5-FEB-2021 EVENING

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 141🌹  
11) 🌹. శివ మహా పురాణము - 341🌹 
12) 🌹 Light On The Path - 94🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 226🌹 
14) 🌹 Seeds Of Consciousness - 290🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 165🌹
16) 🌹. శ్రీమద్భగవద్గీత - 20 / Bhagavad-Gita - 20 🌹 
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 21 / Lalitha Sahasra Namavali - 21🌹 
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 21 / Sri Vishnu Sahasranama - 21 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -141 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 26

*🍀 24. ఆత్మ నెరిగిన వారు - బ్రహ్మ నిర్వాణమును పొందినవారు విదితాత్మలై వర్తింతురు. వారు యత చేతస్సులు. యతులు. కామక్రోధముల నుండి విడి వడినవారు. బ్రహ్మ నిర్వాణమనగ బ్రహ్మమునందు కరగిన అహంకార స్థితి. అహంకారమునకు మూలమైన తత్త్వమే బ్రహ్మతత్వము. అది త్రిగుణములకు లోబడినపుడు ప్రత్యేగాత్మయై తానొకడ నున్నాడని భావన చెందును. తత్వమే తానుగ నున్నాడని తెలియుట, తత్వము నుపాసించుట, తాను కరిగి తత్త్వము మిగులుట జరిగినచో అది బ్రహ్మ నిర్వాణ మగును. బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందినవారి బుద్ధి నుండి, మనసు నుండి, యింద్రియముల నుండి, వాక్కు నుండి, చేతల నుండి బ్రహ్మ తత్త్వమే ప్రకాశించును. అట్టివారిని యతులు అందురు. యతీంద్రు లందరు. 🍀*

కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్ ।
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్ ।। 26 ।।

బ్రహ్మ నిర్వాణమును పొందినవారు విదితాత్మలై వర్తింతురు. వారు యత చేతస్సులు. యతులు. కామక్రోధముల నుండి విడి వడినవారు. బ్రహ్మ నిర్వాణమనగ బ్రహ్మమునందు కరగిన అహంకార స్థితి. మంచుగడ్డ నీటియందు తేలుచున్నపుడు అది వేరుగ గోచరించును. నీటికన్న విలక్షణమైన లక్షణములు కలిగి యుండును. ఎవరి ముఖమున నైనను నీరు చల్లినచో చల్లగ యుండును గాని, బాధింపదు. 

మంచుగడ్డతో కొట్టినచో బాధ కలుగును. అహంకార స్థితి మంచుగడ్డవంటి స్థితి. నీటి స్థితి బ్రహ్మము లేక ఆత్మ స్థితి. అహంకారమునకు మూలమైన తత్త్వమే బ్రహ్మతత్వము. అది త్రిగుణములకు లోబడినపుడు ప్రత్యేగాత్మయై తానొకడ నున్నాడని భావన చెందును. 

నిజమునకు తన రూపమున నున్నది పరతత్వమే. బ్రహ్మతత్వమే. ఆ తత్త్వమే తానుగ నున్నాడు. తత్వమే తానుగ నున్నాడని తెలియుట, తత్వము నుపాసించుట, తాను కరిగి తత్త్వము మిగులుట జరిగినచో అది బ్రహ్మ నిర్వాణ మగును. బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందినవారి బుద్ధి నుండి, మనసు నుండి, యింద్రియముల నుండి, వాక్కు నుండి, చేతల నుండి బ్రహ్మ తత్త్వమే ప్రకాశించును. 

అనగ బ్రహ్మమే అన్ని పొరల నుండి విదితమగు చుండును. వారి మాట, చేత, నడవడికల నుండి బ్రహ్మమే ప్రకాశించు చుండును. ఇట్టి వారిని విదితాత్ము లందురు.

విదితాత్ము లనగ ఆత్మ నెరిగిన వారని అర్థము. ఆత్మ తత్త్వమే సర్వత్ర విదితము గావించువారని మరియొక అర్థము. ఇట్టివారి వర్తనమున చూపరులకు ఆత్మ తత్త్వము విదితమగు చుండును. ఇదియంతయు 17వ శ్లోకమున చెప్పబడిన రీతిగ, బ్రహ్మ పరాయణులై యుండుట వలన ఏర్పడు స్థితి. 

ఎవరి బుద్ధి, మనసు, యింద్రియములు, వాక్కు, చేష్టల నుండి ఆత్మ తత్త్వము విదిత మగుచుండునో అట్టివాని చేతన యమింపబడి యుండును. అనగా చైతన్య స్వరూపిణియగు శ్రీమాత తన మాయను ప్రసరింపజేయక, అనుకూలవతియై 
యుండును. చేతన తత్వమునకు అనుకూలముగ నుండుటవలన సర్వము యమింపబడినవారై యుందురు. అట్టివారిని యతులు అందురు. యతీంద్రు లందరు.

నిరంతరము తత్వమునే ప్రకాశింప జేయుదురు. అట్టివారిని కామ క్రోధములు దరిచేరలేవు. స్పృశించ నైన స్పృశించలేవు. వారు కామక్రోధ వియుక్తులు అని తెలుపుట అతిశయోక్తి కానేరదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 342 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
86. అధ్యాయము - 41

*🌻. దేవతలు శివుని స్తుతించుట -3 🌻*

శ్రేష్ఠమగు వాటన్నింటి కంటె శ్రేష్ఠుడు, తనకంటె పరము లేనివాడు, సర్వవ్యాపి, వశ్వమూర్తి, పరమేశ్వరుడు అగు నీకు నమస్కారము (39). విష్ణువు యొక్క అంశ పత్నిగా గలవాడు, విష్ణువు క్షేత్రముగా గల క్షేత్రజ్ఞుడు, సూర్య రూపుడు, భైరవుడు, శరణాగతి చేయదగినవాడు, లీలావిహారి అగు ముక్కంటి దేవునకు నమస్కారము (40).

శోక స్వరూపుడు, సత్త్వరజస్తమో గుణస్వరూపుడు, చంద్ర సూర్యాగ్నులు కన్నులుగా గలవాడు, సర్వమునకు కారణమగు ధర్మము తన రూపముగా గలవాడు అగు మృత్యుంజయునకు నమస్కారము (41). నీవు నీ తేజస్సుచే జగత్తునంతనూ వ్యాపించి యున్నావు. నీవు వికారములు లేని, చిదానంద స్వరూపమగు, ప్రకాశస్వరూపమగు పరబ్రహ్మవు (42). 

ఓ మహేశ్వరా ! బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, చంద్రుడు మొదలుగా గల దేవతలు, మునులు, ఇతరులు నీనుండి పుట్టినారు (43). నీవు శరీరమును ఎనిమిది భాగములుగా విభజించి సర్వజగత్తును ధరించియున్న అష్టమూర్తివి. ఈశ్వరుడవు. నీవు ఆద్యుడవు. కరుణామూర్తివి (44).

నీభయముచే ఈ గాలి వీచుచున్నది. నీ భయముచే అగ్ని దహించుచున్నది. నీ భయముచే సూర్యుడు తపించుచున్నాడు. మృత్యువు అంతటా పరువులెత్తుచున్నది (45). ఓ దయాసముద్రా! మహేశ్వరా !పరమేశ్వరా! ప్రసన్నుడవు కమ్ము. ముర్ఖులైన భ్రష్టులైన మమ్ములను సదా రక్షింపుము (46). 

హే నాథా! కరుణానిధీ! నీవు మమ్ములను ఎల్లవేళలా ఆపదలన్నింటి నుండియూ రక్షించినావు. హే శంభో! ఈనాడు కూడా అదే తీరున మమ్ములను పూర్తిగా రక్షించుము (47). హే నాథా! నీవు శీఘ్రమే మమ్ములను అనుగ్రహించి సమాప్తము కాని యజ్ఞమును ఉద్ధిరించుము. హే దుర్గేశా! దక్షప్రజాపతిని కూడ అనుగ్రహించుము (48).

భగునకు నేత్రములను లభించుగాక! యజమానుడగు దక్షుడు జీవుంచుగాక! పూషకు దంతములు మొలకెత్తుగాక! భృగువునకు పూర్వము వలెనే గెడ్డము, మీసములు వచ్చుగాక! (49) ఓ శంకరా! నీ ఆయుధములచే, రాళ్ళచే విరుగగొట్టబడిన ఆ వయవములు గల దేవతలు మొదలగు వారందరికీ నీ అనుగ్రహముచే ఆరోగ్యము అన్ని విధములా సమకూరుగాక !(50). 

హే నాథా! మిగిలిన యజ్ఞ కర్మలో నీకు పూర్ణభాగము లభించుగాక! రుద్రునకు భాగము గల యజ్ఞమే పరిపూర్ణము అగును. అట్లు కాని యజ్ఞము ఎన్నటికీ పరిపూర్ణము కాదు (51). ఇట్లు పలికి ఆ బ్రహ్మ, విష్ణువు చేతులొగ్గి భూమిపై దండమువలె పడి నమస్కరించి క్షమార్పణలను చెప్పుకొనిరి (52).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్రసంహితయందు రెండవదియగు సతీ ఖండములో దేవస్తుతి వర్ణనమనే నలభై ఒకటవ అధ్యాయము ముగిసినది (41).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 94 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 7 - THE 14th RULE
*🌻 14. Desire peace fervently. The peace you shall desire is that sacred peace which nothing can disturb. - 4 🌻*

362. The things which affect the higher progress are all exceedingly delicate – so carefully, so exactly balanced, that the least touch in the wrong direction will throw them back for weeks and months. It is possible to throw back the growth of months in a single day. 

Therefore very much depends upon surroundings. One cannot always calculate upon obtaining again the same surroundings, so the occultist always strives to make the utmost use of whatever conditions he has at any time, while he is also watchful that none of them shall drag him down. One of the Puranas says:

363. Without a body no one attains the object of the soul; therefore should one take care of his body as a treasure, and perform good deeds. A village or a field or possessions or a house, or good and bad pieces of karma may be obtained again – but this body never again.1 1 Garuda Purana Saroddhara, xvi, 17, 18.

364. People sometimes say: I cannot do much in this life; I shall try what I can do in the next.” It is always well to keep before us the idea of the next life and what we can do in it, but it is not safe to depend too much on that, because the karma behind each person is sure to be more or less mixed and it sometimes asserts itself in waves. We may have karma at a certain time which will give us good surroundings. It does not follow that in the next life we shall have conditions equally good. 

On the whole the probabilities are that our karma will flow on in much the same groove, but on the other hand there might be a block of unpleasant karma which the karmic authorities do not think the man strong enough to bear this time, and in the next life they might let that loose upon him, so that he might not get such good opportunities.

365. It is eminently wise to take all the opportunities available in this life. If we do that, and thus show the Lords of Karma that we are taking advantage of them, that will seriously influence the incidence of karma upon us in the next life. 

It will constitute a sort of claim for good surroundings. It is not wise because we have many opportunities in this life, to assume that we shall have them again in our next life. We may or we may not. I do not like to hear people say: “I am too old to do anything in this life.” 

If we make good use of what we have, and advance ourselves as far as possible, we create a condition of affairs in which it would be difficult for the karmic deities not to give us opportunities again; we can make such karma along a particular line that we may take the kingdom of heaven by storm – we can force the Lords of Karma to so arrange our karma that the opportunity must come because the causes we have set in motion cannot work themselves out except along a similar line. 

Most assuredly it is well to make full use of every good opportunity that comes to us, lest by chance by neglecting it we might make a difference of a few thousand years in our evolution. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 226 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. మైత్రేయమహర్షి - 3 🌻*

14. కర్మస్వరూపమేది? కర్మఫలస్వరూపమేది? అనేవి ముఖ్యప్రశ్నలు. మామూలుగా నిష్కాముడివై కర్మచెయ్యమని అంటాం. కాని కామ్యకర్మ అని అంటున్నాం అలా ఎందుకు అంటున్నామంటే, ‘నా ఇంట్లో ఉన్న భార్యాబిడ్డలకు, నాకు ధనం కోసమని అడగటంలేదు’ కాబట్టి, దానిని నిష్కామకర్మ అంటున్నాం. 

15. కానీ నిజంగా కామ్యకర్మ కాకపోవటమేమిటి కరమ? జ్ఞానకర్మా అది? మోక్షంకోసమని చేస్తున్నామా! జ్ఞానం అర్థిస్తున్నామా! లోకక్షేమంకోసం చేసేదికూడా కామ్యకర్మే. ఏదయినా కామ్యకర్మే అవుతోంది! 

16. వ్యక్తిగతమయిన స్వార్థం లేకపోవటం మాత్రం చేత నిష్కామకర్మ కాదది. అందుచేత లోకక్షేమంకోసం చేసేటటువంటి కర్మ(కృష్ణుడు చేసినటువంటి కర్మ)కూడా కర్మే కదా! కామ్యకర్మే అవుతొందికదా! మరి దాని ఫలమతడు ఎందుకు అనుభవించడు? ఏమయిందా కర్మ? అని ప్రశ్న.

17. కృష్ణపరమాత్మను ఆదర్శంగా తీసుకుని ఎవరయితే అతడి తత్త్వాన్ని గ్రహించి కర్మచేస్తాడో, అంటే అతడిని ఆదర్శంగా తీసుకుని ఆయననే భావనలో పెట్టుకుని చేసేటట్లయితే; అది అతడికి ఫలరహితం, అది లోకానికి ఫలప్రదం అవుతుంది. 

18. లోకక్షేమం కోసమని కూడా, ఇతరులు-సామాన్యులు-చేసేకర్మ వాళ్ళను బంధిస్తుంది. కానీ లోకక్షేమంకోసం చేసే కర్మ-లోకానికి మాత్రమే ఫలాన్నిచ్చి, కర్తకు ఫలం ఇవ్వకుండా ఉండాలంటే; కృష్ణతత్త్వంలోనే ఆ రహస్యం ఉంది. ఆ సత్యమే మైత్రేయమహర్షికి ఆయన బోధచేసాడు.

19. తనలో ఉన్న నేవెవరు? “నేను అంతస్సాక్షిగా ఉండే, పరమాత్మ స్వరూపుడైనటువంటి విశ్వుడను ‘నేను’. ఈ దేహిని కాను. ఈ దేహంలో ఉండే, ఈ గోత్రనామములు కలిగిన మనుష్యుడుచేసే కర్మ ఉన్నదే, దీని(ఈ కామ్యకర్మయొక్క) ఫలమేదైతే ఉందో, అది లోకానికే సంక్రమించాలి. 

20. ఇక్కడ కర్తలేడు సుమా! ఈ నశ్వరమైన దేహంలో, నశించిపోయే నామరూపాలు కలిగిన ఈ మనుష్యుడు చేసేకర్మ, నశ్వరమైనటువంటి దేహికి చెందకూడదు. నేను నిత్యుణ్ణి కాబట్టి అది నాకంటదు. ఈ కర్మ ఫలంలోకానికే ముడుతుంది” అని సంకల్పంచెయ్యాలి. అదే కృష్ణుడి ఉద్దేశ్యం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 290 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 139. 'Turiya' or 'I am' is within consciousness, which is the product of five elements. 🌻*

Being beyond the 'Turiya', the Guru knows it very well and says that the 'Turiya' or the 'I am' is the birth principle and is within the consciousness. And, what is this consciousness or the 'I am'? 

It is a product of the five elements that make up the body. It is the very essence of the five elements and the three qualities and keeps on 'humming' throughout your life.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 165 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 3 🌻*

639. అతడే మానవుడు అతడే భగవంతుడైన సద్గురువు సర్వ స్వతంత్రమైన సత్యమును సృష్టి (ప్రకృతి) లోనికి దింపి పరమాత్మ స్థితిలోనున్న C దివ్య కార్యాలయము నుండి సృష్టిని పాలించును.

640. సద్గురువు ఏకకాలమందే అఖిల విశ్వములలో, సమస్త లోకములలో, భూమికలన్నింటిలో, అన్ని స్థాయిలలో అందరి యొక్క అన్నింటి యొక్క జీవితములను గడుపుచుండును.

641. శివాత్మలలో బహు కొలదిమంది మిక్కిలి అరుదుగా ఏ ఒక్కరో మానవ రూపంలో భగవంతుని జీవితమును ఎరుకతో గడుపుచు సర్వోన్నత దివ్య అవస్థానమును అలంకరింతురు .

642. సత్యస్థితి యొక్క అనుభవములో బ్రహ్మీ బూతులకు, జీవన్ముక్తులుకు (పరమహంసలకు) సలీక్ లకు, సద్గురువులకు కించిత్తయిననూ భేదము లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 20 / Bhagavad-Gita - 20 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 
  
🌴. ప్రధమ అధ్యాయము🌴
శ్లోకము 20

20. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా 
ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ: |  
ప్రవృత్తే శస్త్రసమ్పాతే 
ధనురుద్యమ్య పాణ్డవ: | 

🌷. తాత్పర్యం : 
ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు నిలిచి, ధనుస్సును చేపట్టి బాణములను విసురుటకు సిద్ధపడెను. 

🌷. బాష్యము :  
యుద్ధము కొద్ది సమయములో ఆరంభము కానుండెను. యుద్ధరంగమున శ్రీకృష్ణభగవానుని ప్రత్యక్షోపదేశములతో నిర్దేశితులైన పాండవులచే ఏర్పాటు చేయబడిన అనూహ్యమైన సేనావ్యూహము ధృతరాష్ట్రతనయులను దాదాపు పూర్తిగా నిరుత్సాహపరచినదని పై వ్యాక్యము ద్వారా అవగతమగుచున్నది. 

హనుమానుని రూపముచే చిహ్నితమైన అర్జునుని ధ్వజము విజయమునకు మరొక సూచనయై యుండెను. ఏలయన, రామ, రావణుల నడుమ జరిగిన యుద్ధములో హనుమంతుడు రామునకు సహాయము చేయగా శ్రీరాముడు విజయము నొందెను. ఇప్పుడు రాముడు మరియు హనుమానులిరువురును అర్జునునికి సహాయము చేయుటకై అతని రథమున ఉండిరి. 

శ్రీకృష్ణభగవానుడు స్వయముగా శ్రీరాముడే. అంతియేగాక శ్రీరాముడు ఎచ్చట నుండునో అతని నిత్య సేవకుడైన హనుమానుడు మరియు నిత్యసతియైన సీతాదేవి(లక్ష్మీదేవి) అచ్చట నుందురు. కావున వాస్తవమునకు అర్జునుడు ఎట్టి శత్రువు నుండియు భయము నొందుటకు కారణము లేదు. అన్నింటికీ మించి హృషీకేశుడైన శ్రీకృష్ణుడు అతనికి మార్గదర్శనము చేయుటకు స్వయముగా ఉపస్తితుడై యుండెను. 

ఈ విధముగా యుద్ధము నిర్వహించుట యనెడి విషయమున చక్కని సహాయము అర్జునునకు లభ్యమై యుండెను. తన నిత్యభక్తుని కొరకు భగవానుడు ఏర్పరచిన అట్టి శుభకరమైన పరిస్థితులు నిశ్చయముగా విజ్యమునకు సూచనలు కావించుచున్నవి.

🌹 Bhagavad-Gita as It is - 20 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prapbhupada 
📚 Prasad Bharadwaj 

🌴 Chapter 1 🌴
Verse 20

20. atha vyavasthitān dṛṣṭvā dhārtarāṣṭrān kapi-dhvajaḥ
pravṛtte śastra-sampāte dhanur udyamya pāṇḍavaḥ

🌷 Translation :
At that time Arjuna, the son of Pāṇḍu, seated in the chariot bearing the flag marked with Hanumān, took up his bow and prepared to shoot his arrows. 

🌷 Purport : 
The battle was just about to begin. It is understood from the above statement that the sons of Dhṛtarāṣṭra were more or less disheartened by the unexpected arrangement of military force by the Pāṇḍavas, who were guided by the direct instructions of Lord Kṛṣṇa on the battlefield. 

The emblem of Hanumān on the flag of Arjuna is another sign of victory because Hanumān cooperated with Lord Rāma in the battle between Rāma and Rāvaṇa, and Lord Rāma emerged victorious. Now both Rāma and Hanumān were present on the chariot of Arjuna to help him. 

Lord Kṛṣṇa is Rāma Himself, and wherever Lord Rāma is, His eternal servitor Hanumān and His eternal consort Sītā, the goddess of fortune, are present. Therefore, Arjuna had no cause to fear any enemies whatsoever. And above all, the Lord of the senses, Lord Kṛṣṇa, was personally present to give him direction. 

Thus, all good counsel was available to Arjuna in the matter of executing the battle. In such auspicious conditions, arranged by the Lord for His eternal devotee, lay the signs of assured victory.
🌹🌹🌹🌹🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 21 / Sri Lalita Sahasranamavali - Meaning - 21 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀 21. సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణ భూషితా |*
*శివకామేశ్వరాంకస్థా, శివా, స్వాధీన వల్లభా ‖ 21 ‖ 🍀*

🍀49) సర్వారుణా - 
సర్వము అరుణ వర్ణంగా భాసించునది.

🍀 50) అనవద్యాంగీ - 
వంక పెట్టుటకు వీలులేని అవయవములు గలది.

🍀 51) సర్వాభరణ భూషితా -
 సమస్తమైన నగల చేత అలంకరించబడింది.

🍀 52) శివకామేశ్వరాంకస్థా -
 శివస్వరూపుడు కామ స్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందున్నది.

🍀 53) శివా - 
వ్యక్తమైన శివుని రూపము కలది.

🍀 54) స్వాధీన వల్లభా - 
తనకు లోబడిన భర్త గలది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 21 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 21. sarvāruṇā'navadyāṅgī sarvābharaṇa-bhūṣitā |*
*śiva-kāmeśvarāṅkasthā śivā svādhīna-vallabhā || 21 || 🌻*

🌻 49) Sarvaruna -   
She who has light reddish colour of the dawn in all her aspects. 

🌻 50) Anavadhyangi -  
 She who has most beautiful limbs which do not lack any aspect of beauty

🌻 51) Srvabharana Bhooshita -   
She who wears all the ornaments

🌻 52) Shivakameswarangastha -   
She who sits on the lap of Kameswara(shiva)

🌻 53) Shiva -   
She who is the personification of Shiva

🌻 54) Swadheena Vallabha -  
 She whose husband obeys her. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 21 / Sri Vishnu Sahasra Namavali - 21 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*ఆరుద్ర నక్షత్రం 1వ పాద శ్లోకం - నిత్యం 108 సార్లు*

* 🍀 21. మరీచి ర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః|*
*హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః 🍀*

🍀 189) మరీచిః - 
ఊహింపశక్యని దివ్యతేజోమూర్తి.

🍀 190) దమనః - 
తన దివ్యతేజస్సుచే సమస్తజీవుల తాపములను హరించువాడు.

🍀 191) హంసః - 
హంస వలే పాలను గ్రహించి నీటిని విడచిపెట్టి "సోహం" (అతడే నేను) అని తెలిపే దివ్యాత్మ, అన్ని శరీరములందు వసించే అంతర్యామి.

🍀 192) సుపర్ణః - 
జ్ఞానం, కర్మ అను రెండు రెక్కలతో (ఉపకరణములతో) జీవులను తరింపజేయువాడు.

🍀 193) భుజగోత్తమః - 
సర్పములలో (వ్యాపనము, చలనము కలిగినవాటిలో) ఉత్తముడు.

🍀 194) హిరణ్యనాభః - 
తన నాభినుండీ ఉత్పన్నమైన చతుర్ముఖ బ్రహ్మకు తండ్రి.

🍀 195) సుతపాః - 
నరనారాయణనిగా గొప్ప జ్ఞానతపస్సును ఆచరించినవాడు.

🍀 196) పద్మనాభః - 
బొడ్డులో తామరపూవు గలవాడు (సృష్టికి, జ్ఞానానికి సంకేతం).

🍀 197) ప్రజాపతిః - 
సకలజీవులకు ప్రభువు, సృష్టికి మూలకారకుడు. 

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 21 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Arudra 1st Padam*

* 🌻21. marīcirdamanō haṁsaḥ suparṇō bhujagōttamaḥ |*
*hiraṇyanābhaḥ sutapāḥ padmanābhaḥ prajāpati: || 21 || 🌻*

🌻 189) Marīciḥ: 
The supreme power and impressiveness seen in persons endowed with such qualities.
    
🌻 190) Damanaḥ: 
One who in the form of Yama inflicts punishments on those who tread the path of unrighteousness.
    
🌻 191) Haṁsaḥ: 
One who removes the fear of Samsara from those who practise the sense of identity with Him.
    
🌻 192) Suparṇaḥ: 
One who has two wings in the shape of Dharma and Adharma.
    
🌻 193) Bhujagottamaḥ: 
One who is the greatest among those who move on Bhujas or arms, that is, serpents. The great serpents like Ananta and Vasuki are the powers of Vishnu, so he has come to have this name.
    
🌻 194) Hiraṇyanābhaḥ: 
From whose golden navel arose the lord of creation Brahmā.
    
🌻 195) Sutapāḥ: 
One who performs rigorous austerities at Badarikashrama as Nara and Narayana.
   
🌻 196) Padmanābhaḥ: 
One whose navel is beautifully shaped like lotus.
    
🌻 197) Prajāpatiḥ: 
The father of all beings, who are His children.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


No comments:

Post a Comment