ప్రసాద్ భరద్వాజ
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 80, 81 / Sri Lalitha Chaitanya Vijnanam - 80, 81 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
కరాంగుళీ నఖోత్పన్న నారాయణ దశాకృతి:
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దాగ్ధసుర సైనికా ‖ 32 ‖
🌻 80. 'కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి:' 🌻
కుడి ఎడమ హస్తముల పదివేళ్ళ గోళ్ళనుండి పుట్టిన నారాయణుని దశావతారములు గలది అని అర్థము లేక జీవేశ్వరుల దశావస్థలు సృష్టి ఆకృతిగా కలది అని అర్థము.
సృష్టి అహంకారమైన భండాసురుడు తాత్కాలికముగ లలితాదేవిచే సంహరింపబడినను సృష్టి యున్నంత కాలము అహంకార ప్రజ్ఞ ఒక సూత్రముగ నున్నది. ఒక సృష్టి ధర్మముగ నున్నది. అది కాలమును, దేశమును బట్టి విజృంభించు చుండును. భండాసుర తత్త్వము అపుడపుడుద్భవించు చుండును. సృష్టికి విపత్తులు కలుగుచునే యుండును.
భండాసురుడు అసురశక్తి ప్రతీక. అందువల్లనే అతడును వివిధావతారములు ఎత్తుచుండును. అట్టి అహంకారశక్తిని సంహరించుటకు లలితాదేవి చేతి గోళ్ళనుండి నారాయణ తత్త్వము అవతరించు చుండును. ఈ సృష్టి మొత్తమును అమ్మకు, భండాసురునికి మధ్య జరుగుచున్న యుద్ధక్రీడగా భావించవచ్చును.
అహంకార ప్రజ్ఞ అమ్మ సంకల్పితమే. దాని నివారణము ఆమె సంకల్పమే. భండాసురుడు, సోమకుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కు డు, శిశుపాలుడు, దంతవక్రుడు, కాలయవనుడు వంటి రూపములు ధరించి సృష్టిని కల్లోలితము చేయుచుండును.
అమ్మ చేతి గోళ్ళనుండి పుట్టిన నారాయణుడు మత్స్య, కూర్మ, రామ,
కృష్ణాది దశావతారములను ధరించు చుండును. ముందు నామమున భండాసురుడు అహంకారాది అస్త్రములను సంధించుచుండగ, అమ్మ వానిని నిర్జించి నిర్మూలించు ప్రత్యస్త్రములను కురిపించుచున్నది అని తెలుపబడినది. దాని ఉదాహరణమే ఈ నామము.
భండాసురుడు సర్వ అసురాస్త్రము. దానికి విరుగుడు అమ్మ నారాయణాస్త్రము. అమ్మ నుండియే నారాయణుడు అవసరమైనపుడెల్ల దిగి వచ్చును. అహంకారమునుండి రక్షించును. అహంకారులకు పరిష్కారము నారాయణ మంత్రమే. అది అమ్మ అనుగ్రహముగ పనిచేయును. దైవమే జీవుడగుటకు పది స్థితులుగ ఏర్పడుచున్నవి. ఇవి దేవుని పది అవస్థలు. దైవము, జీవుడు, అహంకారము, బుద్ధి, పంచేంద్రియములు, మూలప్రకృతి. ఈ పది అవస్థలు నారాయణుని దశావతారములు.
అవి అమ్మనుండే ఏర్పడును. దైవము సృష్టిగ మారుటకు, జీవులుద్భవించుటకు అమ్మయే కారణము. మరల జీవులు, సృష్టి దైవమును చేరుటకు అమ్మయే మూలము. భండాసురుడు అమ్మ
అవరోహణ మార్గమునకు చెందినవాడు. నారాయణుడు ఆరోహణ మార్గమునకు చెందినవాడు.
సృష్టించుటకు భండాసురుని, ఉద్ధరించుటకు నారాయణుని తన రెండు అస్త్రములుగ (శక్తులుగ) అమ్మయే నిర్వర్తించు చున్నది. పది స్థితులలో సృష్టి నేర్పరచుట పది విధములుగ సృష్టిని ఉద్ధరించుట. ఇదియే అమ్మ మండలాకృతి. దశాకృతి. ఈ నామము అత్యంత గంభీరమగు నామము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 80 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Karāṅguli- nakhotpanna- nārāyaṇa-daśākṛitiḥ कराङ्गुलि-नखोत्पन्न-नारायण-दशाकृतिः (80) 🌻
She created ten incarnations (dasa-avatāra) of Śrī Nārāyaṇa from Her nails. Bhandāsura created ten demons like Rāvana and others from his missile Sarvāsurāstra. These ten demons were killed by Lord Mahā Viṣṇu during His ten incarnations. Nārāyaṇa means jīva and Īśvara.
Daśākṛitiḥ means five stages of man like awake, asleep, deep sleep, turya (string together the first three. It is a metaphysical consciousness) and turyātīta (level of consciousness above the level of turya. No duality exists here) and the five functions of Brahman namely creation, sustenance, destruction, absorption (blessings) and merger.
The five stages of man and the five functions of God together are called daśākṛitiḥ. Possibly Nārāyaṇa mentioned here does not mean Lord Mahā Viṣṇu. Viṣṇu is the brother of Lalitai and hence Vāc Devi-s would not have meant to mean this way. The right explanation would be that She creates the five stages of man and five functions of Brahman from Her nails. The creation from the nails means the ease with which She creates these ten.
It has already been discussed about Her prakāśa and vimarśa forms. Every nāma in this Sahasranāma makes a mention to either of these forms.
{Further reading on turya and turyātīta: Turya is the fourth state of consciousness, the state higher than the normal three states of consciousness, awake, dream and deep sleep. Turya binds all these states together. The state of turya is the sate of metaphysical consciousness that is different from psychological consciousness or the empirical self. This remains as a witness of the divine.
Turyātīta is the state of mind beyond turya where the differenciated perception is totally rescinded. For the one who has attained this state, the entire universe appears as One, leading to perpetual blissfulness.}
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 81 / Sri Lalitha Chaitanya Vijnanam - 81 🌹

🌻 81. 'మహాపాశుపతాస్త్రాన్ని నిర్దగ్గాసుర సైనికా' 🌻
మహా పాశుపతాస్త్రము యొక్క అగ్నిచే అసుర సైన్యమును నిశ్శేషముగ దగ్ధమొనర్చునది శ్రీదేవి యని అర్థము. అసుర సైన్యమనగా అజ్ఞానపు చేష్టలు. మానవుని యందు అనేకానేక అజ్ఞానపు చేష్టలు తరచు తలయెత్తు చుండును. పాంచభౌతిక సృష్టియందు శరీరధారణ అయిన మానవుడు అజ్ఞానమునకు లోనగుట సహజము.
పరిసరము లందలి జీవుల ప్రవృత్తులు ఎక్కువ అజ్ఞాన పూరితములే గాన జ్ఞానవంతులు సైతము అజ్ఞానమున పడుట జరుగుచుండును. పశువులనగా తమ యందు కలిగిన అజ్ఞానముచే బంధింప బడినవారు. బహిః ప్రపంచమునే చూడ గలిగిన కన్నులు కలవారు. లోదృష్టి లేనివారు. బైటికి మాత్రమే చూచువారు.
ఇట్టి జీవులలోన ఈశ్వరుడున్నాడు కదా! అతడే పశుపతి. అతని నాశ్రయించిన జీవుడు అజ్ఞానమున బడడు. “సర్వజీవుల హృదయములో నున్న ఈశ్వరుని ఆశ్రయించని జీవులు మాయ యను యంత్రము నెక్కి సృష్టియందు పరిభ్రమించుచున్నారు” అని కృష్ణుడు గీతలో బోధించెను. హృదయమునందు ఈశ్వరుని ఆశ్రయించని వారి వృత్తులు అన్నియూ అవిద్యావృత్తులే. ఇవి అనంతమైన సైన్యముగ పుట్టుచుండును.
వీనిని హరించవలె నన్నచో జీవుడు పొందవలసినది పశుపతి తత్త్వము లేక ఈశ్వర తత్త్వము. అదియే పశుపతి అస్త్రము. సమస్త జీవుల యందలి ఈశ్వరుని దర్శించువారికి ఈ అస్త్రము లభించును. పశుపతి అస్త్రము కన్న మహా పాశుపతము ఉత్కృష్టమైనది. జీవుల యందలి ఈశ్వరుని గమనించుట యొక ఎత్తు. వారి ప్రవర్తనము లందు భగవంతుని క్రీడ చూచుట మరియొక ఎత్తు.
ఇతరుల ప్రవర్తనములు నచ్చుట, నచ్చకపోవుట అను ద్వంద్వమున సజ్జనులు సైతము బంధింప బడుచున్నారు. అనేకానేక ప్రవర్తనములు జీవులనుండి వ్యక్తమగు చుండును. వానిని సైతము దైవముగ భావించుట సదాశివ ఆరాధనము. దీనినే వైష్ణవులు 'వాసుదేవ ఉపాసన' అందురు.
