🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 43 / Sri Lalitha Sahasra Nama Stotram - 43 🌹
ప్రసాద్ భరద్వాజ
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా |
భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ ‖ 31 ‖
🌻 78. 'మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా' 🌻
విఘ్న యంత్రమును ఛిన్నాభిన్నము చేసిన మహాగణేశుని చూచి సంతసించిన దేవి అని అర్థము లేక మహాగణేశునిచే నిశ్శేషముగ నాశనము చేయబడిన విఘ్న యంత్రమును చూచి సంతోషించినది. సృష్టి యంత్రము నిర్మాణము చేసినది అమ్మయే. తాను మూల ప్రకృతి.
తన నుండి త్రిగుణములు త్రిశక్తులుగ పుట్టి అష్ట ప్రకృతుల నేర్పరచినది. అష్టప్రకృతులు అష్టపురములు. అవి అష్టసిద్ధులు. అప్లైశ్వర్య ములు అనుభూతిని కలిగించగల దివ్య లోకములు. కాని అజ్ఞానము కలిగినప్పుడు అవే అష్ట ప్రకృతులు కారణముగ అష్టకష్టములు, అష్టదరిద్ర ములు ఏర్పడగలవు. జీవులను సృష్టించి లోకములందు ప్రవేశ పెట్టి నపుడు అమ్మ వాత్సల్యముతో స్వతంత్రము నిచ్చినది. స్వతంత్ర మొక బాధ్యత. దానిని బాధ్యతా యుతముగ నిర్వర్తించుకొనని వారు అజ్ఞానమున పడి బద్ధులగుదురు.
ఇట్లు అష్ట ప్రకృతులు దివ్యానుభూతికే నిర్మాణము కాబడినను, అజ్ఞానవశమున అవి అష్టబంధములగును. అట్టి బద్ధచేతన గల జీవులకు అష్టబంధములు, అష్టవిఘ్నము లేర్పడును. ఇట్లు ఇష్ట ప్రకృతులకు సంబంధించి అష్టపురముల యందు విఘ్నము లేర్పరచు ప్రజ్ఞ యొకటి యున్నది. ఇదియే విఘ్నయంత్రము. పురోగతి చెందుచున్న జీవులకు వారియందలి అజ్ఞానమే వారికి విఘ్నములు కలిగించును. తమయందలి అజ్ఞానము అహంకారమును, బుద్ధిని, చిత్తమును పంచేంద్రియములను ఆవరించి యుండును.
ఇవియే మానవునందలి అష్టప్రకృతులు లేక అష్టపురములు. వీని యందలి అజ్ఞాన రూపమున ఎనిమిది స్థానములలో విఘ్నముల ప్రణాళిక యున్నది. దీనినొక యంత్రముగ ఏర్పరచినవాడు విశుక్రుడు. విశుక్రుడు శుక్రాచార్యుని ప్రతీక. ఏ లోకము నుండి తరింప వలెనన్నను ఆ లోకపు టజ్ఞానము నశింపవలెను కదా! అందులకే అతడు జీవులలోని అష్ట ప్రకృతులలో గల అజ్ఞానమును బట్టి విఘ్నము లేర్పరచెను.
విఘ్నములను తొలగింపచేయు దేవత మహాగణపతి. అహంకారము వరకు గల అజ్ఞానమును అతడే నశింప జేయగలడు. శివతేజమైన కుమారస్వామి యొక్క అహంకారమును కూడ అతడే నేర్పుతో, ప్రేమతో నశింపచేసి సుబ్రహ్మణ్యుని తీర్చి దిద్దెను. కావున మన యందలి అష్టప్రకృతులలో గల అజ్ఞానము నశింపచేయుటకే మహాగణపతి యున్నాడని భావించి అతని అనుగ్రహము కొఱకై ప్రతినిత్యము అతనిని పూజింపవలెను.
