*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।*
*వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀*
*🌻 333-2. 'వారుణీ మదవిహ్వలా' 🌻*
*పిండము నుండి మానవ దేహ మంతయూ నిర్మాణము చేయునది వారుణియే. మన సహస్రారము నుండి మూలాధారము వరకు వారుణీ ప్రవాహ ముండుటచే మనము భౌతికము వరకు కొనిరాబడినాము. జీవునిగా మనము మిత్ర తత్త్వమునకు (పురుషునకు) సంబంధించిన వారమే. మనకు ఏడు పొరల దేహము ఏర్పరచునది వారుణీ, వసించు వానికి సుఖము నివాసమును బట్టి ఉండును కదా! దేహము సుఖము నివ్వనిచో జీవుడు సుఖముగ నుండలేడు కదా! 'మదవిహ్వల' యనగా తాదాత్మ్యము చెందిననూ విహ్వలురాలు కాదని భావము.*
*సామాన్యముగ స్వాత్మానందమున వున్నవారు బాహ్య కారణములను మరతురు. స్వాత్మానందమున తన్మయత్వము చెందుచునే ఏమరపాటు చెందక సర్వమును నిర్వహించుట సామాన్యము కాదు. అది కేవలము శ్రీమాతకే సాధ్యము. భూమిని భరించుటలో ఆదిశేషువు, సృష్టిని భరించుటలో శ్రీమాత విహ్వలురు కారని పురాణములు వీరిరువురిని పొగుడుచున్నవి. అమితాన ము, అప్రమత్తత ఒకదాని కొకటి విరుద్ధమగు స్థితులు. రెంటినీ ఏకకాలమున నిర్వర్తించుట అసామాన్యమగు విషయమని తెలియవలెను.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 333-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya*
*Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻*
*🌻 333-2. Vāruṇi-mada-vihvalā वारुणि-मद-विह्वला (333) 🌻*
*Vāruṇi is the extract of dates that is allowed to brew and when consumed causes inebriation. By consuming this, She forgets the surroundings and concentrates on Her inner Self (possibly meaning Śiva) is the literal meaning of this nāma. This will be further explained in nāma 878.*
*There is a nāḍi (nerve) called vāruṇi which can be controlled by breath. This nāḍi plays a significant role in excretion of bodily waste. If this nāḍi is brought under control by proper breathing exercises, one will never feel tiredness in the body. Sages keep this nāḍi under their control to cope up with longer duration of meditation. She is said to be in form of this nāḍi. This nāma could not have been conceptualised by any human brain to convey such an intricate meaning, other than Vāc-devi-s.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
No comments:
Post a Comment