✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 15 🌻
🍀. మిధ్యా జీవితము ఎందుకు తప్పక నశించును ? 🍀
462. మానవుని సావధిక పరిమిత స్వభావ త్రయమైన స్థూల - సూక్ష్మ - కారణ దేహములు, భగవంతుని అనంత స్వభావత్రయమైన ఆనంతానంద, శక్తి, జ్ఞానములతో 'లంకెపడి యున్నప్పటికీ, అవి శూన్యము యొక్క ఫలితములుగా సృష్టిలో పరిమిత స్వభావములుగా వ్యక్తమైనందునను, మిథ్యా జీవితమునకు సంబంధించి యుండుట వల్లను మిధ్యాజీవితము నశించు చున్నది.
A. భగవంతుని అనంతమైన శక్తి అపారమైనది. ఎన్నడూ తరుగనిది, నశించనిది.
మానవుని పరిమిత ప్రాణము అనంత శక్తితో లంకెపడి యున్నను, తరిగి పోవుచున్నది, ఖర్చగుచున్నది. ఎందుచేతననగా, అది శూన్యము యొక్క ఫలితముగా సృష్టిలో పరిమిత ప్రాణ శక్తిగా వ్యక్తము అయినది.
B. అనంత జ్ఞానము శాశ్వతమైనది , ఒకే విధముగా నుండి సర్వ వ్యాపమై యున్నది. కనుక నిరంతరాయముగా సాగి పోవునది. ఏమైనను, పరిమిత మనస్సు అనంత జ్ఞానముతో లంకేపడి యున్ననూ, నాశనమగుచున్నది. చివరకు అదృశ్యమగుచున్నది. ఎందుచేతననగా
శూన్యము యొక్క ఫలితముగా సృష్టిలో మనస్సుగా వ్యక్తమైనది.
C. అనంతానందము - శాశ్వతానందము నిరవధికమైనది, శాశ్వతమైనది. కాబట్టి అది ఏ విరుద్ధ లక్షణమును లేక యున్నది. . ఇంద్రియ భోగము అనంతానందముతో లంకెపడి యున్నప్పటికి, అస్థిరమైనది కాబట్టి ఆది కష్టమనెడు భిన్న లక్షణమును కలియున్నది. ఇది మానవ జీవితమునకు ఆధారమైనప్పటికి, ఇంద్రియ భోగము అదృశ్యమగుచున్నది. ఎందుచేతననగా జీవితమే క్షణభంగురమైనది కాబట్టి.
అభావ ఫలితముగా ఈ మిథ్యా జీవితము ఆభాస జీవితముగా వ్యక్తమైనది. అందుచేత ఈ జీవితము తప్పక నశించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
30 Nov 2020
No comments:
Post a Comment