మహాగణపతి ఆరాధనమున బుద్ధి సిద్ధి కలిగి అజ్ఞాన ప్రతీకలైన విఘ్నములను పరిష్కరించు కొనవచ్చును. ఇట్లు నిత్యము గణపతి జీవుల నుద్ధరించుచునే యున్నాడు. జీవుల యందలి విఘ్న యంత్రములను అతడే నశింప చేయగలడు. ఇట్లు జీవోద్ధరణ కార్యక్రమమున నిమగ్నుడైన మహాగణపతి అనిన అమ్మకు చాల ప్రీతి అతని యెడల ఆమె ఎల్లప్పుడునూ ప్రసన్నయే.
పూర్వము దేవత లహంకరించి నపుడు వారిపైన కూడ విశుక్రుని విఘ్నయంత్ర ప్రభావము పడెను. ఆ యంత్రముచే వారు బంధింపబడిరి. వారపుడు మహాగణపతిని ప్రార్థింపగ అతను ప్రసన్నుడై ఆ విఘ్న యంత్రమును ఛిన్నాభిన్నము చేసెను. అహంకారము కల చోట విఘ్న యంత్ర ముండును. ఇక మిగిలిన బుద్ధి, చిత్తము, మనస్సుల విషయము చెప్పనేల?
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 78 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Mahāgaṇeśa- nirbhinna- vighnayantrā-praharṣitā महागणेश-निर्भिन्न-विघ्नयन्त्रा-प्रहर्षिता (78) 🌻
This is in continuation of the previous nāma. Gaṇeśa was created to remove the yantra, jaya vignaṁ planted by Bhandāsurā. Gaṇeśā removed that yantra and helped the army of Lalitai to regain their self confidence.
Lalitai was delighted with Gaṇeśa, when he removed the yantra. We have to observe the beauty of these two nāma-s. All evil activities are represented by this yantra. Māyā is the cause of evil acts.
This māyā is caused by Lalitai and She alone can remove the veil of māyā. Once She decides to remove the veil, pure Śiva is realized. But Lalitai, on Her own, will not remove the veil. She will remove the veil of māyā depending upon one’s efforts.
That is why, She is addressed as Guru (nāma 713), later in this Sahasranāma.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 79 / Sri Lalitha Chaitanya Vijnanam - 79 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా |
భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ ‖ 31 ‖
🌻 79. 'భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ' 🌻
భండాసురునిచే వదలబడిన అస్త్రములకు ప్రత్యస్త్రములను వర్షింపచేసిన దేవి అని అర్థము.
భండాసురుడు అహంకార ప్రజ్ఞయని యిదివరకే తెలిపి యుంటిమి. అహంకార మాధారముగనే జీవుడు తానొకడు ప్రత్యేకముగ నున్నాడని గుర్తించును. ఇతనిని ప్రత్యగాత్మ యందురు. తా నున్నాడు గనుక, తనకి తరములు గోచరించుచుండును. అప్పుడు వాటి ననుభూతి చెందవచ్చును.
అనుభూతి చెందు ప్రయత్నమున వానిని పొందు ప్రయత్నము కూడ నుండును. అట్టి సమయమున అతనికి స్వార్థ చింత పెరుగును. ఆ స్వార్థమే అతనికి అనర్ధ కారణము. సృష్టి యజ్ఞార్థమే కాని స్వార్థము కాదు. యజ్ఞార్థ సృష్టియందు ఇతరుల శ్రేయస్సు కొరకు పనిచేయుచున్నచో తన శ్రేయస్సుకూడ జీవునకు లభించును. ఇది తెలియక తన కోసము పనిచేసుకొనుటయే మొదటి అజ్ఞానము.
ఇది కారణముగ జీవుడు రకరకముల అత్యాచారములు కూడ చేయును. దైవమిచ్చిన బుద్ధిని, బలమును దుర్వినియోగము చేయును. అట్టివాడు సృష్టి కంటకుడు కూడ కావచ్చును. అట్టివాడు చేయు తలపులు పనులే అస్త్రములు.
అస్త్రములు వేరు, బాణములు వేరు. బాణములు ధనస్సు నుండి వదలబడినవి. అస్త్రములు హస్తముల నుండి వదలబడినవి. మనసున సంకల్పించి చేతితో వదలునది అస్త్రము. మంత్రించి వదలినచో శస్త్రము. ఇట్లు అస్త్ర శస్త్రములను వదలు అహంకారులను నిర్జించవలెను కదా!
నిర్జించనిచో సృష్టికే ముప్పు. అందుచే అవసరమైనపుడెల్ల వీనికి ప్రత్యస్త్రములు సృష్టించి వదలవలసిన ఆవశ్యకత కలుగును. ప్రత్యస్త్రములు సృష్టించుటలో అమ్మ దిట్ట. లోకములను కల్లోలితము చేయు అహంకారులు జన్మించినపుడు త్రిమూర్తులు సైతము వారిని నిర్జించలేని సమయమున అమ్మ వినూత్నమైన రూపమును ధరించి, వినూత్నమగు ప్రత్యస్త్రములు వర్షింపచేసి అహంకారులను నశింపచేసిన సందర్భము లెన్నియో గలవు.
మన యందలి అహంకారము నుండి ఎన్నియో దురాలోచనలు, దుర్భాషణములు, చేతలు కలుగుచుండెను. వానిని నిర్మూలించమని అమ్మను ప్రార్థించుటకే ఈ నామము.
సృష్టి అహంకార స్వరూపమైన భండాసురునే సంహరించగల అమ్మకు, మనబోటి వారి అహంకారమును జయించుట ఒక లెక్కా? అమ్మను నిజముగ ఆరాధించు వారికి అహంకారము పరిపూర్ణముగ నశించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 79 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Bhaṇḍāsurendra- nirmukta- śastra-pratyastra-varṣiṇī भण्डासुरेन्द्र-निर्मुक्त-शस्त्र-प्रत्यस्त्र-वर्षिणी (79) 🌻
She counters the weapons used by Bhandāsura, by using Her own.
Here, two types of weaponaries are mentioned. One is astra that is thrown at the enemies in a battle field. Modern day bombs can be compared to this. Another is śastra, which is always held in hand, like a gun.
The weaponaries of Lalitai aids our efforts in attaining bliss by destroying avidyā. Weapons coming out of Her hands are aimed at us in destroying the illusion of duality.
Nāma-s 77, 78 and 79 together convey the steps to be initiated in Self-realization and how She helps one in reaching his supreme goal.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
08 Nov 2020
Please join and share with your friends.
You can find All my messages from beginning in these groups.
Facebook group : . చైతన్య విజ్ఞానం – Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/
Facebook Hastags: (Search these Hastags on Facebook)
#ChaitanyaVijnanam #PrasadBhardwaj
WhatsApp: . AMRUTASYA PUTRAAHA
https://chat.whatsapp.com/HrBxBAaKb0g73IXeMhwXmx
Whatsapp Group: గాయత్రి శక్తి Gāyatri Śakti
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin
Telegram group : . చైతన్య విజ్ఞానం – Chaitanya Vijnanam
https://t.me/ChaitanyaVijnanam
Telegram group: విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama.
Exclusively for శ్రీ మాహా విష్ణువు సంబంధిత జ్ఞానం కోసం.
https://t.me/vishnusahasra
Telegram group: ్రీ దత్తాత్రేయ చైతన్యం – Sri Datta Chaitanya
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA
Telegram group: శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam
https://t.me/srilalithadevi
Telegram: శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam
https://t.me/SriMataChaitanyam
Telegram channel : . చైతన్య విజ్ఞానం – Chaitanya Vijnanam
https://t.me/Spiritual_Wisdom
Telegram Channel: Seeds Of Consciousness
This channel is dedicated to Seeds of consciousness given by various masters.
https://t.me/Seeds_Of_Consciousness
Blogs/Websites:
www.incarnation14.wordpress.com
www.dailybhakthimessages.blogspot.com
No comments:
Post a Comment