శివగీత - 34 / 𝓣𝓱𝓮 𝓢𝓲𝓿𝓪-𝓖𝓲𝓽𝓪 - 34


🌹. శివగీత - 34 / 𝓣𝓱𝓮 𝓢𝓲𝓿𝓪-𝓖𝓲𝓽𝓪 - 34 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ
పంచామాధ్యాయము

🌻. రాముని యస్త్ర ప్రాప్తి - 4 🌻

అధః తుష్టః ప్రణమ్యేశం - రామో దశరదాత్మజః,
ప్రాంజలి: ప్రణతోభూత్వా - భక్తి యుక్తో వ్యజిజ్ఞ పత్ . 25

పిమ్మట శ్రీ రాముడు సంతృప్తి చెంది శివునకు ప్రణమిల్లి చేతులు జోడించి భక్తి మీర నిట్లు నివేదించు కొనెను.

భగవాన్! న్మాను షైరేవ - నోల్లంఘ్యో లవణాంబుధి:,
తత్ర లంకాభి ధం దుర్గం - దుర్జయం దేవదానవై: 26

అనేక కోట యస్తత్త్ర - రాక్షసా బలవత్తరా;,
సర్వే స్వాద్యాయ నిరతా -శ్శివ భక్తా జితేంద్రియా: 27

అనేక మాయా సంయుక్తా - బుద్ది మంతోగ్ని హొత్రిణః,
కధ మేకాకి నాజేయా - మయా భ్రాతాచ సంయుగే 28

ఓ పరమేశ్వరా! విశాలము మరియు అగాధమైన సాగరము మానవులచేత దాటశఖ్యము కానిది పోగా లంకా నగరము ప్రవేశింప సాధ్య పడనిది.

అంతేకాదు, దేవదానవులకు కూడా సాధించ రానిది, అక్కడ మహాశాలురు, స్వాద్యాయ నిరతులు, శివ భక్తులు (వీర శైవులు ) ఇంద్రియ నిగ్రహము కలవారు మాయాసహితులు బుద్ధిమంతులు, అగ్ని హొత్రము కల (బ్రాహ్మణులు ) వారును, మరి ఎందరో సుతులు ఉన్నారు.

కేవలము నా సోదరుడగు లక్ష్మణుని తో బాటు ఏకాకిగా నున్న నేను మాత్రము రావణుని యెట్లు జయించ గలను?

రావణస్య వధే రామ ! - రక్ష సామపి మారణే ,
విచారో నత్వయా కార్య -స్తస్య కాలోయ మాగతః 29

అధర్మే తు ప్రవృత్తాస్తే - దేవ బ్రాహ్మణ పీడనే,
తస్మా దాయు: క్షయం యాతం -తేషాం శ్రీ రపి సువ్రత ! 30

శివుడాదేశించు చున్నాడు: ఓయీ రామా! రావణుని వధించుట, మరియు రాక్షసులను పరిమార్చుటలోనీవెంత మాత్రము విచార పడకుము.

రావణునికి చావు దగ్గరలో నున్నది, రాక్షసులు అధర్మ నిరతులై, దేవతలు బ్రాహ్మణులను పీడించు చున్నారు. కావున వారి యాయువు ఐశ్వర్యములు తొలగి పోవనున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 𝓣𝓱𝓮 𝓢𝓲𝓿𝓪-𝓖𝓲𝓽𝓪 - 34 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 05 :
🌻 Ramaya Varapradanam - 4
🌻

Thereafter Sri Rama became satisfied and saluted Lord Shiva time and again. Furtehr, with full devotion

Rama spoke the following words.

O Parameshwara! The vast and deep ocean is impossible to be crossed by humans. Moreover, Lanka fort is impregnable for even Gods and demons. There many saints, Shiva devotees,Jitendriya (people who have conquered their senses), wise, illusionists, Brahmanas, and many other high profiled people exist. How would it be possible for me and my younger brother Lakshmana to defeat Ravana?

Lord Shiva said: O Rama! Do not worry on that front. Ravana's time has started nearing its end.

All those demons have become unrighteous, and have tormented Gods and Brahmanas, therefore their lifespan and all opulence are destined to come to an end.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment