🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భరద్వాజ మహర్షి - 2 🌻
07. మరుద్గణాలు తమ దగ్గర పెరుగుతున్న బృహస్పతి కొడుకు అయిన ద్వాజుడిని పెంచుకోమని భరతుడికి ఇచ్చారు. ‘భరతు’డి చేత స్వీకరించబడటంచేత ‘భరద్వాజుడు’ అని పేర్లు పొందాడు.
08. గంగానదీ తీరానికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు భరద్వాజమహర్షి. ఆయన గంగాస్నానం చేస్తున్న సమయంలో ఘృతాచి అనే అప్సరసను చూచి మోహించాడు. ఆ కారణం చేత ఆయనకు శుక్రపాతము కలిగింది. ఆ శుక్రాన్ని ఆయన దోసిట్లోకి తీసుకున్నాడు. దానిని ద్రోణం అని అంటాం. ఆ ద్రోణిలో ఉన్న శుక్రాన్ని తన పుత్రుడిగా ఆయన మార్చాడు. ఆ దోసిట్లో పుట్టటంచేత ద్రోణుడు అని అతడికి పేరొచ్చింది. అతడే ద్రోణాచార్యుడు.
09. దేవత అంటే కొన్ని మంత్రాల యొక్క సంపుటియే! దేవతారూపంలో వ్యక్తి అంటూ ఎవరూ లేరు. కొన్ని అక్షరములకూర్పుకే మంత్రం అని పేరు. అంటే, 56 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆయా ప్రత్యేక లక్షణాలను బట్టి సంపుటీకరణము చేస్తే, ఆ సంపుటి యోగ్యమయిన ఒక రూపము, శక్తి అందులో ఉంటుంది. దానికి యోగ్యమయినటువంటి స్తోత్రాదికం ఇవ్వవచ్చు. ఆ దేవతకు ఒక రూపకల్పన చేసి విగ్రహం పెట్టవచ్చు. ఆరాధనచేసి ఫలం వస్తుందని అతడు చెప్పవచ్చు. ఆ అక్షరాల సంపుటికే ‘మంత్ర’మని పేరు.
10. ఋషులు మంత్రద్రష్టలు. దేవతలు మంత్రపూజ్యులు. వేదమంత్రములు సనాతనంగా ఉండేటటువంటివి. ఆ స్వరూపములు, వర్ణములు అపౌరుషేయములు. వాటిని సంపుటికరించి, అలా దర్శించినవారు మన మహర్షులు. అలా కొన్ని మంత్రములు ఏర్పడటానికి భర్ద్వాజుడే కారణం అని చెప్తారు.
11. ప్రజారంజకుడు, మహారధుడు, మహారాజు అయిన శత్రుంజయుడు భరద్వాజమహర్షిని తనకు రాజధర్మమును తెలియజేయమని కోరాడు. అప్పుడు భరద్వాజుడు “రాజా! రాజు దండవిధానంలో చాలా జాగురూకులై ఉండాలి. దండన విధానంచేత శత్రుపక్షమనే వృక్షాన్ని మూలఛ్ఛేదం చెయ్యాలి.
12. శత్రువిషయంలో దయా దాక్షిణ్యాలు లేకుండా ఉండాలి. చాలా మధురమైన మాటలతో, సంపూర్ణమయిన గౌరవమర్యాదలతో సభలో మాట్లాడుతూనే ఉండాలి. శత్రువని తెలిసినప్పటికీ, బయటకుమాత్రం కుటుంబక్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటూ ఉండాలి.
13. అందుకని శత్రువుల విషయం వస్తే కోయిలవలె మధురంగా మాట్లాడమన్నారు. హృదయంలో వజ్రకాఠిన్యం ఉండాలి. ఎప్పుడూ జాగురూకులై జాగ్రత్తగా ఉండాలి. తన వాళ్ళల్లో, తన బలంలో శత్రుపక్షంవాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏం తింటున్నరో ఏం మాట్లాడుకుంటూ ఉన్నారో తెలుసుకుంటూ ఉండాలి. అదీ రాజ ధర్మం.
14. వాళ్ళని శిక్షించ వలసి వచ్చినప్పుడు సగం శిక్షించి, వాడు శరణు అంటే దయతో వదిలిపెట్టటం నాస్తికలక్షణం అనబడుతుంది. అది ఆర్య ధర్మంకాదు. కోయిలవలే మాట్లాడుతూ, శత్రువులను శిక్షించవలసి వచ్చినప్పుడు మాత్రం వరాహమూర్తి వలే ఉండాలి. ఆదివరాహం వలె.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
30 Nov 2020
No comments:
Post a Comment