ఇట్లారాధించు వారికి సృష్టి అంతయు దైవముయొక్క లీలావిలాసముగ
గోచరించును. వారు అజ్ఞాన ప్రవర్తనలు కూడ దైవలీలలుగనే చూతురు. కావున వారియందజ్ఞాన మిక పుట్టదు. ఇదియే మహాపాశుపత అస్త్రము. అది నిశ్శేషముగ అసురసైన్యమును దగ్ధము చేయగలదు.
పాశుపతాస్త్రము షడాక్షరి. మహాపాశుపతాస్త్రము అష్టాక్షరి. షదాక్షరి అనంతరము పంచభూతములపై ఆధిపత్యము నిచ్చును. అష్టాక్షరి మంత్రము త్రిగుణములపై కూడ ఆధిపత్యము వహించును.
షడాక్షరి దేహాత్మ భావమునుండి విముక్తులగుటకు, అష్టాక్షరి అహంకార భావము నుండి విముక్తి చెందుటకు ఈయబడినవి. 'ఓం విష్ణవేనమః' అనునది షడాక్షరి. 'ఓం నారాయణాయ నమః' అనునది అష్టాక్షరి. షడాక్షరి దేవత ఈశ్వరుడు లేక విష్ణువు. అష్టాక్షరి దేవత సదాశివుడు లేక నారాయణుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 81 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Mahā- pāśupatāstrāgni- nirdagdhāsura-sainikā महा-पाशुपतास्त्राग्नि-निर्दग्धासुर-सैनिका (81) 🌻
She burnt the army of the demons with the astra called mahā-pāśupatā. This astra produces fire that causes the destruction of the entire enemy camp.
Liṇga Purāṇa says that pāśupatā is a rite that is divine and conducive to liberation from the clutches of bondage. This is a propitiation rite to Śiva.
Śiva is worshiped in different forms such as Śiva, Mahādeva, Sadāśiva, Paśupati, Kāmeśvara, etc and each form has distinct interpretation. Śiva is the lord of all the creations of the universe hence called as Paśupatī. Paśu refers to living beings. Nāma-s 271 and 272 describe the difference between Īśvarā and Sadāśiva.
As per Liṇga Purāna, pāśupatāsta mantra is a six syllable mantra “Om nama Śivāya” (ॐ नमशिवाय). In general Om is not taken into account in any of the mantra-s as all the mantra-s begin with Om.
A (अ) + U (उ) + M (म) and bindu constitute Om which indicates creation, sustenance and destruction, the three acts of God. That is why OM is a prefix to all the mantra-s. Nama Śivāya mantra is called pañcākṣara (five syllables).
In pāśupatāsta mantra Om is also taken into account and hence called six syllable mantra. This mantra is for Sadāśiva, the higher form of Śiva. (The five faces of Śiva are Īśānā, tatpuruśā, aghorā, vāmadevā and sadyojāthā).
These weaponaries mean mental progression from duality to non-duality (destruction of duality). The progress of the mind depends upon practice. Enemy camp means ignorance arising out of duality. With persistent practice, duality gives way to non-duality.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
09 Nov 2020

Please join and share with your friends.
You can find All my messages from beginning in these groups.
Facebook group : . చైతన్య విజ్ఞానం – Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/
Facebook Hastags: (Search these Hastags on Facebook)
#ChaitanyaVijnanam #PrasadBhardwaj
WhatsApp: . AMRUTASYA PUTRAAHA
https://chat.whatsapp.com/HrBxBAaKb0g73IXeMhwXmx
Whatsapp Group: గాయత్రి శక్తి Gāyatri Śakti
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin
Telegram group : . చైతన్య విజ్ఞానం – Chaitanya Vijnanam
https://t.me/ChaitanyaVijnanam
Telegram group: విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama.
Exclusively for శ్రీ మాహా విష్ణువు సంబంధిత జ్ఞానం కోసం.
https://t.me/vishnusahasra
Telegram group: ్రీ దత్తాత్రేయ చైతన్యం – Sri Datta Chaitanya
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA
Telegram group: శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam
https://t.me/srilalithadevi
Telegram: శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam
https://t.me/SriMataChaitanyam
Telegram channel : . చైతన్య విజ్ఞానం – Chaitanya Vijnanam
https://t.me/Spiritual_Wisdom
Telegram Channel: Seeds Of Consciousness
This channel is dedicated to Seeds of consciousness given by various masters.
https://t.me/Seeds_Of_Consciousness
Blogs/Websites:
www.incarnation14.wordpress.com
www.dailybhakthimessages.blogspot.com
No comments:
Post a Comment