దేవాపి మహర్షి బోధనలు - 23

🌹. దేవాపి మహర్షి బోధనలు - 23 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

🌻 14. నామ రహస్యము -2  🌻

నాదము నుండి శబ్దము, శబ్దమునుండి నామములు ఒక క్రమమున నేర్పడుచుండును. ఈ క్రమము కాలక్రమమున శతాబ్దముల తరబడి పరిణామము చెందుచుండును. జీవుని యొక్క
పరిణామమును బట్టి అతడు జన్మజన్మలకు పొందు నామములు కూడ పరిమితి చెందుచుండును. 

నాదస్వరూపుడైన జీవుడు పూర్ణత్వము నొందువరకు వివిధ న్మల నెత్తుట, స్వభావము ననుసరించి వివిధ నామములను ధరించుట జరుగు చుండును. ఇన్నిటియందు తానొకడు శాశ్వతముగ పయనించు చుండుట చేత పూర్ణత్వము పొందిన వెనుక జన్మజన్మలకు జీవునిగ తనకొకే నామము ఏర్పరచు కొనుట, ఏ జన్మకాజన్మ ప్రత్యేక నామము కలిగియుండుట కూడ సిద్ధించును. 

పురాణము లందు వచింపబడిన వశిష్ఠుడు, అగస్త్యుడు, విశ్వామిత్రుడు ఇట్టివారే. ఎన్ని వందల జన్మలు గడిచినను వారీ నామములతోనే గుర్తింపబడెదరు. పరమగురువుల నామములు కూడ అట్టివే. 

స్వభావమును సంబంధించిన నామమొకటి వుండగ అందుండి ప్రవర్తించుచున్న జీవుని నామమొకటి ఏర్పడి, ఆ నామము శాశ్వతమై నిలచును. ఆ నామమందలి శబ్ద ప్రభావమే ఆ సిద్ధ పురుషుని ప్రభావముగ వర్తించుచుండును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


05-Feb-2021


No comments:

Post a Comment