విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 138, 139 / Vishnu Sahasranama Contemplation - 138, 139



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 138, 139 / Vishnu Sahasranama Contemplation - 138, 139 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻138. చతుర్వ్యూహః, चतुर्व्यूहः, Caturvyūhaḥ🌻

ఓం చతుర్వ్యూహాయ నమః | ॐ चतुर्व्यूहाय नमः | OM Caturvyūhāya namaḥ

వ్యూహాత్మానం చతుర్థా వై వాసుదేవాదిమూర్తిభిః ।

సృష్ట్యాదీన్ ప్రకరోతీతి చతుర్వ్యూహ ఇతీర్యతే ॥

వైష్ణవాగములలో అనిరుద్ధుడుగా జగత్సృష్టిని, ప్రద్యుమ్నుడుగా జగత్పాలనమును, సంకర్షణుడుగా జగత్సంహారమును, వాసుదేవుడుగా పై ముగ్గురి సృష్టి, స్థితి, సంహారములనొనర్చును. క్రమముగా ఇవి అనిరుద్ధ వ్యూహము, ప్రద్యుమ్న వ్యూహము, సంకర్షణ వ్యూహము, వాసుదేవ వ్యూహములని చెప్పబడుటచేత, విష్ణువు చతుర్వ్యూడని పిలువబడును.

పద్మపురాణములోని అశీత్యుత్తరశతతమోఽధ్యాయములో (180) శ్రీకృష్ణచరితమునందు మరియొక విధముగా చతుర్వ్యూహ వర్ణనము గలదు.

:: పద్మపురాణము - అశీత్యుత్తరశతతమోఽధ్యాయః, శ్రీకృష్ణచరితే, చతుర్వ్యూహవర్ణనము ::

చతుర్థా సంస్థితో బ్రహ్మా సగుణో నిర్గుణ స్తథా ।
ఏకా మూర్తిరనుద్దేశ్యా శుక్లాం పశ్యంతి తాం బుధాః ॥ 18 ॥

జ్వాలా మాలావనద్ధాంగీ నిష్టా సా యోగినాం పరా ।
దూరస్థా చాంతికస్థా చ విజ్ఞేయా సా గుణాతిగా ॥ 19 ॥

వాసుదేవాభిధానాఽసౌ నిర్మమత్వేన దృశ్యతే ।
రూపవర్ణాదయ స్తస్యా న భావాః కల్పనామయః ॥ 20 ॥

అస్తే చసా సదా శుధ్హా సుప్రతిష్ఠికరూపిణీ ।
ద్వితీయా పృథివీం మూర్థ్నా శేషాఖ్యాధారయత్యథః ॥ 21 ॥

తామసీసా సమాఖ్యాతా తిర్యక్త్వం సముపాగతా ।
తృతీయా కర్మ కురుతే ప్రజాపాలన తత్పరా ॥ 22 ॥

సత్త్వోద్రిక్తాతుసా జ్ఞేయా ధర్మసంస్థాన కరిణీ ।
చతుర్థీ జలమద్యస్థా శేతే పన్నగ తల్పగా ॥ 23 ॥

సర్వవ్యాపకమైన నారాయణ తత్త్వము నాలుగు విధములై యున్నది. ఒక మూర్తి శుక్లవర్ణము. అది జ్వాలా మాలామయము. దానిని యోగులు జ్ఞానులు మాత్రమే దర్శింతురు. అది దూరమందును, దగ్గరనుగూడ నుండునది.

అది గుణములకతీతమైనది. వాసుదేవనామమున ఉండునది. మమకారములేని స్థితిలోనే అది కనబడును. రూపము రంగు మొదలగు కల్పిత భావములు దానికి లేవు. కేవల శుద్ధస్వరూపము. మిక్కిలి నిలకడగలది. ఇక రెండవ వ్యూహము శేషుడను పేరిట భూమిని ధరించుచున్నది.

అది తమోగుణమూర్తి. తిర్యక్భావమును పొందినది. అనగా పశుత్వమును పొందినదని అర్థము. మూడవ వ్యూహము సత్వప్రధానమూర్తి. ధర్మ సంస్థాపనమొనరించి ప్రజారక్షణ నిమిత్తమై కర్మను స్థితిరూపమును జేయునది. నాలుగవ వ్యూహము శేషతల్పమున సముద్రమధ్యమందుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 138 🌹

📚. Prasad Bharadwaj


🌻138. Caturvyūhaḥ 🌻

OM Caturvyūhāya namaḥ

Vyūhātmānaṃ caturthā vai vāsudevādimūrtibhiḥ,

Sr̥ṣṭyādīn prakarotīti caturvyūha itīryate.

व्यूहात्मानं चतुर्था वै वासुदेवादिमूर्तिभिः ।

सृष्ट्यादीन् प्रकरोतीति चतुर्व्यूह इतीर्यते ॥

As per the Vaiṣṇava Āgamās, He creates the worlds in the form of Aniruddha. As Pradyumna, He sustains the worlds. As Sankarṣaṇa, He annihilates the worlds and as Vāsudeva, He oversees these three aspects of creation, sustenance and dissolution. In the order these are reckoned as Aniruddha vyūha, Pradyumna vyūha, Sankarṣaṇa vyūha and Vāsudeva vyūha. Hence He is called Caturvyūhaḥ.

In the 180th chapter of Padma purāṇa, we can see another depiction of the same.

