2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 297 🌹
3) 🌹. శివ మహా పురాణము - 496🌹
4) 🌹 వివేక చూడామణి - 173 / Viveka Chudamani - 173🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -125🌹
6) 🌹 Osho Daily Meditations - 114 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 173 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 173 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 27, డిసెంబర్ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. రుద్రనమక స్తోత్రం-4 🍀*
*బిభర్షి తాం గిరిత్రాద్య శివాం కురు శివాపతే!*
*శివేన వచసా రుద్ర నిత్యం వాచా వదామసి!!7!!*
*త్వద్భక్తి పరిపూతాంగం మహింసీః పురుషం జగత్!*
*యచ్చ శర్వ జగత్సర్వ మయక్ష్మం సుమనా అసత్!!8!!*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: కృష్ణ అష్టమి 19:29:36 వరకు
తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: హస్త 29:08:05 వరకు
తదుపరి చిత్ర
యోగం: సౌభాగ్య 08:53:50 వరకు
తదుపరి శోభన
కరణం: బాలవ 07:52:45 వరకు
వర్జ్యం: 13:43:42 - 15:18:30
దుర్ముహూర్తం: 12:39:16 - 13:23:40
మరియు 14:52:28 - 15:36:52
రాహు కాలం: 08:07:20 - 09:30:35
గుళిక కాలం: 13:40:19 - 15:03:34
యమ గండం: 10:53:50 - 12:17:05
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:39
అమృత కాలం: 23:12:30 - 24:47:18
సూర్యోదయం: 06:44:06
సూర్యాస్తమయం: 17:50:03
వైదిక సూర్యోదయం: 06:47:59
వైదిక సూర్యాస్తమయం: 17:46:09
చంద్రోదయం: 00:01:31
చంద్రాస్తమయం: 12:28:40
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: కన్య
వజ్ర యోగం - ఫల ప్రాప్తి 29:08:05
వరకు తదుపరి ముద్గర యోగం -
కలహం
పండుగలు : మండల పూజ
Mandala Pooja
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -297 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 18-3
*🍀 18-3. పరతత్వము - దైవ ముండుటయే మన ముండుటగ యున్నది. మనము వర్తించున దంతయు దైవము నందే. మనము జీవించునది కూడ దైవమునందే. మన నివాసము శాశ్వతముగ దైవమునందే యున్నది. దైవమే మనముగ యుండగ, మన మున్నామను భ్రాంతితో జీవింతుము. మన మున్నామని భావించుట మిధ్య. దైవమే మనముగ యున్నామని తెలుయుట జ్ఞానము. ఇతరములను శరణము కోరుట కన్న దైవమునే ఎదుటి వానియందు దర్శించుచు శరణము కోరవలెను. 🍀*
*గతి ర్బరా ప్రభు స్పాక్షీ నివాస శ్శరణం సుహృత్ |*
*ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజ మవ్యయమ్ II 18*
*తాత్పర్యము : నేనే సమస్త జీవులకు గతి (లక్ష్యము). సమస్తమును భరించువాడను నేనే. సమస్తమునకు ప్రభువును నేనే. సాక్షియు నేనే. అందరికి నివాస స్థానము నేనే. నీకు హితమొనర్చు వాడను నేనే. నేనే సృష్టి స్థితి లయములకు మూలము. శాశ్వతమగు బీజమును కూడ నేనే.*
*వివరణము : నివాసము : మన మందరము వసించు చున్నది దైవము నందే. నిద్రించుచున్నది కూడ దైవము నందే. మేల్కాంచు చున్నది కూడ దైవమునందే. దైవ ముండుటయే మన ముండుటగ యున్నది. మనము వర్తించున దంతయు దైవము నందే. మనము జీవించునది కూడ దైవమునందే. మన నివాసము శాశ్వతముగ దైవమునందే యున్నది. విశ్వమంతయు దైవమే నిండి యున్నపుడు, అందుగాక జీవులు మరెందు యుందురు. దైవమే మనముగ యుండగ, మన మున్నామను భ్రాంతితో జీవింతుము. మన మున్నామని భావించుట మిధ్య. దైవమే మనముగ యున్నామని తెలుయుట జ్ఞానము.*
*శరణం : అందరికిని, అన్నిటికిని ఈశ్వరుడే శరణ్యుడు. అన్నియు ఈశ్వరునుండియే ఉద్భవించినవి గనుక ఇతర విషయముల నాశ్రయింపక, అన్నిటికిని మూలమైన దానినే శరణు జొచ్చ వలెను. ఇతరములను శరణము కోరుట కన్న దైవమునే ఎదుటి వానియందు దర్శించుచు శరణము కోరవలెను. అపుడు ఎదుటి వాని యందలి ఈశ్వరుడు ప్రతిస్పందించి, శరణము నిచ్చును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 495 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 39
*🌻. శివుని యాత్ర - 5 🌻*
దధీచి, ఉపమన్యువు, భరద్వాజుడు, ఆకృతవ్రణుడు, పిప్పలాదుడు, కుశికుడు, కౌత్సుడు, వ్యాసుడు, ఆతని శిష్యులు (54) మరియు ఎందరో ఇతరులు శివుని సన్నిధికి వచ్చి యుండిరి. వారందరూ నా ప్రేరణచే అచట వైవాహిక కర్మను యథావిధిగా నిర్వర్తించిరి (55).
వేదవేదాంగవేత్తలగు వారందరు మహేశునకు వేదోక్త విధానముచే పవిత్ర వివాహ కర్మకు మంగళమును కలిగించే రక్షాబంధనమును నిర్వర్తించిరి (56). ఆ ఋషులందరు ఋగ్యజుస్సామ వేదముల యందలి సూక్తములను, ఇతరములైన వివిధ ఆశీర్వచనములను పఠించి ప్రేమతో విస్తృతమగు మంగళా శాసనములను చేసిరి (57).
వారు శంభునిచే గ్రహపూజను ఆనందముతో చేయించిరి. మరియు విఘ్న నివారణ కొరకు మండపమును స్థాపించి దానియందు దేవతలనందరినీ ఆరాధించిరి (58). అపుడు శివుడు లౌకికవైదిక కర్మలనన్నిటినీ యథా యోగ్యముగా చేసి ఆ బ్రాహ్మణులకు ఆనందముతో నమస్కరించెను (59).
అపుడు సర్వేశ్వరుడగు శివుడు బ్రాహ్మణులను, దేవతలను ముందిడుకొని, పర్వతరాజమగు ఆ కైలాసము నుండి ఆనందముతోబయలు దేరెను (60). అనేక లీలలను నెరపు ఆ శంభు ప్రభుడు ఆనందముతో నిండినవాడై దేవతలతో మరియు ఋషులతో గూడి కైలాస పర్వతమునకు బయట నిలచెను (61).
అపుడు దేవతలు అచట మహేశుని సంతోషము కొరకు గాన వాద నృత్యములతో నలరారే ఉత్సవమును జరిపిరి (62).
శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహిత యందు పార్వతీ ఖండలో శివ యాత్రా వర్ణనమనే ముప్పది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (39).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 173 / Viveka Chudamani - 173 🌹*
*✍️. రచన : పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -20 🍀*
*563. ఏ విధముగా రాయి, చెట్టు, గడ్డి, ధాన్యము మొదలుగు వానిని కాల్చినప్పుడు బూడిదగా మారుతుందో, అలానే ఈ వస్తు సముదాయముతో కూడిన విశ్వము, శరీరము, శరీర భాగాలు, ప్రాణము, మనస్సు లాంటి వాటన్నింటిని జ్ఞానాగ్ని తగుల పెట్టినపుడు అవి బ్రహ్మములో కలసి బ్రహ్మముగా మారతాయి.*
*564. ఏవిధముగా చీకటి సూర్య ప్రకాశము వలన తొలగి పోతుందో అలానే ఈ వస్తు ప్రపంచము జ్ఞానాగ్ని వలన బ్రహ్మములో లీనమవుతుంది.*
*565. ఎపుడైతే మట్టి కుండ పగులుతుందో, ఆ కుండలో ఉన్న ఆకాశము విశ్వాకాశములో కలసిపోయినట్లు; ఈ కనిపించుచున్న పరిమితమైన వస్తు సముదాయము వ్యక్తి బ్రహ్మ జ్ఞానమును పొందినపుడు బ్రహ్మములో కలసిపోతాయి.*
*సశేషం....*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 173 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*
*🌻 32. I am the one who knows Brahman -20 🌻*
*563. Just as a stone, a tree, grass, paddy, husk, etc., when burnt, are reduced to earth (ashes) only, even so the whole objective universe comprising the body, organs, Pranas, Manas and so forth, are, when burnt by the fire of realisation, reduced to the Supreme Self.*
*564. As darkness, which is distinct (from sunshine), vanishes in the sun’s radiance, so the whole objective universe dissolves in Brahman.*
*565. As, when a jar is broken, the space enclosed by it becomes palpably the limitless space, so when the apparent limitations are destroyed, the knower of Brahman verily becomes Brahman Itself.*
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 VIVEKA CHUDAMANI - 173 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*
*🌻 32. I am the one who knows Brahman -20 🌻*
*563. Just as a stone, a tree, grass, paddy, husk, etc., when burnt, are reduced to earth (ashes) only, even so the whole objective universe comprising the body, organs, Pranas, Manas and so forth, are, when burnt by the fire of realisation, reduced to the Supreme Self.*
*564. As darkness, which is distinct (from sunshine), vanishes in the sun’s radiance, so the whole objective universe dissolves in Brahman.*
*565. As, when a jar is broken, the space enclosed by it becomes palpably the limitless space, so when the apparent limitations are destroyed, the knower of Brahman verily becomes Brahman Itself.*
*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 125 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. లోకోద్ధరణము- వ్యక్తి ఉద్ధరణము-1 🌻*
*అనంత సృష్టిలో జీవుడు అణువు మాత్రమే. అంతర్యామి యొక్క శక్తియే అణువు ద్వారా పనిచేసేది. ఇది గుర్తించి తనను తాను సమర్పించుకొన్న వానికి తన ద్వారా జరుగు లోకహితము యొక్క ఫలము తనకు అందాలని అనిపించదు. గుర్తింపుతో అతనికి పనిలేదు. వీనిని తలచువానికి అంతర్యామితో, సద్గురువుతో అనుసంధానము తెగిపోవును.*
*తన ద్వారా అన్న వస్త్రాది లౌకికములయిన ప్రయోజనములు గాని, విజ్ఞానము కాని అందుకొన్న వాడెట్లును తనను క్రమముగా గౌరవించుట నేర్చికొనును అట్లు అతనిని అంతర్యామి ప్రేరేపించును. అతనిలో దివ్యత్వము యొక్క మేలుకొలుపునకు అది నాంది. కాని వారిచ్చు ఆ గౌరవాన్ని, మన్ననను స్వప్రయోజనముకై వ్యయం చేసే సాధకుడు అఖండ దివ్యానందమనే పరమపదాన్ని అందుకోలేడు. గౌరవాదరాలు కూడ తగ్గే సరికి, ఇక తనమేలును మరచినట్లు భ్రాంతి కలిగి, చిరాకు, చికాకు, కోపము, అవమానము, దుఃఖములకు గురియగుట జరుగును.*
....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 114 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 114. CHANGE 🍀*
*🕉 This is my observation, that one should never make an effort to change anything, because that effort is going to make things difficult rather than easy. 🕉*
*Your mind is attached to something, and now the same mind tries to detach itself. At the most it can repress, but it can never become a real detachment. For the real detachment to happen, the mind has to understand why the attachment is there. There is no need to be in a hurry to drop it; rather, see why it is there. Just look into the mechanism, how it works, how it has come in: what circumstances, what unawareness has helped it to be there. Just understand everything around it.*
*Don't be in a hurry to drop it, because people who are in a hurry to drop things don't give themselves enough time to understand them. Once you understand, suddenly you see that it is slipping out of your hands; so there is no need to drop it. Nothing is there for any reason other than a misunderstanding. Something has been misunderstood; hence it is there. Understand it rightly and it disappears. All that is creating trouble is just like darkness. Bring light to it and simply light because with the very presence of light, darkness no longer exists.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 173 / Sri Lalita Sahasranamavali - Meaning - 173 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 173. విశ్వమాతా, జగద్ధాత్రీ, విశాలాక్షీ, విరాగిణీ।*
*ప్రగల్భా, పరమోదారా, పరామోదా, మనోమయీ ॥ 173 ॥ 🍀*
🍀 933. విశ్వమాతా :
విశ్వమునకు తల్లి
🍀 934. జద్ధాత్రీ :
జగత్తును రక్షించునది
🍀 935. విశాలాక్షీ :
విశాలమైన కన్నులు కలది
🍀 936. విరాగిణీ :
దేనిథోనూ అనుభందము లేనిది
🍀 937. ప్రగల్భా :
సర్వసమర్ధురాలు
🍀 938. పరమోదారా :
మిక్కిలి ఉదారస్వభావము కలిగినది
🍀 939. మరామోదా :
పరమానందము కలిగినది
🍀 940. మనోమయీ :
మనశ్శే రూపముగా కలిగినది
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 173 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 173. Vishvamata jagadhatri vishalakshi viragini*
*Pragalbha paramodara paramoda manomaei ॥ 173 ॥ 🌻*
🌻 933 ) Viswa Matha -
The mother of the universe
🌻 934 ) Jagat Dhathri -
She who supports the world
🌻 935 ) Visalakshi -
She who is broad eyed
🌻 936 ) Viragini -
She who has renounced
🌻 937 ) Pragalbha -
She who is courageous
🌻 938 ) Paramodhara -
She who is great giver
🌻 939 ) Paramodha -
She who has great happiness
🌻 940 ) Manomayi -
She who is one with mind
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామములు #LalithaSahasranam
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment