🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 32 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
22. సుమేరు మధ్య శ్రుంగస్థ శ్రిమన్నగర నాయిక
చింతామణి గృహాన్తస్త పంచబ్రహ్మాసనస్తిత
🌻 56. 'శ్రీమన్నగరనాయికా' 🌻
నగరమునకు నాయక యని అర్థము. నగరమునకు అర్థము విద్యానగర మనియె. సమస్త విద్యలకు ఏ ప్రదేశమాలయమో, దానిని ప్రాచీన కాలమున నగరమని పిలిచెడివారు. నాగరికులనగ విద్యల యందు నిపుణులని అర్థము.
పూర్వకాలమున విద్యయే సంపదగ
భావించుటచే విద్యలు గల తావును నగర మనిరి. వారణాసి, పాటలీ పుత్రము, ఉజ్జయిని అట్టి నగరములే. భవంతుల ఎత్తును బట్టి, ప్రదేశము వైశాల్యమునుబట్టి, జనాభానుబట్టి ప్రస్తుతము నగరములను నిర్వచించు చున్నారు. ఇది కలి ధర్మము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 56 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
56. Śrīman-nagara-nāyikā श्रीमन्-नगर-नायिका (56)
She owns this auspicious and wealthy city called Śrī Nagara. There are two narrations about this Śrī Nagara. One is found in Durvasa’s Lalithāstavaratna and another in Rudra Yāmala (as told to Pārvatī by Śiva).
The former says that Śrī Nagara was constructed by celestial architect Viśvakarma. Rudra Yāmala says that Śrī Nagara is in the midst of ocean of milk as an island called Ratnadvīpa (island formed out of precious gems).
In the midst of Śrī Nagara there is another city called Śrī Vidya that is surrounded by twenty five walls, each wall representing a tattva. So, She is the queen of such a place, from where She performs all Her three acts of creation, etc.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 57 / Sri Lalitha Chaitanya Vijnanam - 57 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
22. సుమేరు మధ్య శ్రుంగస్థ శ్రిమన్నగర నాయిక
చింతామణి గృహాన్తస్త పంచబ్రహ్మాసనస్తిత
🌻 57. 'చిన్తామణి గృహాంతస్థా' 🌻
చింతామణులచే నిర్మింపబడిన గృహమునందు నివసించునది అని అర్థము. తలచిన కోరికలను తీర్చునట్టిది చింతామణి రత్నము. అట్టి
రత్నములచే నిర్మించబడిన గృహము నందు వసించునది అని అర్థము.
చింతామణి గృహము బ్రహ్మాండము నధిష్ఠించి యుండునని, అందుండియే సమస్త సృష్టి ప్రణాళిక వెలువడునని బ్రహ్మాండ పురాణమున తెలుపబడెను. ఇది కారణముగ చింతామణి గృహమే సమస్త సృష్టికిని, త్రిమూర్తులకును, త్రిశక్తులకును శిరోధార్యముగ భావింతురు. ఆ గృహమున వసించునదియే శ్రీదేవి. మానవ శరీరమందు సహస్రార పద్మము నధిష్ఠించిన మణి గూడ చింతామణియే.
మానవ ప్రజ్ఞకు అది పరమోత్కృష్ట స్థానము. అట్లే సృష్టికి పరమోత్కృష్ట స్థానము చింతామణి గృహము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 57 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 57. Cintāmaṇi-gṛuhāntasthā चिन्तामणि- गॄहान्तस्था (57) 🌻
She lives in a palace constructed out of Cintāmaṇi, one of the most valuable gems. This gem is supposed to give whatever is desired.
This palace is on the northern side of Śrī Nagara, the city. All the gods and goddesses go to this place to worship Her. This is supposed to be the place of origin of all mantra-s. Worshipping this place eradicates all mental afflictions.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi
Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
27 Oct 2020
No comments:
Post a Comment