🌹. వివేక చూడామణి - 13 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. బ్రహ్మ జ్ఞానము - 1 🍀
59. అత్యున్నత బ్రహ్మ జ్ఞానమును పొందిన వానికి శాస్త్ర పఠనము వలన ప్రయోజనము లేదు. అలానే శాస్త్ర పఠనము ద్వారా ఎట్టి ఔనత్యమును పొందలేము.
60. శాస్త్రాలలోని వివిధ పదాలు కిక్కిరిసిన అరణ్యము లాంటివి. అందులో చిక్కుకొనిన బయటపడుట చాలా కష్టము. వాటి వలన మనస్సు వికలమగును. అందువలన తెలివి కలిగినవారు ప్రీతితో నిజమైన ఆత్మ స్వభావమును గ్రహించుట అవసరము.
61. అజ్ఞానమనే నాగుపాముచే కాటు వేయబడిన వ్యక్తికి బ్రహ్మజ్ఞానాన్ని పొందుటయే సరైన వైద్యము. అందుకు వేదాలు, శాస్త్రాలలోని మంత్రాల ద్వారా వైద్యము చేయాలి.
62. కేవలము మందు పేరు పదేపదే ఉచ్చరించుట వలన రోగము తగ్గదు. ఆ మందును సేవించవలసి ఉంటుంది. అలానే బ్రహ్మమును స్వయముగా తెలుసుకొనుట ద్వారానే వ్యక్తి బ్రహ్మాన్ని పొందగలడు.
బ్రహ్మము, బ్రహ్మము అని పదేపదే ఉచ్చరించుట వలన బ్రహ్మ జ్ఞానము లభించదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 13 🌹
✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj
*🌻 Brahma Jnana - 1 🌻*
59. The study of the Scriptures is useless so long as the highest Truth is unknown, and it is equally useless when the highest Truth has already been known.
60. The Scriptures consisting of many words are a dense forest which merely causes the mind to ramble. Hence men of wisdom should earnestly set about knowing the true nature of the Self.
61. For one who has been bitten by the serpent of Ignorance, the only remedy is the knowledge of Brahman. Of what avail are the Vedas and (other) Scriptures, Mantras (sacred formulae) and medicines to such a one ?
62. A disease does not leave off if one simply utter the name of the medicine, without taking it; (similarly) without direct realisation one cannot be liberated by the mere utterance of the word Brahman.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
05-Feb-2021
No comments:
Post a Comment