🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 101 / Sri Gajanan Maharaj Life History - 101 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 19వ అధ్యాయము - 9 🌻
నాగర్ జిల్లాలో ప్రవదనది తీరాన్న చిన్నదే కానీ సుందరమయిన పట్టణం సంగమనేరు నిర్మించబడి ఉంది. ప్రఖ్యాత కవి ఆనంద్ ఫండి ఈఊరి వాడే. ఇప్పుడు ఈఊరివాడయిన హరీజఖడ్యా కధవినండి:......ఇతను ఒకచోట నుండి ఇంకొకచోటుకి భుక్తికి తిరిగే యజుర్వేద బ్రాహ్మణుడు. తన ప్రయాణంలో షేగాంచేరి శ్రీమహారాజు దర్శనం చేసుకున్నాడు.
శ్రీమహారాజు కృపవల్ల తమవాంఛలు పూర్తి అయిన మీదట, ప్రసాదం పంచడం కోసం, లేదా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కోసం వేలకొలది ప్రజలు అక్కడకు రావడం అతను చూసాడు. అదిచూసి ఈమహాయోగి దగ్గర నుండి ఏమీ పొందకుండానే నేను వెనక్కి వెళ్ళిపోవాలి, ఇది రాయిమీద గడ్డికూడా మొలకెత్తని విధంగా, నా దురదృష్టం వల్లనే.
నాకు ఒకరోజు భోజనం దొరుకు తుంది, కానీ మరుసటిరోజు అదృష్టం ఎలా ఉంటుందో తెలియదు. ఇంతవరకూ నాజీవితం ఇలా ఉంది. నాదగ్గర ధనంకానీ, ఆఫ్రికానీ లేవు. నాకు వధువును ఎవరు ఇస్తారు ? ఓ స్వామీ గజాననా ఆనందభండారా నాకు సంసారిక జీవితం గడపాలని తీవ్రమయిన కోరిక ఉంది. మంచి కుటంబం నుండి నాకు తగిన భార్యను, పిల్లల్ని కూడా ఇచ్చి నా ఈకోరికను దయచేసి పూర్తి చెయ్యండి అని అతను ఆలోచించాడు.
ఈవిధంగా అతను ఆలోచిస్తూ ఉండగా, శ్రీమహారాజు అతని మనసు తెలుసుకొని అతనిమీద ఉమ్మి విలువలేని వాటిని అతను నానుండి కోరాడు కావున నేను అతని మీద ఉమ్మాను, ప్రజలు నాదగ్గరకి, ఈప్రాపంచిక బంధనాలనుండి విముక్తి పొందడానికి వస్తారు, కానీ ఈహరి నానుండి ఈ ప్రాపంచిక సుఖాలు అడిగాడు. చూడండి ప్రపంచ విషయాలు ఎలా ఉన్నాయో ? అందరికీ అనిశ్చితమైన సుఖాలు కావాలి, అతి శక్తివంతుడయిన హరిని ఎవరూ చూడాలని కోరుకోవడం లేదు అని తనలోతాను అనుకున్నారు.
తరువాత శ్రీమహారాజు హరిని చూసి, నువ్వు ప్రస్తుతం నీమనసులో కోరుకున్న వన్నీ పొందుతావు. నీకు భార్య, పిల్లలు, దనం కూడా లభిస్తాయి. ఇక ఇంటికి వెళ్ళి ఆనందకరమైన వైవాహిక జీవితం గడుపు, కానీ ఆ అతి శక్తివంతుడయిన భగవంతుడిని మరువకు అని అన్నారు. ఇటువంటి ఉపదేశం ఇస్తూ శ్రీమహారాజు అతనికి వివాహంకోసం కొంత డబ్బుకూడా ఇచ్చారు. తదనంతరం హరిజఖడ్యా వివాహం అయి సంతోషంగా ఉన్నాడు.
శ్రీమహారాజు మాటలు ఎలా వృధాకాగలవ ? ఒకసారి, భూముల సమాచార సేకరణ అధికారి అయిన శ్రీరామచంద్ర గోవిందనిమోన్కర్ మరియు వాసుదేవ ఫౌండ్రీలు నాశిక్ జిల్లా, ఇగత్ పురి తాలూకా, సహయాద్రికొండలో ఉన్న మునా నదికి వెళ్ళారు. అక్కడ అడవి చక్కటి ఆకుపచ్చ చెట్లు, పళ్ళబరువుతో వంగి ఉండి, ఆనేకమయిన అడవి జంతువులు స్వేఛ్ఛగా తిరుగుతూ ఉన్నాయి. ఆముకానా నది దగ్గర సన్నటి ఒకకొండపాయలో కపిలధార పేరుగల జలపాతం ఉంది. అది పవిత్ర స్థలంగా నమ్మబడేది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Gajanan Maharaj Life History - 101 🌹
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
🌻 Chapter 19 - part 9 🌻
A small, but beautiful town of Sangamner is situated on the bank of Pravara river in Nagar district. The famous poet Anand Fandi hailed from this place only. Now listen to the story of Hari Jakhadya if that place. He was a Yajurvedi Brahmin who moved from place to place for livelihood. In his travels, he reached Shegaon and went for the darshan of Shri Gajanan Maharaj .
He saw thoudands of people coming there for distributing prasad or the feeding of Brahmins for having gotten the fulfillment of their desires, by the grace of Shri Gajanan Maharaj . Looking at this, he thought, “I am required to from this great saint without getting anything. It is because of my bad luck which, like a rock, will not allow even the grass to grow on it.
I get food for one day and don’t know my fate for the next. Such has been my life so far. I neither have money nor property. Who will offer me a bride? O Swami Gajanan! Abode of Happiness! I keenly desire to have the pleasure of family life. Indly fulfill it by giving me a virtous wife from a good family anfd then children too.”
As he was thinking so, Shri Gajanan Maharaj , knowing his mind, spat on him and said to Himself, “I spat on him because he asked for a worthless thing from Me. People come to Me for liberation from the bonds of this material world, but this Hari has asked for worldly pleasure from Me. See, how the ways of the world are! All seek material pleasure and nobody wants to see the Almightly Hari.”
Then Shri Gajanan Maharaj looked at Hari and said, “You will get everything that you have presently desired in your mind. You will get wife, children and money too. Now go home and lead a happy married life, but don’t forget the Almighty God.” With this advice, Shri Gajanan Maharaj gave him some money for his marriage. Thereafter, Hari Jakadia got married and and was happy. How can the words of Shri Gajanan Maharaj go to waste?
Once, Shri Ramchandra Govind Nimonkar, an overseer, and Vasudeo Bende went to the Mukana River in the hills of Sahyadri in Igatpuri Tahsil of Nasik District. The forest over there was lush green with trees bending with the weight of fruits, and there were freely roaming wild animals. Near that Mukana River is a small stream in a narrow valley known as Kapildhara.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
08 Nov 2020
No comments:
Post a Comment