiladyaya mayine gata mayine |
Arupaya svarupaya sivaya gurave namah ||
Obeisance to Guru who is Siva, who has no beginning and who is the beginning of all, who has conquered illusion, who has no illusion, who is formless but remains in the form of his true self.
In this verse is the phrase, “mayine gata mayine”. We took refuge at the Guru to overcome maya (illusion). The Guru is referred to as mayavi (illusionist).
Mayi means mayavi. We might wonder what use it is to us if he is an illusionist. Here, they also said “gata mayi”. That means he is an illusionist that gained victory over illusion. He is not an ordinary illusionist. He not only gained victory over illusion, but purposefully kept illusion under his control. He does this to uplift us.
How does this work? Say, there is a smouldering piece of coal. To remove it from fire, you need an even hotter pair of tongs, otherwise, the tongs will get overheated.
Similarly, to extract a piece of iron that’s melting in fire, you will need an even hotter pair of tongs, otherwise, the tongs will themselves melt in the fire.
In the same manner, to remove maya from his disciples, the Guru takes on various forms of maya. He does maya and appears in the form of maya. He appears as maya even where it may seem unnecessary.
He wears maya, plays, cries, laughs, makes you cry, makes you laugh, his illusions are countless. He’ll become a bird keeper, animal keeper or anything else, he’s taken on so much maya. He puts the disciples in turmoil.
Those are the Guru’s tests. You should be careful. You should win those tests. You may wonder if it’s possible to withstand those tests. But, you don’t have to worry about withstanding the tests. He will do whatever is necessary and like a pair of tongs, extract you from the fire. That is why, he is called an illusionist.
Now, they conclude the praise of Guru as Siva with the following mantra:
Sloka:
Sarva mantra swarupaya sarva tantra swarupine |
Sarvagaya samastaya sivaya gurave namah ||
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 102 / Sri Gajanan Maharaj Life History - 102 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. 19వ అధ్యాయము - 10 🌻*
అందుకని పవిత్రదినాలలో ప్రజలు అక్కడ స్నానం చేసేందుకు వెళ్ళేవారు. కావున నిమోన్కర్ కూడా ఒక పవిత్రదినంనాడు అక్కడికి వెళ్ళాడు. ఇతనికి యోగ గూర్చి ప్రాధమిక జ్ఞానం ఉంది. దానిని తదుపరి అభివృద్ధి చేసుకోవాలని, అక్కడ కలసిన ప్రతి ఆస్తికుడినీ అభ్యర్ధించాడు. అందరూకూడా అతని ఈ అభ్యర్ధనను నిరాకరించారు, కావున అతను చాలా నిరుత్సాహపడ్డాడు.
అతను చేతులు కట్టుకుని, తనకు యోగ నేర్పించేవ్యక్తిని చూపమని భగవంతుని వేడుకున్నాడు. అకస్మాత్తుగా ఒక ఋషిలా కనిపిస్తున్న ఆజానుబాహుడిని కపిలధారలో అతను చూసాడు. ఈ ఆజాను భాహుడు, నిర్మల మయిన మనసుతో దీక్షలో కూర్చుని ఉన్నాడు. నిమోన్కరు అతనికి సాష్టాంగపడి, సాయంత్రంవరకు ఆయన కళ్ళు తెరవడంకోసం వేచిచూసాడు. కానీ ఆయోగి కళ్ళు తెరవలేదు, ఏమీ మాట్లాడలేదుకూడా. రోజంతా అతను భోజనం లేకుండా ఉన్నాడు. సాయంత్రం అవుతూంటే మిగిలిన ఆస్తికులు కపిలధారనుండి వెనుతిరగడం మొదలు పెట్టారు.
కావున శ్రీనిమోన్కరు ఆయోగిని తనకు యోగ నేర్పవలసిందిగా చేతులు కట్టుకుని ప్రార్ధించాడు. ఆయోగి అతనికి ఒక చిత్రంఇచ్చి నీకోరిక ఈచిత్రం వలన పూర్తి అవుతుంది, దీనిమీద ఒక 16 అక్షరాల మంత్రం రాయబడిఉంది. దానిని నువ్వు స్మరించడం కొనసాగించు. దానిశక్తివల్ల బహుశ నువ్వు కొంచెం యోగ నేర్చుకోవచ్చు. యోగమార్గం అన్ని యోగాలలో కష్టమయినది. ఒక చిన్న పురుగు హిమాలయం చుట్టూ తిరగలేదు, నత్త మేరుపర్వతం ఎక్కలేదు.
నువ్వు నిక్కచ్ఛిఅయిన బ్యహ్మచారిగా ఉంటూ, మనసునీ, అంతః శరీరాన్ని, ధౌతి మరియు నౌతి ద్వారా శుభ్రం చేసుకుని కొంచెం యోగ ప్రయత్నించవచ్చు. నువ్వు నిజాయితీగా చేస్తే కొన్ని అసనాలు నువ్వు చెయ్యగలవు. ఇక నన్ను ప్రశ్నలు వెయ్యకు, ఈప్రసాదం తీసుకో అని శ్రీమహారాజు అన్నారు. అలా అంటూ, అతనికి ఒక ఎర్రగుళకరాయి ఇచ్చి అదృశ్యం అయ్యారు.
అదే యోగి నాశికలోని గోదావరీ తీరాన్న నిమోన్కరును కలిసారు. నిమోన్కరు పరుగున వెళ్ళి, ఆయన కాళ్ళు ముట్టుకుని, ఓగురుదేవా మీరు నాతో విసిగిపోయినట్టు ఉన్నారు, పోయినసారి మీరు ఎక్కడ ఉంటారు, పేరేమిటో చెప్పకుండా వెళ్ళిపోయారు అని అన్నాడు. నేను ఎర్రగుళకరాయి ఇవ్వడం ద్వారా నాపేరు చెప్పాను.
నర్మదనుండి వచ్చిన గణపతి ఎప్పుడూ ఎర్రగా ఉంటాడు, కానీ నువ్వు తెలివిలేని వాడివి అవడంతో దానిని అర్ధంచేసుకోలేక పోయావు. నేను షేగాం వాసిని, నాపేరు గజానన్. నువ్వు శ్రీధుమాళ్ ఇంటికిరా మనం మరోసారి కలుద్దాం అని శ్రీమహారాజు అన్నారు. అలా అంటూ శ్రీమహారాజు అదృశ్యం అయ్యారు. నిమోన్కరు ఆయనను చూడలేకపోయాడు. తరువాత అతను శ్రీధుమాళ్ ఇంటికి వెళ్ళాడు.
అక్కడ శ్రీమహారాజు కూర్చుని ఉండడం చూసి చాలా సంతోషించాడు. మనసులోనే శ్రీమహారాజుకు నమస్కరించి, కపిలధారనుండి, నాశిక్ వరకు జరిగిన సంగతులన్నీ ధుమాళ్ కు చెప్పాడు. శ్రీధుమాళ్ ఇవి అన్నీ విని చాలా ఆనందించి, శ్రీమహారాజును, ఆయన దివ్యశక్తికి పదేపదే పొగిడాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Gajanan Maharaj Life History - 102 🌹*
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
*🌻 Chapter 19 - part 10 🌻
It is believed to be a holy place and so people go there to take a bath on auspicious days. Shri Nimonkar also went there on one such auspicious day. He had some elementary knowledge of yoga and was very keen to develop it further, and as such was enquiring with every ascetic he met at that place. They all denied possessing the knowledge of Yoga that he sought after, which disappointed him very much.
He, then, with folded hands, implored God to show him a person who could teach yoga to him. Suddenly, at Kapildhara, he saw a man with long arms reaching his knees, who appeared to be a sage. This tall man, with calm face, was sitting in meditation. Nimonkar prostrated before Him and waited till the evening to see Him open His eyes. But the yogi didn’t open His eyes nor spoke anything.
For the whole day Nimonkar sat there without eating any food. As the evening approached, all the other ascetics at Kapildhara were returning. So Shri Nimonkar, with folded hands, implored the sage to teach him yoga. The sage gave him a picture and said, Your wish will be fulfilled by this picture on which is written a Mantra (hymn) of sixteen words.
Keep on chanting it continuously and by its power you may learn some yoga. Yoga Marga is the most difficult amongst all yogas. A small insect cannot go around Himalayas, nor can a snail climb the Meru Mountain. You may try Yoga by remaining a strict bachelor and cleaning your inner body by ‘Dhouti’ and ‘Nouti’.
If you do it sincerely, you shall be able to perform some Asanas. Now don't ask me any more questions, and take this Prasad.” Saying so, the ascetic gave Nimonkar a red pebble, and disappeared. The same yogi met Nimonkar again on the bank of Godavari at Nasik. Nimonkar went running to Him and touching His feet, said, Sir, You seem to be fed up with me.
Last time You went away without telling me Your name and whereabouts. The ascetic replied, I told you my name by giving you a red pebble. God Ganesh from Narmada is always red, but you being dull could not understand it.
I am from Shegaon, and my name is Gajanan. You come with me to the house of Shri Dhumal, where we shall meet again. Saying so, Shri Gajanan Maharaj disappeared and Nimonkar could not see Him. Then he went to Dhumal's house, where he was very happy to see Shri Gajanan Maharaj sitting there.
Mentally he bowed to Shri Gajanan Maharaj and told Dhumal, everything that had happened from Kapildhara to Nasik. Shri Dhumal was very glad to hear all that, and then praised Shri Gajanan Maharaj again and again for all his divine powers.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*ప్రసాద్ భరద్వాజ*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 80, 81 / Sri Lalitha Chaitanya Vijnanam - 80, 81 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*కరాంగుళీ నఖోత్పన్న నారాయణ దశాకృతి:*
*మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దాగ్ధసుర సైనికా ‖ 32 ‖ *
*🌻 80. 'కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి:' 🌻*
కుడి ఎడమ హస్తముల పదివేళ్ళ గోళ్ళనుండి పుట్టిన నారాయణుని దశావతారములు గలది అని అర్థము లేక జీవేశ్వరుల దశావస్థలు సృష్టి ఆకృతిగా కలది అని అర్థము.
సృష్టి అహంకారమైన భండాసురుడు తాత్కాలికముగ లలితాదేవిచే సంహరింపబడినను సృష్టి యున్నంత కాలము అహంకార ప్రజ్ఞ ఒక సూత్రముగ నున్నది. ఒక సృష్టి ధర్మముగ నున్నది. అది కాలమును, దేశమును బట్టి విజృంభించు చుండును. భండాసుర తత్త్వము అపుడపుడుద్భవించు చుండును. సృష్టికి విపత్తులు కలుగుచునే యుండును.
భండాసురుడు అసురశక్తి ప్రతీక. అందువల్లనే అతడును వివిధావతారములు ఎత్తుచుండును. అట్టి అహంకారశక్తిని సంహరించుటకు లలితాదేవి చేతి గోళ్ళనుండి నారాయణ తత్త్వము అవతరించు చుండును. ఈ సృష్టి మొత్తమును అమ్మకు, భండాసురునికి మధ్య జరుగుచున్న యుద్ధక్రీడగా భావించవచ్చును.
అహంకార ప్రజ్ఞ అమ్మ సంకల్పితమే. దాని నివారణము ఆమె సంకల్పమే. భండాసురుడు, సోమకుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కు డు, శిశుపాలుడు, దంతవక్రుడు, కాలయవనుడు వంటి రూపములు ధరించి సృష్టిని కల్లోలితము చేయుచుండును.
అమ్మ చేతి గోళ్ళనుండి పుట్టిన నారాయణుడు మత్స్య, కూర్మ, రామ,
కృష్ణాది దశావతారములను ధరించు చుండును. ముందు నామమున భండాసురుడు అహంకారాది అస్త్రములను సంధించుచుండగ, అమ్మ వానిని నిర్జించి నిర్మూలించు ప్రత్యస్త్రములను కురిపించుచున్నది అని తెలుపబడినది. దాని ఉదాహరణమే ఈ నామము.
భండాసురుడు సర్వ అసురాస్త్రము. దానికి విరుగుడు అమ్మ నారాయణాస్త్రము. అమ్మ నుండియే నారాయణుడు అవసరమైనపుడెల్ల దిగి వచ్చును. అహంకారమునుండి రక్షించును. అహంకారులకు పరిష్కారము నారాయణ మంత్రమే. అది అమ్మ అనుగ్రహముగ పనిచేయును. దైవమే జీవుడగుటకు పది స్థితులుగ ఏర్పడుచున్నవి. ఇవి దేవుని పది అవస్థలు. దైవము, జీవుడు, అహంకారము, బుద్ధి, పంచేంద్రియములు, మూలప్రకృతి. ఈ పది అవస్థలు నారాయణుని దశావతారములు.
అవి అమ్మనుండే ఏర్పడును. దైవము సృష్టిగ మారుటకు, జీవులుద్భవించుటకు అమ్మయే కారణము. మరల జీవులు, సృష్టి దైవమును చేరుటకు అమ్మయే మూలము. భండాసురుడు అమ్మ
అవరోహణ మార్గమునకు చెందినవాడు. నారాయణుడు ఆరోహణ మార్గమునకు చెందినవాడు.
సృష్టించుటకు భండాసురుని, ఉద్ధరించుటకు నారాయణుని తన రెండు అస్త్రములుగ (శక్తులుగ) అమ్మయే నిర్వర్తించు చున్నది. పది స్థితులలో సృష్టి నేర్పరచుట పది విధములుగ సృష్టిని ఉద్ధరించుట. ఇదియే అమ్మ మండలాకృతి. దశాకృతి. ఈ నామము అత్యంత గంభీరమగు నామము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 80 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Karāṅguli- nakhotpanna- nārāyaṇa-daśākṛitiḥ* *कराङ्गुलि-नखोत्पन्न-नारायण-दशाकृतिः (80) 🌻*
She created ten incarnations (dasa-avatāra) of Śrī Nārāyaṇa from Her nails. Bhandāsura created ten demons like Rāvana and others from his missile Sarvāsurāstra. These ten demons were killed by Lord Mahā Viṣṇu during His ten incarnations. Nārāyaṇa means jīva and Īśvara.
Daśākṛitiḥ means five stages of man like awake, asleep, deep sleep, turya (string together the first three. It is a metaphysical consciousness) and turyātīta (level of consciousness above the level of turya. No duality exists here) and the five functions of Brahman namely creation, sustenance, destruction, absorption (blessings) and merger.
The five stages of man and the five functions of God together are called daśākṛitiḥ. Possibly Nārāyaṇa mentioned here does not mean Lord Mahā Viṣṇu. Viṣṇu is the brother of Lalitai and hence Vāc Devi-s would not have meant to mean this way. The right explanation would be that She creates the five stages of man and five functions of Brahman from Her nails. The creation from the nails means the ease with which She creates these ten.
It has already been discussed about Her prakāśa and vimarśa forms. Every nāma in this Sahasranāma makes a mention to either of these forms.
{Further reading on turya and turyātīta: Turya is the fourth state of consciousness, the state higher than the normal three states of consciousness, awake, dream and deep sleep. Turya binds all these states together. The state of turya is the sate of metaphysical consciousness that is different from psychological consciousness or the empirical self. This remains as a witness of the divine.
Turyātīta is the state of mind beyond turya where the differenciated perception is totally rescinded. For the one who has attained this state, the entire universe appears as One, leading to perpetual blissfulness.}
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 81 / Sri Lalitha Chaitanya Vijnanam - 81 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*కరాంగుళీ నఖోత్పన్న నారాయణ దశాకృతి:*
*మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దాగ్ధసుర సైనికా ‖ 32 ‖ *
*🌻 81. 'మహాపాశుపతాస్త్రాన్ని నిర్దగ్గాసుర సైనికా' 🌻*
మహా పాశుపతాస్త్రము యొక్క అగ్నిచే అసుర సైన్యమును నిశ్శేషముగ దగ్ధమొనర్చునది శ్రీదేవి యని అర్థము. అసుర సైన్యమనగా అజ్ఞానపు చేష్టలు. మానవుని యందు అనేకానేక అజ్ఞానపు చేష్టలు తరచు తలయెత్తు చుండును. పాంచభౌతిక సృష్టియందు శరీరధారణ అయిన మానవుడు అజ్ఞానమునకు లోనగుట సహజము.
పరిసరము లందలి జీవుల ప్రవృత్తులు ఎక్కువ అజ్ఞాన పూరితములే గాన జ్ఞానవంతులు సైతము అజ్ఞానమున పడుట జరుగుచుండును. పశువులనగా తమ యందు కలిగిన అజ్ఞానముచే బంధింప బడినవారు. బహిః ప్రపంచమునే చూడ గలిగిన కన్నులు కలవారు. లోదృష్టి లేనివారు. బైటికి మాత్రమే చూచువారు.
ఇట్టి జీవులలోన ఈశ్వరుడున్నాడు కదా! అతడే పశుపతి. అతని నాశ్రయించిన జీవుడు అజ్ఞానమున బడడు. “సర్వజీవుల హృదయములో నున్న ఈశ్వరుని ఆశ్రయించని జీవులు మాయ యను యంత్రము నెక్కి సృష్టియందు పరిభ్రమించుచున్నారు” అని కృష్ణుడు గీతలో బోధించెను. హృదయమునందు ఈశ్వరుని ఆశ్రయించని వారి వృత్తులు అన్నియూ అవిద్యావృత్తులే. ఇవి అనంతమైన సైన్యముగ పుట్టుచుండును.
వీనిని హరించవలె నన్నచో జీవుడు పొందవలసినది పశుపతి తత్త్వము లేక ఈశ్వర తత్త్వము. అదియే పశుపతి అస్త్రము. సమస్త జీవుల యందలి ఈశ్వరుని దర్శించువారికి ఈ అస్త్రము లభించును. పశుపతి అస్త్రము కన్న మహా పాశుపతము ఉత్కృష్టమైనది. జీవుల యందలి ఈశ్వరుని గమనించుట యొక ఎత్తు. వారి ప్రవర్తనము లందు భగవంతుని క్రీడ చూచుట మరియొక ఎత్తు.
