శ్రీ మదగ్ని మహాపురాణము - 70


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 70 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 29
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సర్వతో భద్ర మండల విధి - 3 🌻

ఇన్దీవరదలాకారానథవా మాతులుఙ్గవత్‌ | పద్మపత్రాయతాన్వాపి లిఖేదిచ్ఛానురూపతః. 24
భ్రామయిత్వా బహిర్నే మావరసన్ధ్యరే స్థితః | భ్రామయేదరమూలం తు సన్ధిమధ్యే వ్యవస్థితః. 25
అరమధ్యే స్థితో మధ్యమరణిం భ్రామయేత్సమమ్‌ | ఏవం సన్ధ్యన్తరాః సమ్యఙ్మాతులుఙ్గనిభాః సమాః. 26

క్షేత్రమును మూడు భాగములుగ విభజించి, మరల లోపలినుండి ఒక్కొక్కదానిని రెండేసి భాగములు చేయవలెను. లోపల నున్న ఐదు కోష్ఠములను తుడిచివేసి వాటిపై ఆకులు నిర్మింపవలెను. ఈ ఆకులు ఇందీవరదళాకారములో గాని, మాతులింగ ఫలాకారములో గాని, కమలదళాకారమలో గాని ఉండవచ్చును.

లేదా వాటి ఆకారమును తమ ఇచ్ఛ ప్రకారము చేయవచ్చును. ఆకుల సంధుల మధ్యదారముంచి, దానిని వెలుపల నున్న నేమి (చక్రాంతము) వరకు లాగి, నాలుగు వైపుల త్రిప్పవలెను.

ఆకుయొక్క సంధియందు దారమునుంచి దాని మూలభాగమును త్రిప్పవలెను. ఆకు మధ్యస్థానము నందు దారము ఉంచి ఆ మధ్యభాగము నలువైపులకును సమముగా దారము త్రిప్పవలెను. ఈ విధముగా త్రిప్పగా మాతులుంగాకారము గల ఆకు లేర్పడును.

విభజ్య సప్తధా క్షేత్రం చతుర్దశకరం సమమ్‌ | ద్విధా కృతే శతం హ్యత్ర షణ్ణవత్యధికాని తు. 27
కోష్ఠకాని చతుర్భిసై#్తర్మధ్యే భద్రం సమాలిఖేత్‌ | పరితో విసృజేద్వీథ్యై తథా దిక్షు సమాలిఖేత్‌. 28
కమలాని పునర్వీథ్యై పరితః పరిమృజ్య తు | ద్వే ద్వే మధ్యమకోష్ఠే తు గ్రీవార్థం దిక్షు లోపయేత్‌. 29
చత్వారి బాహ్యతః పశ్చాత్త్రీణి త్రీణి తు తోపయత్‌ | గ్రీవా పార్శ్వే బహిస్త్వే కా శోభా సా పరికీర్తితా. 30
విసృజ్య బాహ్యకోణషు సప్తాన్తస్త్రీణి మార్జయేత్‌ | మణ్డలం నవభాగం స్యాన్న వవ్యూహం హరిం యజేత్‌. 31
పఞ్చవింశతికవ్యూహం మణ్డలం విశ్వరూపకమ్‌ | ద్వాత్రింశద్ధస్తకం క్షేత్రం భక్తం ద్వాత్రింవతాసమమ్‌. 32
ఏవం కృతే చతుర్వింశత్యధికం తు సహస్రకమ్‌ | కోష్ఠకానాం సముద్దిష్టం మధ్యే షోడశకోష్ఠకైః. 33
భద్రకం పరిలిఖ్యాథ పార్శ్వే పఙ్త్కిం విమృజ్య తు | తతః షోడవభిః కోష్ఠైర్దిక్షు భద్రాష్టకం లిఖేత్‌. 34

పదునాలుగు హస్తముల క్షేత్రమును ఏడు భాగములుగ విభజించి, మరల రెండేసి భాగములుగ విభజింపవలెను.

లేదా - తూర్పునుండి పశ్చిమము వరకును, ఉత్తరమునుండి దక్షిణము వరకును పదునైదేసి సమానరేఖలు గీయవలెను. ఇట్లు చేయుటచే నూటతొంబదియారు కోష్ఠము లేర్పడును. వీటిలో మధ్య నున్న నాలుగు కోష్ఠములచే భద్రమండలము ఏర్పరుపవలెను. దాని నాలుగు వైపుల వీథికొరకై స్థానము విడువవలెను.

మరల అన్ని దిక్కులందును కమలములు గీయవలెను. ఆ కమలములు నాల్గు వైపులందును వీథికొరకై ఒక్కొక్క కోష్ఠమును తుడిచివేయవలెను. పిమ్మట, మధ్య నున్న రెండేసి కోష్ఠములను కంఠభాగముకొరకై తుడిచివేయవలెను.

పిమ్మట వెలుపల నున్న నాలుగేసికోష్టమలలో మూడు మూడు కోష్ఠములను తుడిచివేయవలెను. వెలుపల నున్న ఒక్కొక్క కోష్ఠమును కంఠస్థానపార్శ్వమునందు మిగల్చవలెను. దానికి ద్వారశోభ యనిపేరు.

వెలుపల నున్న కోణములలో ఏడింటిని మినహాయించి లోపల నున్న మూడేసి కోష్ఠములను తుడిచివేయవలెను. దానికి 'నవనాలము' లేదా ''నవనాభమండలము'' అని పేరు.

దాని తొమ్మిది నాభులయందు, నవవ్యూహరూపుడైన శ్రీహరిని పూజింపవలెను. ఇరువదియైదు వ్యూహముల మండలము విశ్వవ్యాపి యైనది. ముప్పదిరెండు హస్తముల క్షేత్రమును, ముప్పదిరెండుచేతనే సమముగా విభజింపవలెను.

అనగా పైనుంచి క్రిందికి ముప్పదిమూడు రేఖలు గీసి, అడ్డముగా కూడ ముప్పదిమూడు రేఖలు గీయవలెను. ఈ విధముగ ఒక వెయ్యి ఇరువదినాలుగు కోష్ఠములు ఏర్పడును. వాటిలో మధ్య నున్న పదునారు కోష్ఠకములతో ''భద్రమండలము''ను నిర్మింపవలెను.

మరల నాలుగు ప్రక్కల నున్న ఒక్కొక్క పంక్తిని విడువలెను. పిమ్మట ఎనిమిది దిక్కులందును పదునారు కోష్ఠకములచే ఎనిమిది భద్రమండలములు ఏర్పరుపవలెను. దీనికి ''భద్రాష్టకము'' అని పేరు.

తతో7పి పఙ్త్కిం సంమృజ్య తద్వత్‌ షోడశభద్రకమ్‌ |

లిఖిత్వా పరితః పఙ్త్కిం విమృజ్యాథ ప్రకల్పయేత్‌. 35
ద్వారద్వాదశకం దిక్షు త్రీణి త్రీణి యథాక్రమాత్‌ | షడ్భిశ్చ పరిలుప్యాన్తర్మధ్యే చత్వారి పార్శ్వయోః. 36

దాని తరువాత నున్న ఒక పంక్తి చెరిపి వేసి మరల వెనుకటి వలె పదునారు భద్రమండలములు వ్రాయవలెను. పిమ్మట అన్ని ప్రక్కలను ఉన్న ఒక్కొక్క పంక్తి చెరిపివేసి ఒక్కొక్క దిక్కున మూడేసి చొప్పున పండ్రెండు ద్వారములు నిర్మింపవలెను. వెలుపల నున్న ఆరు కోష్ఠములు తుడిచివేసి మధ్యభాగముయొక్క పార్శ్వభాగములందలి నాలిగింటిని తుడిచివేయవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం

No comments:

Post a Comment