🌹. శివగీత - 100 / The Siva-Gita - 100 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
ద్వాదశాధ్యాయము
🌻. మోక్ష యోగము - 1 🌻
సూత ఉవాచ :-
ఏవం శ్రుత్వాకో సలేయ - స్తుష్టో మతిమతాం వర:,
ప్రపచ్చ గిరిజా కాంత - సుభగం ముక్తి లక్షణమ్ 1
భగవాన్! కరుణా నిష్ఠ - హృదయ! త్వం ప్రసీదమే,
స్వరూపం లక్షణం ముక్తే :- ప్రబ్రూహి పరమేశ్వర! 2
సాలోక్యమపి సారూప్యం - సారష్ట్యం సాయుజ్య మేవచ ,
కైవల్యం చేతితాం విద్దజ - ముక్తిం రాఘవ ! పంచదా 3
మాం పూజయంతి నిష్కామ - స్సర్వ కామ వివర్జితః,
సమె లోకం సమ సాధ్య - భుంక్తే భోగాన్స తెప్సితాస్ .4
జ్ఞాత్వామాం పూజయేద్యస్తు - సర్వకామ వవర్జితః
మయా సమన రూప - స్సన్మమ లోకే మహీయతే. 5
సూతుడు చెప్పు చున్నాడు :-
రాముడీ విషయమును విని ముక్తి క్షణమున అడుగనుపక్రమించెను. రాముడు పలుకు చున్నాడు. ఓ దయామయా ! మీరు ననన్ను గ్రహించి ఇక పై ముక్తి లక్షణముల
చెప్పు మని అడిగెను.
శ్రీ భగవంతుడా ముక్తి లక్షణములను గూర్చి ఇట్లుపదేశించు చున్నాడు:
ఓ రామా! ఆలకింపుము. ముక్తి సాలోక్యము, సారూప్యము, సాక్ష్యము, సాయజ్యము, కైవల్యమని యైదు రకాలుగా యున్నది. నిష్కామముగా నన్ను బూజించు వాడు అజ్ఞానము లేని వాడై
నా లోకమునకు వచ్చి తన కోరిక లన్నింటిని యను భవించు యని, సమానమైన కోరికలు లేక సర్వోత్త మాదులతో నన్ను గుర్తించి కొలచువాడు సమాన రూపత్వమును పొందును. (భగవత్సమాన మును దాల్చుట సారూపముక్తి యన బడును. దీనినే కొందరు సారూప్య ముక్తియని యందురు.
ఇష్టా పూర్తాని కర్మాణి - మత్స్రి త్యై కురుతే మయః
యత్క రోతి యదశ్నాతి - యజ్ణహొతి దదాతియత్. 6
యత్త పశ్యతి తత్సర్వం - యఃకరోతి మదర్పణమ్,
ముల్లోకేస సశ్రియం భుక్తెం - మత్తుల్యం ప్రాభవం భజన్. 7
యస్తు శ్యాంత్యాది యుక్తస్స - న్మామాత్మత్వేన పశ్యతి,
న జాయతే పరం జ్యోతి - రద్వైతం బ్రహ్మ కేవమల్. 8
ఇష్టా పూర్తాది కర్మలను నా ప్రీతి కై యెవడైతే ఆచరించునో వాడి చేసినది యంతయు, భుజించునది, హోమము చేసినది, దానము చేసినది, తపం చేసినది మద బుద్ది తో నెవడు చేయునో వాడు నా లోకమున నాతొ బాటు వైభవములననుభవిస్తూ సార్ష్య ముక్తిని పొందును ( సరూపముగా నైవ్వర్యమునను భవింప బడుదాని ధర్మమే సార్శ్వ ముక్తి యనబడును.)
యెవ్వడైతే శాంత్యాదులతో కూడి నన్ను పరమాత్ముని గా చూచునో వాడు సాయజ్యమును పిమ్మటను త్క్రుష్ట మగు పరం జ్యోతియై కేవల మద్వైత మగు కైవల్య ముక్తిని పొందును .
( సాయుజ్య మనగ తాదాత్మ్యము అదియును కైవల్యము అనగా భిన్నత్వము, అద్వైత మనుట, ఇట్లు రెండు విధములుగా ముక్తులను శాంత్యాదులతో కూడిన వాడే పొందును) ఆత్మ స్వరూపములో కలసి పోవుటే ముక్తియని చెప్పాబడినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 100 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 13
🌻 Moksha Yoga - 1 🌻
Suta said:
After listening to the Upasana details Rama started asking the details of Mukti (liberation).
Rama said:
O graceful lord! Kindly grace me by explaining the symptoms of Mukti and related details.
Sri Bhagawan said:
O Rama, Listen! Mukti is of five types by names Salokyam, Sarupyam, Sarsthyam (Sameepyam), Sayujyam, and Kaivalyam. One who worships me without asking anything (nishkama), he comes to my abode and enjoys all fruition, and gets to live in an equal abode. This is called as Salokya
Mukti.
One who doesn't have any desires and realizes me among the superior ones and worships me, he gets my kind of form. This is called as Sarupya Mukti.
One who performs IshtapoortadiKarmas (rituals) for me, whatever he does, whatever he eats, whatever he offers to the sacrificial fire, whatever he donates, whatever penance he performs, when he does that keeping me in mind for my sake, he enjoys prosperity in my abode along with me.
This is called Sarshtya Mukti (also known as sameepyam Mukti because he stays close to lord). One who has all good qualities and realizes me as the Paramatman and knows the nonduality between him and me, he gains Sayujyam Mukti and then gains the Advaita (nonduality) Kaivalya Mukti by becoming one with the Paramjyoti. Becoming one with the self is Mukti, the Kaivalyam.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
27 Oct 2020
No comments:
Post a Comment