భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 165


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 165 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 3 🌻


639. అతడే మానవుడు అతడే భగవంతుడైన సద్గురువు సర్వ స్వతంత్రమైన సత్యమును సృష్టి (ప్రకృతి) లోనికి దింపి పరమాత్మ స్థితిలోనున్న C దివ్య కార్యాలయము నుండి సృష్టిని పాలించును.

640. సద్గురువు ఏకకాలమందే అఖిల విశ్వములలో, సమస్త లోకములలో, భూమికలన్నింటిలో, అన్ని స్థాయిలలో అందరి యొక్క అన్నింటి యొక్క జీవితములను గడుపుచుండును.

641. శివాత్మలలో బహు కొలదిమంది మిక్కిలి అరుదుగా ఏ ఒక్కరో మానవ రూపంలో భగవంతుని జీవితమును ఎరుకతో గడుపుచు సర్వోన్నత దివ్య అవస్థానమును అలంకరింతురు .

642. సత్యస్థితి యొక్క అనుభవములో బ్రహ్మీ బూతులకు, జీవన్ముక్తులుకు (పరమహంసలకు) సలీక్ లకు, సద్గురువులకు కించిత్తయిననూ భేదము లేదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


05 Feb 2021

No comments:

Post a Comment