అద్భుత సృష్టి - 7


🌹. అద్భుత సృష్టి - 7 🌹
✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟 2. భూమి - మానవ సృష్టి - 2 🌟

🌟. ఈ భూమిని సమాచార ప్రసరణ కేంద్రంగా మలచిన వారు "కాంతి శరీరధారులు"! 'కాంతి' అంటే 'చైతన్యం'. కాంతే సమాచారం. ఈ సమాచారాన్ని విభిన్న ప్రకంపనల రూపంలో.. DNA లోని జన్యువులలో పదిలపరచి ఈ భూమిని ప్రయోగశాలగా మార్చారు.

ఇక్కడ కొన్ని కోట్ల సంవత్సరాలు (అనేక యుగాలు) ఎన్నో జన్యుపరిజ్ఞాన పరిశోధనలు జరిగాయి. మన పుస్తకాలలో చదువుకున్న చరిత్రకు పూర్వమే భూమి ఎంతో గొప్ప నాగరికతను సంతరించుకుంది. ఇప్పుడు modern science చేస్తున్న కొత్త కొత్త ప్రయోగాలు అన్నీ ఈ భూమిపై ఎప్పుడో జరిగిపోయాయి!

💫. ఇంతటి జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకున్న ఈ భూమి అనే సజీవ గ్రంథాలయాన్ని సొంతం చేసుకోవడానికి ఎన్నో విశ్వాలవాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి యుద్ధాలు కూడా చేసుకున్నారు.

💫. ఇప్పటి కాలమానం ప్రకారం మూడు లక్షల సంవత్సరాలకు పూర్వం ఈ భూమి దురాక్రమణకు గురి అయింది. ఈ ఆక్రమణదారులకు భూమి, భూలోకవాసులు విజ్ఞానులుగా, స్వతంత్రులుగా ఉండటం ఇష్టం లేదు.

భూమిపై ఉన్న మనుషులను అజ్ఞానులుగా తయారు చేసి ఈ భూమిని ఆక్రమించి వారి ఆధీనంలోకి తెచ్చుకున్నట్లైయితే... ఇలాంటి ఎన్నో విశ్వాలతో ఉన్న భూములు తమ ఆధీనంలోకి వస్తాయనీ.. తద్వారా మూలం పై (భగవంతునిపై) తిరుగుబాటు చేయవచ్చు అన్న ఆలోచనతో వారు భూమిని దురాక్రమించడం జరిగింది.

💫. భూమిని ఆక్రమించిన వెంటనే వాళ్ళు మొదట భూమిపైకి వస్తున్న ఇతర విశ్వాల సమాచార వ్యవస్థను ధ్వంసం చేశారు. దీని ద్వారా మానవునికి అందుతోన్న జ్ఞానం అందకుండాపోయి ..

కాంతి ద్వారాలు అన్నీ మూసివేయబడ్డాయి. 'కాంతి' అంటే 'జ్ఞానం'. ఈ జ్ఞాన ప్రసరణ భూమిపైకి మరి ఏ ఇతర దారుల గుండా రాకుండా భూమి యొక్క కాంతి గ్రిడ్ లను ఛేదించి.. చీకటి శక్తుల యొక్క పటిష్టమైన గ్రిడ్ లను తయారు చేశారు. వీటి వల్ల కాంతి భూమిపైకి రాకుండా కొన్ని వేల సంవత్సరాలపాటు చీకటిలో ఉండిపోయింది.

'చీకటి' అంటే 'అజ్ఞానం'. ఇలా వాళ్ళు భూమినీ మరి భూమిపై ఉన్న మనుషులనూ పూర్తి అజ్ఞానులుగా, ద్వంద్వత్వపు గేమ్ లోని పావులుగా తయారు చేశారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment