✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 06 🌻
357. సంస్కారములు తరిగిన కొలది, చైతన్యము వాటినుండి విముక్తిని పొందును.
358. భౌతిక సంస్కారములు, సూక్ష్మ సంస్కారములగను; సూక్ష్మసంస్కారములు మానసిక సంస్కారములగను మారి, చివరకు మానసిక సంస్కారములు కూడా అదృశ్యమగును. ఇది మామూలుగ జరిగు క్రమవిధానము.
359. ఒకటవ భూమిక- సగము భౌతిక ప్రపంచం, సగము సూక్ష్మ ప్రపంచం.
రెండు, మూడు భూమికలు- పూర్తిగా సూక్ష్మ ప్రపంచం.
నాల్గవ భూమిక -సగం సూక్ష్మ ప్రపంచం, సగం మానసిక ప్రపంచమునకు చెందియుండును.
360. ఆత్మ, సూక్ష్మశరీరం ద్వారా, సూక్ష్మగోళము యొక్క ఎఱుకను పొందుచున్నప్పుడు సూక్ష్మశరీరము (ప్రాణము)తో తాదాత్మ్యత చెందుచున్నది.
361. ఆత్మ , సూక్ష్మసంస్కారమున కలిగియుండి, వాటికనుగుణ్యముగా సూక్ష్మ శరీరము యొక్క చైతన్యమునే కలిగి, సూక్ష్మ ప్రపంచనుభవమును పొందుచుండును.
సూక్ష్మ లోకానుభములు :- వినుట, ఆగ్రణించుట , చూచుట.
362. ఆత్మ, సూక్ష్మసంస్కారమును కలిగియుండి, సూక్ష్మశరీరంతో తాదాత్మ్యతచెంది, ఆ సూక్ష్మ శరీరమే తానని భావించును.(" నేను శక్తిని")
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
27 Oct 2020
No comments:
Post a Comment