🌹. నారద భక్తి సూత్రాలు - 68 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. చలాచలభోధ
తృతీయాధ్యాయము - సూత్రము - 39
🌻. 39. మహత్పంగస్తు దుర్లభోః_ గమ్యో_ అమోఘశ్చ ॥ 🌻
మహాత్ముల సాంగత్యం దొరకడమనెది దుర్లభం, అగమ్యం, అమోఘం కూడా. మహాత్ములను సాధారణ మానవులుగా భావించడం జరుగుతుంది. వారు దొరకడమే కష్టం. దొరికినా గుర్తించలేరు. ఎందుకంటే వారు నిరాడంబరంగా ఉంటారు. బాలురవలె క్రీడిస్తారు. పిచ్చివారివలె ప్రవర్తిస్తారు. పిశాచివలె సంచరిస్తారు. భక్తుల పుణ్య విశేషం చెతగాని దొరకరు,గుర్తించబడరు. కాని వారు కోరకనె అనుగ్రహిస్తారు, ఉపదేశిస్తారు. అయితే భక్తుడు దానికి అర్హుదై సంసిద్ధుడై ఉండాలి. వారి చేష్టలు అగమ్య గోచరంగా ఉంటాయి. వారు అనుగ్రహించి విధానం అమోఘం.
మహాత్ములకు న్వార్ధపూరిత మనసు ఉండదు. దైవ ప్రేరణతో పని చెసే మనసుంటుంది. ఆ దివ్యమైన మనసు అదృష్టవంతులైన భక్తులను అనుగ్రహించడం వంటి పవిత్ర కార్యాలకు వినియోగించబడుతుంది. మహాత్ముడు భగవంతుని నుండి ప్రసరించె అనుగ్రహాన్ని అర్హత కలిగిన భక్తులపైకి ప్రతిఫలింపచెస్తూ ఉంటాడు.
ఉదాహరణకు ఒక ఉపగ్రహం (శాటిలైట్ గా పనిచెస్తూ ఉంటాడు. కొందరు మహాత్ములు భక్తులకు పరీక్షలు పెట్టి తద్వారా పురోగమింపచేస్తారు. భక్తులను పరాభక్తికి సంసిద్దులను చేసారు. కాని వారి అనుగ్రహం భక్తులయెడ పక్షపాతంతో కూడి ఉండదు. భక్తులలో గౌణభక్తి స్థానంలో మఖ్యభక్తి కలిగే స్థాయిని బట్టీ మహాత్ముల సహాయం అందుతూ ఉంటుంది.
వారి కృపకు వాత్రులవక పోవడమనెది భక్తులలోనె లోపముండవచ్చును గాని, మహాత్ముల అనుగ్రహం ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటుంది. సంసిద్ధమైన భక్తులను మహాత్ములు వెతుక్కుంటూ వచ్చి వారిని పరాభక్తిలో నిలుపుతారు. ఈ సంఘటన అమోఘం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment