ధైర్యాన్నిచ్చేది ధ్యానమే! భయాలు - ధ్యాన పద్ధతులు

🌹. ధైర్యాన్నిచ్చేది ధ్యానమే!  భయాలు - ధ్యాన పద్ధతులు 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి  ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌,  📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శూన్య భయాన్ని పొగొట్టే ధ్యానం 🌻*

ప్రతిరాత్రి నిద్రపోయే ముందు ఇరవై నిముషాల పాటు కళ్లు మూకొని మీ శూన్యంలోకి ప్రవేశించండి. ఆ శూన్యాన్ని అంగీకరించండి. దానిని అక్కడే ఉండనివ్వండి. అపుడు మీలో భయం కలుగుతుంది. దానిని కూడా అక్కడే ఉండనివ్వండి. భయంతో వణకండి. అంతేకానీ, ఆవిర్భవిస్తున్న శూన్యాన్ని తిరస్కరించకండి. ఇలా చేస్తే రెండు, మూడు వారాలలో మీరు దాని సౌందర్యానుభూతిని పొందగలుగుతారు. 

ఒకసారి ఆ ఆశీర్వాదం మిమ్మల్ని తాకగానే భయం దానంతటదే అదృశ్యమవుతుంది. అంతేకానీ, మీరు దానితో పోరాడకూడదు.
హాయిగా నేలపై కూర్చుని గర్భాసనం వెయ్యండి. ఎలాంటి మంత్రాలు చదవకండి. ఎలాంటి కిటుకులను జోడించే ప్రయత్నం చెయ్యకుండా అలాగే ఉండండి.

ఆ ఆసనాన్ని చక్కగా అర్థం చేసుకోండి. ఇంతకు ముందెప్పుడూ మీరు అలా చెయ్యకపోవడం వల్ల మీ మనసుకు అంతా కొత్తగా భరించలేనంత గందర గోళంగా ఉంటుంది. అది దానిని వర్గీకరించి చీటీలు తగిలించాలని కోరుకుంటుంది. కాబట్టి గర్తుంచుకోండి.

తెలిసినది మనసు, తెలియనది దేవుడు. ఎపుడు తెలిసినా దానిలో భాగమవదు. అదే జరిగితే అది తెలియని దేవుడవడు. తెలియనిది ఎప్పటికీ తెలియ బడదు. ఒకవేళ మీరు దానిని తెలుసుకొన్నా అది తెలియనిదిగానే ఉండిపోతుంది. ఆ మర్మాన్ని ఎవరూ ఛేదించలేరు. ఎందుకంటే ఆ మర్మం అంతర్గతంగా పరిష్కరించలేని స్వభావాన్ని కలిగి ఉంటుంది.

కాబట్టి, ప్రతి రాత్రి మీరు మీ శూన్యంలోకి ప్రవేశించకండి. అక్కడ భయంగానే ఉంటుంది. మీరో వణుకు పుడుతుంది. అయినా ఫరవాలేదు. మెల్లమెల్లగా ఆ భయం తగ్గి దాని స్థానంలో ఆనందం చోటు చేసుకొంటుంది. ఇలా చేస్తూ ఉంటే మూడు వారాల్లో ఏదో ఒకరోజు ఆకస్మాత్తుగా చీకటి రాత్రి ముగిసి ఉషోదయం ఉదయించినట్లు మీలో పెల్లుబికే శక్తి మిమ్ముల్ని ఆశీర్వదిస్తూ మీలో పరమానందాన్ని నింపినట్లుగా మీకు తెలుస్తుంది.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


05 Feb 2021

No comments:

Post a Comment