*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. జ్ఞానోదయాన్ని కోరుకున్నవాడు నిర్నిబంధమైన ప్రేమతోని నిండి వుండాలి. నీ ప్రేమ స్వచ్ఛంగా, నిర్నిబంధంగా వుండనీ. ఎట్లా ప్రేమపూరింతంగా వుండాలి అన్నదే ముఖ్యం. ఆత్మకి ప్రేమ అవసరం. దాన్ని సజీవంగా వుంచేది అదే. 🍀*
*కాంతికి అవకాశముంది. కానీ అది ప్రేమ వుంటేనే వీలవుతుంది. ప్రేమ లేకుంటే చీకటి మాత్రమే వుంటుంది. లోపలి ప్రపంచంలో కాంతి, ప్రేమ ఒకదాని కొకటి ప్రత్యామ్నాయాలు. అవి వేరు వేరు కావు. కాబట్టి జ్ఞానోదయాన్ని కోరుకున్నవాడు నిర్నిబంధమైన ప్రేమతోని నిండి వుండాలి. ప్రేమకు ఎట్లాంటి డిమాండ్లు వుండకూడదు. డిమాండ్లు ప్రేమని అసహ్యంగా మారుస్తాయి. ప్రేమని నాశనం చేస్తాయి. నీ ప్రేమకి నువ్వు నిబంధనలు ఏర్పరిస్తే అది ప్రేమగా వుండదు. అది శారీరక కాంక్ష అవుతుంది. అది రాజకీయ నాటకమవుతుంది. అధికార క్రీడగా మారుతుంది.*
*నీ ప్రేమ స్వచ్ఛంగా, నిర్నిబంధంగా వుండనీ. దానికి హద్దులేర్పరచకు. ఎవర్ని ప్రేమిస్తున్నావు? దేన్ని ప్రేమించాలి? అని కాక ఎట్లా ప్రేమపూరింతంగా వుండాలి అన్నదే ముఖ్యం. శరీరానికి శ్వాస అవసరం. అదే దాని జీవితం. ఆత్మకి ప్రేమ అవసరం. దాన్ని సజీవంగా వుంచేది అదే. ప్రేమించే కొద్దీ ఆత్మ ఎదుగుతుంది. నీ ప్రేమ అనంతమైతే నీ ఆత్మ శాశ్వతమవుతుంది. అప్పుడు ప్రేమకు సరిహద్దులుండవు. అదే దైవత్వాన్ని తెలుసుకోవడం.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
No comments:
Post a Comment