*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 16 🌴*
*16. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ య: |*
*ఆఘాయురిన్ద్రియారామో మోఘం పార్థ స జీవతి ||*
🌷. తాత్పర్యం :
*ఓ అర్జునా! ఈ విధముగా వేదములచే నిర్ణయింపబడిన యజ్ఞచక్రమును జీవితమున అనుసరింపనివాడు నిక్కముగా పాపజీవనుడగును. కేవలము ఇంద్రియతృప్తి కొరకే జీవించుచు అట్టివాడు నిరర్ధకముగా జీవనము గడుపును.*
🌷. భాష్యము :
“కష్టించి పనిచేసి పిదప ఇంద్రియభోగము ననుభవింపుము” అనెడి ధనలోభపూరితమైన తత్త్వము శ్రీకృష్ణభగవానునిచే ఇచ్చట నిరసించబడుచున్నది. కనుకకనుక ఈ భౌతికజగమును అనుభవింపగోరువారికి పైన తెలుపబడిన యజ్ఞచక్రము అత్యంత అవసరము. అట్టి నియమములను పాటింపనివాడు మిగుల నిరసింపవడినవాడై ప్రమాదకరజీవితమును గడుపువాడే యగును.
ప్రకృతి నియమము ప్రకారము మానవజన్మ యనునది కర్మయోగము లేదా జ్ఞానయోగము లేదా భక్తియోగమనెడి ఏదియో ఒక మార్గము ద్వారా ఆత్మానుభూతిని పొందుట కొరకే ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. నిర్దేశితమైనటువంటి యజ్ఞములను కచ్చితముగా అనుసరింపవలసిన అవసరము గుణదోషాతీతులైన మహాత్ములకు లేకున్నను, ఇంద్రియభోగమునందు నిలిచినవారు మాత్రము పైన తెలుపబడిన యజ్ఞచక్రము ద్వారా పవిత్రతను పొందవలసియున్నది. వాస్తవమునకు కర్మలు పలురకములు. కృష్ణభక్తిభావన లేనివారు నిక్కముగా భోగభావన కలిగినవారు భోగకర్మఫలములందు తగుల్కొనకుండా తమ కోరికలను సంతృప్తిపరచుకొనునట్లుగా యజ్ఞావిదానము ఏర్పాటు చేయబడినది.
ఈ జగత్తు యొక్క పురోభివృద్ధి మన స్వీయకృషిపై గాక, దేవతలచే ప్రత్యక్షముగా నిర్వహింపబడెడి భగవానుని ప్రణాళికపై ఆధారపడియుండును. కనుకనే వేదములందు తెలుపబడిన ప్రత్యేక దేవతల కొరకే యజ్ఞములు ప్రత్యక్షముగా ఉద్దేశింపబడినవి. అట్టి యజ్ఞాచరణము ద్వారా మనుజడు కృష్ణభక్తిభావితుడు కానిచో అవియన్నియును కేవలము నీతి సూత్రములుగా పరిగణింప బడును. కనుక ప్రతి యొక్కరు తమ పురోగతిని కేవలము నీతి సూత్రముల వరకే పరిమితము చేసికొనక, వాటిని అదిగమించి కృష్ణభక్తిభావనను పొందవలసియున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 135 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 3 - Karma Yoga - 16 🌴*
*16. evaṁ pravartitaṁ cakraṁ nānuvartayatīha yaḥ*
*aghāyur indriyārāmo moghaṁ pārtha sa jīvati*
🌷Translation :
*My dear Arjuna, one who does not follow in human life the cycle of sacrifice thus established by the Vedas certainly leads a life full of sin. Living only for the satisfaction of the senses, such a person lives in vain.*
🌷 Purport :
The mammonist philosophy of “work very hard and enjoy sense gratification” is condemned herein by the Lord. Therefore, for those who want to enjoy this material world, the above-mentioned cycle of performing yajñas is absolutely necessary. One who does not follow such regulations is living a very risky life, being condemned more and more.
By nature’s law, this human form of life is specifically meant for self-realization, in either of the three ways – namely karma-yoga, jñāna-yoga or bhakti-yoga. There is no necessity of rigidly following the performances of the prescribed yajñas for the transcendentalists who are above vice and virtue; but those who are engaged in sense gratification require purification by the above-mentioned cycle of yajña performances. There are different kinds of activities. Those who are not Kṛṣṇa conscious are certainly engaged in sensory consciousness; therefore they need to execute pious work.
The yajña system is planned in such a way that sensory conscious persons may satisfy their desires without becoming entangled in the reaction of sense-gratificatory work. The prosperity of the world depends not on our own efforts but on the background arrangement of the Supreme Lord, directly carried out by the demigods. Therefore, the yajñas are directly aimed at the particular demigods mentioned in the Vedas.
Indirectly, it is the practice of Kṛṣṇa consciousness, because when one masters the performance of yajñas one is sure to become Kṛṣṇa conscious. But if by performing yajñas one does not become Kṛṣṇa conscious, such principles are counted as only moral codes. One should not, limit only to the point of moral codes, but should transcend them, to attain Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
No comments:
Post a Comment