ఇతరుల ప్రవర్తనములు నచ్చుట, నచ్చకపోవుట అను ద్వంద్వమున సజ్జనులు సైతము బంధింప బడుచున్నారు. అనేకానేక ప్రవర్తనములు జీవులనుండి వ్యక్తమగు చుండును. వానిని సైతము దైవముగ భావించుట సదాశివ ఆరాధనము. దీనినే వైష్ణవులు 'వాసుదేవ ఉపాసన' అందురు.
ఇట్లారాధించు వారికి సృష్టి అంతయు దైవముయొక్క లీలావిలాసముగ
గోచరించును. వారు అజ్ఞాన ప్రవర్తనలు కూడ దైవలీలలుగనే చూతురు. కావున వారియందజ్ఞాన మిక పుట్టదు. ఇదియే మహాపాశుపత అస్త్రము. అది నిశ్శేషముగ అసురసైన్యమును దగ్ధము చేయగలదు.
పాశుపతాస్త్రము షడాక్షరి. మహాపాశుపతాస్త్రము అష్టాక్షరి. షదాక్షరి అనంతరము పంచభూతములపై ఆధిపత్యము నిచ్చును. అష్టాక్షరి మంత్రము త్రిగుణములపై కూడ ఆధిపత్యము వహించును.
షడాక్షరి దేహాత్మ భావమునుండి విముక్తులగుటకు, అష్టాక్షరి అహంకార భావము నుండి విముక్తి చెందుటకు ఈయబడినవి. 'ఓం విష్ణవేనమః' అనునది షడాక్షరి. 'ఓం నారాయణాయ నమః' అనునది అష్టాక్షరి. షడాక్షరి దేవత ఈశ్వరుడు లేక విష్ణువు. అష్టాక్షరి దేవత సదాశివుడు లేక నారాయణుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 81 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Mahā- pāśupatāstrāgni- nirdagdhāsura-sainikā* *महा-पाशुपतास्त्राग्नि-निर्दग्धासुर-सैनिका (81) 🌻*
She burnt the army of the demons with the astra called mahā-pāśupatā. This astra produces fire that causes the destruction of the entire enemy camp.
Liṇga Purāṇa says that pāśupatā is a rite that is divine and conducive to liberation from the clutches of bondage. This is a propitiation rite to Śiva.
Śiva is worshiped in different forms such as Śiva, Mahādeva, Sadāśiva, Paśupati, Kāmeśvara, etc and each form has distinct interpretation. Śiva is the lord of all the creations of the universe hence called as Paśupatī. Paśu refers to living beings. Nāma-s 271 and 272 describe the difference between Īśvarā and Sadāśiva.
As per Liṇga Purāna, pāśupatāsta mantra is a six syllable mantra “Om nama Śivāya” (ॐ नमशिवाय). In general Om is not taken into account in any of the mantra-s as all the mantra-s begin with Om.
A (अ) + U (उ) + M (म) and bindu constitute Om which indicates creation, sustenance and destruction, the three acts of God. That is why OM is a prefix to all the mantra-s. Nama Śivāya mantra is called pañcākṣara (five syllables).
In pāśupatāsta mantra Om is also taken into account and hence called six syllable mantra. This mantra is for Sadāśiva, the higher form of Śiva. (The five faces of Śiva are Īśānā, tatpuruśā, aghorā, vāmadevā and sadyojāthā).
These weaponaries mean mental progression from duality to non-duality (destruction of duality). The progress of the mind depends upon practice. Enemy camp means ignorance arising out of duality. With persistent practice, duality gives way to non-duality.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 456 / Bhagavad-Gita - 456 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -13, 14 🌴*
13. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర: కరుణ ఏవ చ |
నిర్మమో నిరహంకార: సమదుఃఖసుఖ: క్షమీ ||
14. సంతుష్ట: సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయ: |
మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్త: స మే ప్రియ: ||
🌷. తాత్పర్యం :
ద్వేషమనునది లేకుండ సర్వజీవుల యెడ మైత్రిని కలిగినవాడును, మమత్వము లేనివాడును, మిథ్యాహంకార రహితుడును, సుఖదుఃఖములు రెండింటి యందును సమభావము కలవాడును, క్షమాగుణము కలవాడును, సదా సంతుష్టుడైనవాడును, ఆత్మనిగ్రహము కలవాడును, తన మనోబుద్ధులను నా యందు లగ్నము చేసి దృఢనిశ్చయముతో నా భక్తి యందు నియుక్తుడైనట్టి వాడును అగు నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు.
🌷. భాష్యము :
విశుద్ధ భక్తియుత విషయమునకే మరల అరుదెంచి శ్రీకృష్ణభగవానుడు శుద్దభక్తుని దివ్యలక్షణములను ఈ రెండు శ్లోకములందు వివరించుచున్నాడు.
శుద్ధభక్తుడు ఎటువంటి పరిస్థితి యందును ఎన్నడు కలతనొందడు. అతడు ఎవ్వరిని ద్వేషింపడు. అలాగుననే శత్రువుకు శత్రువు కావలెననియు అతడు తలపడు. పైగా అతడు “నా పూర్వపాపకర్మల కారణముగా ఇతడు నా యెడ శత్రువుగా వర్తించుచున్నాడు.
కావున ఎదిరించుట కన్నను అనుభవించుటయే మేలు” అని తలపోయును. ఈ విషయమే “తత్తే(నుకంపాం సుసమీక్షమాణో భుంజాన ఏవాత్మకృతం విపాకం” అను శ్లోకము ద్వారా శ్రీమద్భాగవతమున (10.14.8) తెలుపబడినది.
అనగా భక్తుడు కలతకు గురియైనప్పుడు లేదా కష్టము సంప్రాప్తించినప్పుడు దానిని తనపై భగవానుడు చూపు కరుణగా భావించును. “నా పూర్వపాపము వలన ఇప్పుడు అనుభవించు కష్టము కన్నను అత్యంత దుర్భరమైన కష్టమును నేను అనుభవించవలసియున్నది.
కాని ఆ భగవానుని కరుణ చేతనే నేను పొందవలసిన శిక్షనంతటిని పొందక, ఆ శిక్షలో కొద్దిభాగమును మాత్రమే నేను పొందుచున్నాను” అని ఆ భక్తుడు తలపోయును. కనుకనే పలు కష్టపరిస్థితుల యందైనను భక్తుడు సదా శాంతుడును, కలతనొందనివాడును, ఓర్పు కలిగినవాడును అయి యుండును. అట్టి భక్తుడు తన శత్రువుతో సహా ప్రతివారి యెడను సదా కరుణను కలిగియుండును.
“నిర్మమ” అనగా భక్తుడు దేహమునకు సంబంధించిన బాధలకు, కష్టములకు ఎక్కువ ప్రాధాన్యము నొసగడని భావము. తాను భౌతికశరీరామును కాననెడి విషయమును అతడు సంపూర్ణముగా ఎరిగియుండుటాయ్ అందులకు కారణము. దేహాత్మభావనము లేని కారణమున అతడు మిథ్యాహంకారమునకు దూరుడై సుఖదుఃఖములందు సదా సమభావమును కలిగియుండును.
అతడు క్షమాగుణమును కలిగి, భగవత్కరుణచే ఏది ప్రాప్తించినచో దానితో సంతుష్టుడై యుండును. కష్టసాధ్యమైనదానిని పొందవలెనని తీవ్రముగా యత్నింపకుండుటచే సదా అతడు ఆనందమయుడై యుండును.
గురూపదేశములందు లగ్నమై యున్నందున అతడు సంపూర్ణయోగి యనబడును.
ఇంద్రియములన్నియును నిగ్రహింపబడియున్నందున అతడు ధీరుడును మరియు స్థిరనిశ్చయుడును అయి యుండును. భక్తియుతసేవ యను స్థిరనిశ్చయము నుండి అతనినెవ్వరును కదల్చలేనందున ఆ భక్తుడు మిథ్యావాదములచే ప్రభావితుడు కాడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 456 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 12 - Devotional Service - 13, 14 🌴*
13. adveṣṭā sarva-bhūtānāṁ
maitraḥ karuṇa eva ca
nirmamo nirahaṅkāraḥ
sama-duḥkha-sukhaḥ kṣamī
14. santuṣṭaḥ satataṁ yogī
yatātmā dṛḍha-niścayaḥ
mayy arpita-mano-buddhir
yo mad-bhaktaḥ sa me priyaḥ
🌷 Translation :
One who is not envious but is a kind friend to all living entities, who does not think himself a proprietor and is free from false ego, who is equal in both happiness and distress, who is tolerant, always satisfied, self-controlled, and engaged in devotional service with determination, his mind and intelligence fixed on Me – such a devotee of Mine is very dear to Me.
🌹 Purport :
Coming again to the point of pure devotional service, the Lord is describing the transcendental qualifications of a pure devotee in these two verses. A pure devotee is never disturbed in any circumstances. Nor is he envious of anyone.
Nor does a devotee become his enemy’s enemy; he thinks, “This person is acting as my enemy due to my own past misdeeds. So it is better to suffer than to protest.”
In the Śrīmad-Bhāgavatam (10.14.8) it is stated: tat te ’nukampāṁ su-samīkṣamāṇo bhuñjāna evātma-kṛtaṁ vipākam.
Whenever a devotee is in distress or has fallen into difficulty, he thinks that it is the Lord’s mercy upon him.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు - 71 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀 9. దైవ భావము - మనస్సు తన మయమగుట అనగా అన్ని సన్నివేశములను దైవముగ చూచుట. పరిసరముల యందలి రూపములు, ప్రవర్తనలు దైవముగ చూచుట. శుభాశుభ విషయముల యందు దైవమునే చూచుట. సమస్తము దైవమే అని మనస్సున దృఢపడుట. - అన్ని విషయములయందు దైవమునే ఆశ్రయించుట, ఇతరములను ఆశ్రయించకుండుట. 🍀*
*📚. 4. జ్ఞానయోగము - 10 📚*
వీతరాగభయక్రోధా మన్మయా మా ముపాశ్రితాః |
బహవో జ్ఞానతపసా పూతా మద్భావ మాగతాః || 10
ఈ శ్లోకము, ముందు శ్లోకము యొక్క కొనసాగింపు. ఇందున “నా మయమైన మనస్సు కలవారు”, “నన్నే ఆశ్రయించిన వారు”. ముఖ్యముగ గమనింపవలెను. నా మయమైన మనస్సు కలవారు, నన్నే ఆశ్రయించిన వారు. మమకారము, భయము, కోపము విడచినవారై, పవిత్రులై, నన్ను తెలియు చింతన గలవారై, నా భావమును పొందుచున్నారు.
అట్టి వారెందరో కలరు అని భగవంతుడు తెలుపుచున్నాడు. దైవమును చేరుటకు వలసిన నియమముల నిచ్చట దైవమే సూచించు చున్నాడు.
1. మనస్సు తన మయమగుట అనగా అన్ని సన్నివేశములను దైవముగ చూచుట. పరిసరముల యందలి రూపములు, ప్రవర్తనలు దైవముగ చూచుట. శుభాశుభ విషయముల యందు దైవమునే చూచుట. సమస్తము దైవమే అని మనస్సున దృఢపడుట.
2. అన్ని విషయములయందు దైవమునే ఆశ్రయించుట, ఇతరములను ఆశ్రయించకుండుట.
3. పై రెండు నియమములను పాటించువారి నుండి మమకారము, భయము, కోపము అను మలినములు నిష్కమించును. కామ క్రోధాదులు, భయభ్రాంతులు విసర్జించుటకు వీలులేనివి. కేవలము దైవచింతన మాత్రమే వానిని పారద్రోలగలదు. దీపము వెలిగించు కొన్నచో, చీకటి అదృశ్య మగును. మరియొక మార్గము లేదు. అట్లే మొదటి రెండు నియమములు చక్కగ పాటించు వారిని అరిషడ్వర్గములు వదలును గాని, వదిలించుకొను ప్రయత్నమున వదలవు. కావున మూడవ అంశము సిద్ధించినదే కాని ప్రయత్నించినది కాదు.
4. పై మూడు నియమములు సిద్ధించగ జీవుడు పవిత్రుడగును.
5. అట్లు పవిత్రుడైన జీవుడు దైవము తానుగ నున్నాడని ధ్యానము చేయుట వలన దైవరూపమున నిలచును. దైవభావమున పరిపూర్ణముగ నిలచును.
6. పై సోపానములన్నియు ఓర్పుగ నిర్వర్తింపబడవలెనే గాని, మరియొక మార్గము లేదు. ఇట్లు తనను పొందినవారెందరో కలరని దైవము తెలుపుచున్నాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 268 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
62. అధ్యాయము - 17
*🌻. సతీ కల్యాణము -3 🌻*
అపుడు ప్రసన్నమగు చిత్తము గల దక్షుడు సర్వేశ్వరుడగు హరునకు సర్వశ్రేష్ఠమగు ఆసనమును స్వయముగా నిచ్చి విధి విధానముగా పూజించెను (28).
తరువాత ఆతడు మంచి భక్తితో సరియగు విధానములో నున్న, విష్ణువును బ్రహ్మణులను, సర్వ దేవతలను, మరియు రుద్రగణములను పూజించెను (29).,
పూజ్యులగు మహర్షులతో కూడియున్న వారికి యథా యోగ్యమగు పూజను చేసి దక్షుడు మరల నా మానసపుత్రులగు మునులతో సంప్రదించెను (30).
తరువాత నా కుమారుడగు ఆ దక్షుడు ప్రీతితో తండ్రినగు నాతో 'ప్రభో!వివాహ కర్మను నీవే జరిపింపుము' అని పలికి ప్రణమిల్లెను (31).
నేను కూడా సంతసిల్లిన అంతఃకరణము గలవాడనై, సరే అని పలికి, లేచి ఆ కార్యమునంతనూ నిర్వర్తించితిని (32). అపుడు శుభముహూర్తమునందు గ్రహబలముతో కూడిన లగ్నములో దక్షుడు ఆనందముతో తన కుమార్తె యగు సతిని శంభునకిచ్చెను (33).
అపుడా వృషభధ్వజుడు ఆనందించి యథావిధిగా వివాహ కర్మను అనుష్ఠించి సుందరియగు దాక్షాయణితో పాణి గ్రహణమును చేసెను (34).
నేను, విష్ణువు, నీవు, ఇతరమునులు, దేవతలు, శివగణములు అందరు ఈశ్వరునకు నమస్కరించి గొప్ప స్తుతులచే సంతోషపెట్టిరి (35).
గొప్ప ఉత్సవము జరిగెను. నాట్యములు గానములు నిర్వహించబడెను. ముని గణములు, దేవతలు అందరు పరమానందమును పొందిరి (36).
నా కుమారుడగు దక్షుడు ఆనాడు కన్యాదానమును చేసి కృతార్ధుడాయెను. ఉమా పరమేశ్వరులు ప్రసన్నులైరి. సర్వము మంగళ నిధానమాయెను.(37).
శ్రీశివ మహాపురాణములో రెండవది యగు సతీఖండములో కన్యాదాన వర్ణనమనే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది (18).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 25 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 3 - THE FIRST RULE
🌻KILL OUT AMBITION - 4 🌻
101. Most of us have desires of that sort, but we call them aspirations; the change of name seems to connote a total change in our attitude, but of course they are still desires. We shall reach a stage when even those desires will disappear, because we shall be absolutely certain that progress depends on our own efforts only; then we shall no longer desire anything.
The Master once said: “Do not desire a thing; desire is feeble Will!”1 (1 Vol. I, Part V, Ch. 1: Liberation, Nirvana and Moksha.) Do not think of some quality you want to develop: “I should like to have it,” but say: “I will have it,” and go and develop it. That is the only line for a man to take, because these things are absolutely in his own hands to do or not, as he chooses.
102. It is a case of transmuting at first. The desire for spiritual growth is a thing that those who are approaching the Path should no longer be encouraging in themselves, but there is that intermediate stage when it is very natural. We who are students ought to be getting to a stage at which we take our spiritual growth for granted, and fix all our energies on trying to help others.
At first a man does need a personal motive; then he gradually comes to forget himself and to make his advancement for the sake of the Master, for the sake of pleasing Him, and eventually he learns that he is simply a channel for the great divine forces, and that he must be a good channel and must have no anxiety whatever about the result.
His one care then is that nothing on his part shall hinder his being an expression of the Divine – as perfect an expression as is possible for him. He does not worry in the least about it; he does not desire that his force may be used in this direction or that; he is simply a tool in the hands of God, that he may be used as arid how and where God wills.
103. Of course, we can attain that attitude only by degrees; but we should set it before ourselves as the state of mind at which we should aim. We must begin by forgetting ourselves, by rigorously weeding the self out.
What if we are not gaining the advancement which we think to be due to us after so many years of thought and study, or what if the people whom we help are not grateful for being helped – generally they are not – all that does not matter.1 (1 Vol. I, Part III, Ch. 2: The One Good Desire.)
Let us forget ourselves and do the work and let us be entirely indifferent as to any return. Karma will look after that; we need have no fear. The great laws of the universe are not going to be altered in order to do an injustice to any one of us, we may be quite sure. They will work with equal balance; justly they work, even though it be after many days.
Forget yourself; that is the first and the last word of advice on the occult Path – there is no other way. However hard it may seem it has to be done, and has to be done perfectly.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 156 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. నారద మహర్షి - 30 🌻*
215. పుణ్యం చేస్తే, అందరికీ దానం చేస్తే, గుళ్ళుగోపురాలు దర్శిస్తే జ్ఞానం కలుగుతుందా! దానివల్ల పుణ్యం రావచ్చును, ఐశ్వర్యం రావచ్చును. దానివల్ల కొడుకులు వృద్ధిలోకి రావచ్చు. అదీకాదు మోక్షార్థి చేయవలసినది. ఏ పనీ చెయ్యడు. ఏ పని చేసినా వైరాగ్యబుద్ధితో చెయ్యాలి.
216. తన మనుగడకు కావలసిన కనీస వసతులు ఎక్కడ లభిస్తే అక్కడ ఉండటమే! మోక్షేఛ్ఛ కలిగిన వాళ్ళ మార్గం ఇలా ఉంటుందని ఉపదేశం చెయ్యమని శుకుడికి నారదుడు బోధచేసాడు. తాను లేకపోతే, తన కుక్కపిల్లకు అన్నంపెట్టేవాళ్ళుకూడా లేరని, అది బ్రతకదని కొందరు వాపోతుంటారు.
217. అలాగే తాను పదవీవిరమణ చేస్తే చనిపోతే, తన భార్యా పుత్రులకు ఆధారం లేకుండా పోతుందని కూడా చింతిస్తూ ఉంటారు. అది నిజం కాదు. తాత్కాలికంగా అది సత్యంగా కనబడుతుందే తప్ప అది యథార్థం కాదు. అలా చెప్పినవాళ్ళు హఠాత్తుగా పోయిన తరువాత కూడా, ఇంకా అనేకమంది జీవిస్తూనే ఉన్నారు. బాగానే ఉన్నారు. ఏదో ఒకటి పొందనే పొందుతారు. ఎవరి కర్మ వాళ్ళదే!
218. అంతేకాని, నా మీద వాళ్ళు ఆధారపది ఉన్నారు అనేటటువంటి ‘ఆధార-ఆధేయ భావం’ మరొక జీవుడితో కల్పించుకోవటము అవిద్య, అజ్ఞానం అని పెద్దలు చెపుతున్నారు. వాస్తవానికి జీవులందరూ స్వతంత్రులే. పరస్పర సంబంధాలు కల్పితాలే.
219. మోక్షేఛ్ఛ కలిగిన వాడు తన మార్గాన్ని తను చూచుకోవాలి. ఒక ధర్మంకోసం మోక్షేఛ్ఛను వదిలిపెట్టినవాడు మోక్షేఛ్ఛ కలిగినవాడెట్లా అవుతాడు? మోక్షమందు వాడికి ఇఛ్ఛ ఉండేటట్లయితే, ధర్మంకూడా అతడి దృష్టిలోకి రాకూడదు. కర్తవ్యము మొదలైనవాటిని భావన చేయటం మోక్షవిషయంలో ధర్మంకాదు.
220. కాబట్టి ఆత్మయొక్క తేజోబలం చేత, దాని యొక్క మహత్తు చేత ఆత్మయే స్వయంగా బుద్ధిని తనలో లీనం చేసుకుంటుంది. అందుకై మోక్షార్థి అయినవాడు నిష్క్రియుడై కర్తవ్యలక్షణాదులు ఏమీ లేకుండా సర్వారంభ త్యాగిలా ఉండటమే అతడి ధర్మం.
221. ఎప్పుడూ కూడా, సంసారంలో కలిగిన బాధలు తనవి అనుకోవటం, పొరుగూళ్ళో ఎవరికో సుఖం కలుగుతున్నదని అసూయతో తను దుఃఖపడటం ఈ రెండూకూడా ఒకటే. తన శరీరంలో కలిగిన బాధను గురించి దుఃఖపడటం కూడా, ఇంకొకచోట ఎవరికో కలిగిన దుఃఖాన్ని చూచి తను దుఃఖించటం వంటిదే. ఈ రెండింటికీ తేడాయేలేదు.
223. దీని అర్థ మనం ఎలా చెప్పాలి అంటే – గ్రమాంతరంలో ఎవరో ఉన్నాడు, వాడికి ఏదో దుఃఖం కలిగింది. అది ఎలాంటిదో, తన శరీరానికి కలిగిన దుఃఖం కూడా అలాంటిదే! అంటే ఆ దుఃఖమూ తనది కాదు. అట్టి దృక్పథం మోక్షార్థి అవలంబించాలని నారదుడి బోధ.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివగీత - 110 / The Siva-Gita - 110 🌹*
*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 14
*🌻. పంచ కోశో పాసన - 6 🌻*
భోక్త్రుత్వం సాక్షితా చేతి- ద్వై దంత స్యోప పద్యతే,
ఆత పశ్చాపి తచ్చాయా -తత్ప్రకాశే విరాజతే .26
ఏకో భోజయితా తత్ర - భుంక్తేన్యః కర్మణ ఫలమ్,
క్షేత్రజ్ఞ రధివం విద్ధి - శరీరం రధమేవతు. 27
బుద్దింతు సారధిం విద్ధి - ప్రగ్రహం తు మనస్తదా,
ఇంద్రియాణి హయాన్విద్ది - విషయాం స్తే షు గోచరాన్ 28
ఇంద్రి యైర్మవ సా యుక్తం - భోక్తారం విద్ధి పూరుషమ్,
ఏవం శాంత్యాది యుక్తస్స -న్నుపాస్తే యస్సదా ద్విజః 29
ఉద్ఘాట్యో ద్ఘా ట్యైక మేకం - యద్యేవం కదళీ తరో:,
వల్క లాని తతః పశ్చా- ల్లభతే సార ముత్తమమ్ 30
తదైవ పంచ కోశేషు - మనస్సం క్రమయన్ క్రమాత్,
తేషాం మధ్యే తతస్సార - మాత్మాన మపి విందతి. 31
పరమాత్ముని తేజము (ప్రకాశము -వెల్తురు ) నుండి యెండ మరియు నీడలు ప్రకాశించు చున్నవి. దృగ్గో చర మగుచున్నవి. సుఖ దుఃఖాదులను అనుభవించు వాడొక్కడే. మిగతా వాడు కర్మ ఫలము లను భావించు చున్నాడు. శరీరమును రధము గాను, క్షేత్రజ్ఞు డైన జీవుని రధికుని గాను, బుద్దిని సారధి గాను ,మనస్సును కళ్ళెముగాను తెలిసి కొనుము.
ఇంద్రియములను గుర్రములు గాను, ఇంద్రియ గోచరములగు విషయములను ఆ యశ్వములు సంచరించు ప్రదేశములుగాను, ఇంద్రియములు మరియు మనస్సు చేతను కూడిన యాత్మను ఉపభోక్తయగు పురుషుని గాను తెలిసి కొనుము.
మానవుడు అరటి చెట్టు యొక్క పట్టలను,(పై భాగములను ) ఒక్కొక్క దానిని క్రమముగా దీసి వైచి కొనుచు, పిదప దాని యొక్క ఉత్తమమైన (సార భూతమగు ) కాదా నే విధముగా బడయుచున్నాడో అదే ప్రకారముగా శాంతి- శమ -దమాది సత్వ గుణ సంపన్నుడై సర్వదా నన్నుపాసన చేయు భక్తుడు అన్నమయాది పంచ కోశముల యందోక్కొక్క దానిని క్రమముగా నిరాకరించుచు, పోయి చివరకు యందలి సార భూతమగు నాత్మను గుర్తించు చున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 110 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 14
*🌻 Panchakoshopasana - 6 🌻*
From the aura of the Paramatman the shine and shadow are created and are visible to the eye. There is only one who enjoys and suffers the joys and pains. The others only assume/feel the fruits of Karma.
One should consider this body as the chariot, the Kshetrajna (Jiva) as the passenger, Intellect as the charioteer, Mind as the reins, Indriyas as the horses, the visible elements as the fields where those horses wander, and finally one should consider this Atman together with the Indriya and Manas which is the consumer
(upabhokta), as the Purusha.
As like as the peel of the banana tree and gets the inside main essence for food, same way a human should peel off his external blankets using the tools called ShantiSamaDama kind of Satwa qualities. and by always worshiping me and such a devotee discards gradually, the five Kosas (annamaya etc ), and finally realizes the actual essence called as the Atman (self).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 219 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 68. The primary concept 'I am' is dishonest, a cheat. It has tricked you into believing what is not. Focus sharply on the 'I am' and it'll disappear. 🌻*
The teaching says that first you must start an inquiry into the nature of this knowledge 'I am', how it appeared on you and what it lead to.
In the process of this inquiry you land up with the conclusion that this 'I am' is false and has deceived you into believing something that's not true.
You may theoretically agree with this conclusion but in order to actually understand it you have to keep a sharp focus for a prolonged period on the 'I am'. You have to do this repeatedly; in fact this is the 'Sadhana' (practice).
What will be the outcome of all this? A moment will come when the 'I am' will disappear and you will end up in your true natural state.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 95 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 17 🌻*
399. 1,2,3,4 భూమికలయందున్న సాధకులు చేయు చమత్కారములు.
ఒకటి, రెండు, మూడు భూమికలు యందుండువారు తమతమ భూమికలనుండి చమత్కారములను చేయుదురు.
ఉదా :- ఇతరుల మనోగతాభిప్రాయములను చెప్పుదురు. ఎక్కడ బడితే అక్కడ వస్తువులను సృజింతురు. చూడకుండగనే, గ్రంధములందలి విషయములను చదివెదరు. రైళ్లను నిల్పివేయిదురు. గంటల తరబడి భుసాపితులై బ్రతికియుందురు.
400. ఈ చమత్కారములు (సిద్ధులు లేక శక్తులు) నిజముగా వారు తమ తమ భూమికల నుండి సంపాదించినవే. సద్గురువులు, వీరిని మహిమలు చేయకుండునట్లు చేయుదురు.ఒక వేళ ప్రదర్శించినచో అవి ఫలితమునకు రాకుండ చేయుదురు.
401.అద్భుతశక్తులు, భౌతిక వ్యాఖ్యానములకు అందనివి, దానికి అతీతమైనవి. జీవితము ఎంత అగాధమైనదో అద్భుత శక్తులు కూడా అంత గుప్తమైనవి.
402. ఆధ్యాత్మిక మార్గములో అద్భుతశక్తులు వెయ్యోవంతు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 58 / Sri Vishnu Sahasra Namavali - 58 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*
*🌻. 58. మహావరాహో గోవిన్దః సుషేణః కానాకాంగదీ|*
*గుహ్యోగభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః|| 58 🌻*
స్వాతి నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం
538) మహావరాహ: -
మహిమగల వరాహమూర్తి.
539) గోవింద: -
గోవులకు ఆనందాన్నిచ్చువాడు. భూమికి ఆధార భూతమైనవాడు.
540) సుషేణ: -
శోభనమైన సేన గలవాడు.
541) కనకాంగదీ -
సువర్ణమయములైన భుజకీర్తులు కలవాడు.
542) గుహ్య: -
హృదయగుహలో దర్శించదగినవాడు.
543) గభీర: -
జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము మొదలగువానిచే
గంభీరముగా నుండువాడు.
544) గహన: -
సులభముగా గ్రహించుటకు వీలుకానివాడు.
545) గుప్త: -
నిగూఢమైన ఉనికి గలవాడు.
546) చక్రగదాధర: -
సుదర్శనమను చక్రమును, కౌమోదకీయను గదను ధరించినవాడు.
*🌹 Vishnu Sahasra Namavali - 58 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*🌻 58. mahāvarāhō gōvindaḥ suṣeṇaḥ kanakāṅgadī |*
*guhyō gabhīrō gahanō guptaścakragadādharaḥ || 58 || 🌻*
538. Mahā-varāhaḥ:
The great Cosmic Boar.
539. Gōvindaḥ: '
Go' means Words, that is the Vedic sentences. He who is known by them is Gōvindaḥ.
540. Suṣeṇaḥ:
One who has got about Him an armed guard in the shape of His eternal associates.
541. Kanakāṅgadī:
One who has Angadas (armlets) made of gold.
542. Guhyaḥ:
One who is to be known by the Guhya or the esoteric knowledge conveyed by the Upanishads. Or one who is hidden in the Guha or heart.
543. Gabhīraḥ:
One who is of profound majesty because of attributes like omniscience, lordliness, strength, prowess, etc.
544. Gahanaḥ:
One who could be entered into only with great difficulty. One who is the witness of the three states of waking, dreams and sleep as also their absence.
545. Guptaḥ:
One who is not an object of words, thought, etc.
546. Chakra-gadā-dharaḥ:
One who has discus and Gada in hand.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment