భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 145



🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 145 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నారద మహర్షి - 19 🌻


137. సనత్సుజాతుడు నారదునితో ఇలా బోధ చేసాడు, “నారదా! సృష్టి విషయం చెప్తాను. పదివేలకల్పములు రాత్రి, పదివేలకల్పములు పగలు కలిగిన ఒక దినమును పరమేశ్వరుడు కలిగి ఉంటాడు. ఆ ప్రమేశ్వరుడిని భావన చెయ్యి. ఆయన్ రాత్రిళ్ళు నిద్రిస్తాడు. తరువాత ప్రభాతవేళలో మేలుకొని తన సంకల్పంలోంచి పూర్తిగా జలమయమైనటువంటి ఒక మహాసృష్టి అతడు చేస్తాడు.

138. భవిష్యత్తులో తన సంకల్పం సృష్టిగా ఏ రూపంలో ఉంటుందో, దానిని బీజరూపంలో జలంలో ఉంచుతాడు. దానికి బ్రహ్మాండము అని పేరు. అందాకారంలో శ్వేతమయంగా ఉంటుంది. దానికి ఒక యజమానిగా బ్రహ్మదేవుణ్ణి సృష్టించి, ఆ బ్రహ్మాండాన్ని ఉద్ధరించమని చెబుతాడు.

139. “తాను సృష్టించిన బ్రహ్మలో అహంకారాన్ని ఆయన ప్రవేశపెడతాడు. అహంకారము అంటే ‘నేను’ అనే భావన. అటువంటి నేను అనే భావన లేకపోతే చేసేది ఏమీ లెదు కాబట్టి, నేననే భావనను ఆయన అందులో ప్రవేశపెట్టాడు. అహానికి ‘దేహమే నేను’ అనే భావన కలిగింది. పరతత్త్వం సర్వవ్యాప్త బ్రహమవస్తువు అనుకుంటే మోక్షము, నేను అనుకుంటే బంధనము. ఆ అహంకారంతో మనస్సు, దశేంద్రియములు, ముద్ధి, పంచభూతములు, శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాదులు సృష్టించాడు.

140. క్రమంగా దేవ, ముని, గంధర్వ, కిన్నర, కింపురుష, నరాది జంతు జాలములతో కూడిన పరివారం సృష్టించాడు. “నేను అనే వస్తువు రాగానే నాది అనేది వెంటనే పుడుతుంది. నాది అనే వస్తువు లేని నేను అనేది లేదు. అది ఆయనలో ప్రవేశపెట్టి, ఆయంచుట్టూ పరివారాన్ని సృష్టించాడు. ఇవన్నీ కూడా ఆయనకు ఆ పరతత్త్వంలోంచే లభించాయి.

141. “తాను సృష్టించిన బ్రహ్మలో అహంకారాన్ని ఆయన ప్రవేశపెడతాడు. అహంకారము అంటే ‘నేను’ అనే భావన. అటువంటి నేను అనే భావన లేకపోతే చేసేది ఏమీ లెదు కాబట్టి, నేననే భావనను ఆయన అందులో ప్రవేశపెట్టాడు. అహానికి ‘దేహమే నేను’ అనే భావన కలిగింది. పరతత్త్వం సర్వవ్యాప్త బ్రహ్మవస్తువు అనుకుంటే మోక్షము, నేను అనుకుంటే బంధనము. ఆ అహంకారంతో మనస్సు, దశేంద్రియములు, బుద్ధి, పంచభూతములు, శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాదులు సృష్టించాడు.

142. క్రమంగా దేవ, ముని, గంధర్వ, కిన్నర, కింపురుష, నరాది జంతు జాలములతో కూడిన పరివారం సృష్టించాడు. “నేను అనే వస్తువు రాగానే నాది అనేది వెంటనే పుడుతుంది. నాది అనే వస్తువు లేని నేను అనేది లేదు. అది ఆయనలో ప్రవేశపెట్టి, ఆయంచుట్టూ పరివారాన్ని సృష్టించాడు. ఇవన్నీ కూడా ఆయనకు ఆ పరతత్త్వంలోంచే లభించాయి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


27 Oct 2020

No comments:

Post a Comment