Padma purāṇa - Chapter 180, Story of Śrī Kr̥ṣṇa, Caturvyūha narration

Caturthā saṃsthito brahmā saguṇo nirguṇa stathā,
Ekā mūrtiranuddeśyā śuklāṃ paśyaṃti tāṃ budhāḥ. (18)

Jvālā mālāvanaddhāṃgī niṣṭā sā yogināṃ parā,
Dūrasthā cāṃtikasthā ca vijñeyā sā guṇātigā. (19)

Vāsudevābhidhānā’sau nirmamatvena dr̥śyate,
Rūpavarṇādaya stasyā na bhāvāḥ kalpanāmayaḥ. (20)

Aste casā sadā śudhhā supratiṣṭhikarūpiṇī,
Dvitīyā pr̥thivīṃ mūrthnā śeṣākhyādhārayatyathaḥ. (21)

Tāmasīsā samākhyātā tiryaktvaṃ samupāgatā,
Tr̥tīyā karma kurute prajāpālana tatparā. (22)

Sattvodriktātusā jñeyā dharmasaṃsthāna kariṇī,
Caturthī jalamadyasthā śete pannaga talpagā. (23)

Continues..
🌹 🌹 🌹 🌹 🌹


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 139 / Vishnu Sahasranama Contemplation - 139 🌹

📚. ప్రసాద్ భరద్వాజ


🌻139. చతుర్దంష్ట్రః, चतुर्दंष्ट्रः, Caturdaṃṣṭraḥ🌻

ఓం చతుర్దంష్ట్రాయ నమః | ॐ चतुर्दंष्ट्राय नमः | OM Caturdaṃṣṭrāya namaḥ

చతుర్దంష్ట్రః, चतुर्दंष्ट्रः, Caturdaṃṣṭraḥదంష్ట్రాశ్చతస్రో యస్య స చతుర్దంష్ట్రో నృకేసరీ ।

దంష్ట్రాశబ్దేన శృంగాణి సాదృశ్యాత్కథితాని వా ॥

నాలుగు కోరలు గల నృసింహావతారి; లేదా శృంగము (కొమ్ము) కోరవలెనే యుండును కావున దంష్ట్రా శబ్దమునకు కొమ్ము అనియూ అర్థము చెప్పికొనవచ్చును. కాబట్టి నాలుగు కొమ్ములు గల వరాహావతారి అయిన విష్ణువు కూడా చతుర్దంష్ట్రః అని పిలువబడును.

'చత్వారి శృంగా' (ఋగ్వేదము 4.58.3) 'నాలుగు కొమ్ములుకలవాడు' ఇత్యాదిగా ఋగ్వేదమున చెప్పబడిన అగ్నిమూర్తి, నృసింహావతారి, వరాహావతారి - శ్రీమహావిష్ణువు విభూతులే అని చెప్పవలయును.

:: భగవద్గీత - విశ్వరూపసందర్శనయోగము ::

దంష్ట్రాకరాలాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని ।
దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస ॥ 25 ॥

కోరలచే భయంకరములైనవియు, ప్రళయాగ్నినిబోలినవియునగు మీ ముఖములను జూచి నేను దిగ్భ్రమజెందియున్నాను. సుఖమునుగూడ పొందకయేయున్నాను. కావున ఓ దేవదేవా! జగదాశ్రయా! ప్రసన్నులుకండు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 139🌹

📚. Prasad Bharadwaj


🌻139. Caturdaṃṣṭraḥ🌻

OM Caturdaṃṣṭrāya namaḥ

Daṃṣṭrāścatasro yasya sa caturdaṃṣṭro nr̥kesarī,
Daṃṣṭrāśabdena śr̥ṃgāṇi sādr̥śyātkathitāni vā.

दंष्ट्राश्चतस्रो यस्य स चतुर्दंष्ट्रो नृकेसरी ।
दंष्ट्राशब्देन शृंगाणि सादृश्यात्कथितानि वा ॥

He who has four protruding teeth in the incarnation of Nr̥siṃha. Or since Śr̥ṃgas i.e., horns too resemble teeth, Caturdaṃṣṭraḥ can also be considered as the Varāha incarnation of Lord Viṣṇu. Vide the Śr̥ti, Catvāri śr̥ṃgā / चत्वारि शृंगा (R̥gveda 4.58.3) 'the One with four horns' the blazing form, Nr̥siṃha and Varāha - all these are different forms of Viṣṇu.

Bhagavad Gītā - Chapter 11

Daṃṣṭrākarālāni ca te mukhāni dr̥ṣṭvaiva kālānala sannibhāni,

Diśo na jāne na labhe ca śarma prasīda deveśa jagannivāsa. (25)

:: श्रीमद्भगवद्गीता - विश्वरूपसंदर्शनयोग ::

दंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्वैव कालानल सन्निभानि ।

दिशो न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवास ॥ २५ ॥

Having merely seen Your mouths made terrible with their teeth and resembling the fire of dissolution, I have lost the sense of direction and find no comfort. Be gracious, O Lord of gods, O abode of the universe.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

लोकाध्यक्षस्सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः ।
चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः ॥ १५ ॥

లోకాధ్యక్షస్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః ।
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ॥ ౧౫ ॥

Lokādhyakṣassurādhyakṣo dharmādhyakṣaḥ kr̥tākr̥taḥ ।
Caturātmā caturvyūhaścaturdaṃṣṭraścaturbhujaḥ ॥ 15 ॥


Continues....
🌹 🌹 🌹 🌹 🌹


30 Nov 2020

No comments:

Post a Comment