శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 200 / Sri Lalitha Chaitanya Vijnanam - 200

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 200 / Sri Lalitha Chaitanya Vijnanam - 200 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :
సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |
సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ ‖ 52 ‖

*🌻 200. 'సర్వ మంగళా' 🌻*

సర్వ శుభ స్వరూపిణి శ్రీమాత అని అర్థము. 

శ్రీమాత రూపమే మంగళ ప్రదము. శుభప్రదము. ఆమె గుణ విశేషములను భక్తితో హృదయమున కీర్తించువారికి సర్వ శుభములను కలుగజేయును. భక్తి శ్రద్ధలతో మంగళకరమగు ఆమె సహస్ర నామములను నిత్యము పఠించువారు, శ్రేష్ఠమైన సకల శుభములను, ఆమె అనుగ్రహమును పొందుదురు. పరమ పథమును కూడ పొందుదురు. 

జీవితమును మంగళప్రదము గావించు కొనుటకు, శ్రీమాత సాన్నిధ్యమును అనుభవించుట కొఱకు ఈ క్రింది సూచనలు ఉపయోగకరములు. 

1. శ్రీమాత ఆరాధనము.

2. తీరిక సమయములో అంతరంగమున నామస్మరణము.

3. సముచిత సంభాషణము. ఇతర సంభాషణములను విసర్జించుట. ఇతరులు అనుచిత సంభాషణ గావించునపుడు, మౌనము వహించి నామస్మరణము చేసికొనుట.

4. మంగళప్రదమగు రూప ధ్యానము హృదయమున గావించి కరించుట,

5. అశుభ ప్రదేశములకు చనినపుడు, గృహమున చేరి స్నాన మాచరించుట.

6. అశుభ విషయములందు పాల్గొనకుండుట.

7. మంగళ ప్రదమగు వస్తువుల నెపుడూ దైనందినముగా వాడుచుండుట. అవి వరుసగా గంధము, పసుపు, కుంకుమ, అక్షతలు, కస్తూరి, కర్పూరము, సాంబ్రాణి, సువాసన లిచ్చు పుష్పములు యిత్యాదులు.

8. సుశబ్దములు, భూషణములతోపాటు, 'సు' వర్ణములనే వినియోగించుట. ఎఱుపు, సిందూరము, గులాబీ రంగు, పసుపు, తేనె వర్ణము, నీలము, లేత నీలము, లేతాకు పచ్చ, తెలుపు ఇవి 'సు' వర్ణములు. మట్టి రంగు, బూడిద రంగు, నలుపు నీలము, నలుపు రంగు వర్షనీయములు. 

9. సూర్యకాంతి, చంద్రకాంతి దేహమునకు సోకునట్లు చూచుకొనుట. ఉదయ, సాయం సంధ్యల యందు ఇంటియందు నూనె లేక నేతి దీపము లేర్పాటు చేసికొనుట. గృహము నందు చీకటి గదులుండరాదు. ఏ మూలను కీటకములు, బూజు, దుమ్ము చేరకుండా శుభ్రపరచుకొనుట.

10. దేహమునుండు ఏర్పడు మలినములను విసర్జించుటయందు శ్రద్ధ కలిగి యుండుట. నోటియందు, శరీరమందు దుర్వాసన లేకుండునట్లు శుభ్రపరచుకొనుట. అవసర మగుచో పలుమార్లు దంతధావనము, స్నానము ఆచరించుట, కాలి చేతి వ్రేళ్ళ గోళ్ళ నెప్పటికప్పుడు నిర్మూలించుకొనుట, శిరోజములను సంస్కరించుకొనుట. ఎట్టి పరిస్థితియందు జుట్టు విరబోసుకొని తిరుగరాదు. 

పైవిధముగ మన సంప్రదాయమున మంగళ ఆచారములు కోకొల్లలుగా సుస్నవి. వీనియందు శ్రద్ధ ప్రాథమికముగా నున్నచో, అది దైవమునందు శ్రద్ధగా పరిణతి చెందును. ప్రాతః సమయమున లేచుట, స్నానమాచరించుట, ముగ్గులు పెట్టుకొనుట అత్యాదివి కూడ ఇందులో భాగములే. తామస అహంకారము కలవారు వీనిని నిర్లక్ష్యము చేయుదురు. 

జీవితము మంగళ ప్రదము కావలెనన్నచో, అన్నమయ, ప్రాణమయ, మనోమయ లోకములలోను, తమ పరిసరములలోను శుచి, శుభ్రత పాటింప వలెను. అపుడే మంగళ ప్రదమగు శ్రీమాత అనుగ్రహించును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 200 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

🌻Sarva-maṅgalā सर्व-मङ्गला (200) 🌻

She is the embodiment of all auspiciousness. She is addressed as Śrī Śiva in nāma 998. Śiva means auspiciousness. Since She is the source of auspiciousness, She is capable of giving the desired auspiciousness to Her devotees.  

The same nāma is there in ‘Lalitā Triśatī’ as nāma 124. There is a famous verse ‘sarvamṅagala māngalye śive sarvartha sādhike| śaraṇaye triyambake gouri nārayaṇi namostu te|| . (Durga saptasati 11.10, Markandeya Purāṇa Chapter 88, verse 9). 

The meaning for this famous verse is “Oh! Nārāyanī! The cause of creation, sustenance and dissolution; ever existing; the source of all virtues; thy form itself is made up of these virtues (excellent qualities); I worship you.”

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


05 Feb 2021

No comments:

Post a Comment