భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 86


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 86 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరాశర మహర్షి - 5 🌻

20. ఒకసారి జనకమహారాజు (అదే వంశంలో మరొక జనకుడు) పరాసరమహర్షి దగ్గరికి వెళ్ళి, “ధర్మాన్ని తెలుస్కుందామని నీ దగ్గరికి వచ్చాను, నాకు ధర్మాన్ని గురించి చెప్పు” అని అడిగాడు. అందుకు ఆయన రాజుతో, “ఫలం కావాలంటే వృక్షం కావాలి. వృక్షం కావాలంటే బీజం కావాలి కదా! అలాగే సౌఖ్యం కోరేవాడు ధర్మాన్ని ఆశ్రయిస్తాడు. ఎప్పుడో భవిష్యత్తులో సుఖం కావాలంటే ఇప్పుడు ధర్మాచరణచేయడమే కర్తవ్యం.

21. “సత్కృత్యమైనా, దుష్కృత్యమైనా ఆ పాపపుణ్యములు ఫలాన్ని ఇవ్వకుండా మనుష్యులను వదిలిపెట్టవు. కాబట్టి మనస్సు, వాక్కు, దృష్టి వీటన్నిటిటొటీ సత్యం, శమము మొదలైన వాటితో కూడిన సత్పథాన్ని ఆశ్రయించాలి. సమదర్శియై, న్యాయధర్మములలో ఉండేవాడికి దేవతలు నమస్కరిస్తారు.

22. మనుష్యుడు బంధ విముక్తుడు కావాలి. వేదాధ్యనం చేయటంచేత ఋషిఋణం తీర్చుకుంటాడు. యజ్ఞయాగాదుల చేత దేవతల ఋణం తీర్చుకుంటాడు. అతిథి పూజచేసి ఆతిథ్యం ఇచ్చి, అతిథిఋణం తీర్చుకుంటాడు. దానధర్మములుచేసి ప్రజలఋణం తీర్చుకుంటాడు. ఈ ప్రకారంగా మనిషి అన్ని ఋణాలూ తీర్చుకును పవిత్రుడవుతాడు. ధర్మమార్గం ఇంతే! ఈ జీవితం అనిత్యమని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి సుమా! సుఖ దుఃఖాలు కలిగినప్పుడుకూడా ధర్మవిషయం మరచిపోకుండా ఉండటం శ్రేయస్సుకు మార్గం” అని చెప్పాడు.

23. “తపోధిక్యత అంటారుకదా! తపస్సు అనేది ఎలాగ ఉంటుంది? దానికి ఉత్కృష్టత ఎలా ఏర్పడింది?” అని జనకుడు అడిగాడు. “మహారాజా! విద్యాధరులున్నారు. ఋషులున్నారు. దేవతా గనములున్నవి. వాళ్ళందరూ అట్టిస్థితికి ఎలాగ వెళ్ళరనుకుంటున్నావు? తపస్సు చేతనే! తపస్సు ఆ ఉత్తమలొఖాలకు మార్గం. బ్రహ్మదేవుడికి ఈ సృష్టించే శక్తి తపస్సువల్లనే వచ్చింది.

24. ఐహికాముష్మికమయిన ఏ కోరికైనాకూడా తీర్చుకోవాలంటే తపస్సే కారణం. ఇంకొక మార్గమే లేదు. దారాపుత్రులు, సంసారము, ధనము, దుఃఖము – వీటిలో పడ్డవాడిక్కూడా, ఈ సంఘాన్ని తప్పించుకునేందుకు, చిత్తము పరిశుద్ధతపొంది శాంతి కావాలంటే కూడా దానికి తపస్సే మార్గం.

25. తపస్సు లేని వాడిని లోభమోహాలు వశపరుచుకుంటాయి. తపస్సులో ఉన్నవాళ్ళను లోభము, మోహము, కామము ఏమీ చెయ్యవు. ధర్మార్థకామమోక్షాలన్నిటికీ ప్రారంభమ్నుంచీ చివరిదాకా ఉండే మార్గం, గమ్యస్థానం, ఉపాయం అంతాకూడా తపస్సే.

26. పరమపుణ్యపురుషులు, యోగులు, మహర్షులు మొదలైనవాళ్ళు అంతవారుకావటానికి కారణం తపస్సే అని తెలుసుకో!తపస్సు యొక్క ఫలం తెలుసుకోవాలంటే వాళ్ళచరిత్రలు తెలుసుకుంటే చాలు. “వాళ్ళకు కోరికలు లేవు, దుఃఖం లేదు. వాళ్ళు పరమ శాంతచిత్తులు. లోకంలో మానసికమయిన ఎట్టివికారములూ లేవు. సృష్టిలోనూ, దేనియందూ సంగబుద్ధి వారికిలేదు.

27. వారి దగ్గరికి వెళ్ళగానే ఇతరులకు కూడా శాంతి, అనుగ్రహము ప్రసాదించగలిగిన శక్తి వారికి తపస్సు వల్లనే వచ్చింది. వాళ్ళను చూస్తే తపస్సు యొక్క శక్తి తెలుస్తుంది” అని బోధించాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment