🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 49 🌹


*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 49 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 37. వైకుంఠపాళి 🌻*

*జీవితమను వైకుంఠపాళీ క్రీడయందు నిచ్చెన లెక్కుట, సర్ప ముఖమున పడుట సామాన్యము. కాని, ఉత్సాహము నొదలక ముందుకు సాగుట యొక్కటియే క్రీడయందు పరమపదము చేర్చును. ఉత్సాహము, స్ఫూర్తి, ఆశాభావము, జీవుని నడిపించు త్రిశక్తులు. సర్పముఖమున బడిన క్రీడాకారుడు ఒక క్షణము నిరుత్సాహ పడిననూ, మరుక్షణము ముందుకు సాగుచున్నాడు కదా! చతికిలబడి దుఃఖించుట లేదు కదా! నిచ్చెన లెక్కుచున్నప్పుడు కూడా తాను సర్ప ముఖమున పడు అవకాశము గలదని గుర్తించుచునే సాగుచున్నాడు కదా! అట్లే మానవ జీవితమున శ్రీకైవల్య పదమును చేరుటకు సాధన చేయు సాధకుడు కూడా, నిరుత్సాహము చెందకుండా స్ఫూర్తితో ముందుకు సాగవలెను. పరమపదమును చేరువరకూ విశ్రమింప రాదు. క్రీడయందు విశ్రమించుట, వైదొలగుట అవహేళనకు అవకాశము కలిగించును.*

*మేమందరమూ మీవలెనే అట్టి క్రీడను నిర్వర్తించి, పరమ పదమును చేరి, మీరునూ అట్లే తరణము చెందవలెనని ఆకాంక్షించు జ్యేష్ఠ సోదరులము. విశ్రమించుటకన్నా శ్రమించుట యందు శ్రద్ధ కలిగియుండుడు. సత్సంకల్పములను మనస్సు యందు సృజింపుడు. వాటిని భూమిపై అవతరింప జేయుడు. నిత్యమూ మీకు స్ఫూర్తి నందించుటకు మేమందరమూ సంసిద్ధులమై యున్నాము. ఎప్పటి కప్పుడు హృదయమును నిర్మలముగా నుంచుకొనుటకు శ్రద్ధ వహించుడు. మా పిలుపు నందు కొనుటకు అది ఒక్కటియే ప్రాతిపదిక. మీకు శుభములు కలుగు గాక!*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

No comments:

Post a Comment