శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 84 / Sri Gajanan Maharaj Life History - 84



🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 84 / Sri Gajanan Maharaj Life History - 84 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻.  17వ అధ్యాయము - 2  🌻

యోగిరాజు మహిళల డబ్బాలో కూర్చుని ఉండడం అతను చూసాడు. ఆయన ఒకగొప్ప యోగి, దురాగతంచేసే అవకాశం లేదు కావున శ్రీమహారాజును ఆ మహిళల డబ్బాలో ప్రయాణం చేసేందుకు అనుమతించవచ్చు అని స్టేషను మాష్టరు పొలీసు ఆఫీసరును అర్ధించాడు. దానిమీదట పొలీసు ఆఫీసరు, తన పైన అధికారికి తంతి ద్వారా అప్పటికే ఈవిషయం తెలియపరిచానని, తనచేతిలో ఇక ఏమీలేదని, కావున మీకు తోచిన ప్రకారం చెయ్యమని అన్నాడు.

అప్పడు స్టేషనుమాష్టరు గౌరవసూచకంగా తన టోపీతీసి, చట్టాన్ని గౌరవించే నిమిత్తం, శ్రీమహారాజును డబ్బానుండి బయటకు రావలసిందిగా నమ్రతతో అర్ధించాడు. తరువాత చట్టప్రకారం శ్రీమహారాజుమీద ఆరోపణ దాఖలు చెయ్యబడింది. ఈకేసు విచారణకు శ్రీజాఠరు కచేరీకి వచ్చింది. ఆయన ఈ విచారణ షేగాంలో జరగడానికి తేదీ నిశ్చయించారు. ఈకేసు విచారణకోసం ఆయన షేగాం వచ్చి వసతి గృహంలో బసచేసారు.

అకోలా వాసి అయిన వెంకటరావు దేశాయి కూడా వేరేపనిమీద ఆరోజున షేగాంరావడం తటస్థపడింది. ఈకేసు విచారణ ప్రకటనవిని చాలామంది ఆవసతి గృహందగ్గర గుమిగూడారు. ఇంతమంది గుమిగూడడానికి కారణమయిన కేసు ఏమిటా అని శ్రీదేశాయి, శ్రీజాఠరును విచారించాడు. శ్రీజాఠరు అతని అవివేకానికి ఆశ్చర్యపోయి, ఈకేసు శ్రీమహారాజు నగ్నంగా బహిరంగంలో తిరగడంమీద దాఖలు చెయ్యబడింది అని చెప్పారు. శ్రీదేశాయి దుఖితుడై, చేతులు కట్టుకుని, ఈకేసు సరి అయినదికాదు.

శ్రీగజానన్ మహారాజు ఒకగొప్ప యోగి, భగవంతుని అవతారం, ఒక దివ్యమైనవ్యక్తి. ఆయన ఏవిధమయిన బంధనాలులేని ఒక పవిత్రమయిన మనిషి అందరిచే గౌరవించబడే యోగులలో యోగి. పోలీసు ఆయనని ఈవిధంగా చట్టరీత్యా విచారణచెయ్యాలని తప్పుచేసారు, మీరు దానిని ఉపసంహరించుకొని ఈతప్పును సరిదిద్దుకోవాలి అని అన్నాడు. పోలీసులు ఈకేసు దాఖలు చేసేముందు ఆలోచించి ఉండవలసిందే తప్ప ఈపరిస్థితులలో చట్టరీత్యా తను నిశ్శహాయుడనని శ్రీజాఠరు అన్నారు.

అప్పుడు శ్రీగజానన్ మహారాజును పిలవవలసిందిగా తనగుమాస్తాకు సూచన ఇచ్చారు. దానిమీదట ఆగుమాస్తా శ్రీమహారాజును కోర్టు కచేరీకి తీసుకు రావడానికి ఒక పోలీసు కానిస్టేబులును పంపించాడు. ఆకానిస్టేబులు వెళ్ళి శ్రీమహారాజును తనతో రావలసిందిగా అన్నాడు. పైగా నిరాకరిస్తే బలవంతంగా తీసుకొని వెళతానని బెదిరిస్తాడు.

శ్రీమహారాజు వెళ్ళడానికి నిరాకరించి, తనను బలపూర్వకంగా తీసుకువెళ్ళమని సవాలుచేసారు. అలాఅంటూ శ్రీమహారాజు తన చెయ్యిచాపి ఆజవాను చేతిని పట్టుకున్నారు. ఆపట్టు ఎంతగట్టిగా ఉందంటే, అతని చేతి రక్తప్రసరణ ఆగిపోయి ఆ కానిస్టేబులుకు నొప్పివల్ల అసహనం అయింది. జవాను రాకపోవడంతో శ్రీజాఠరు, వెంకటరావు దేశాయిని శ్రీమహారాజును తీసుకువచ్చేందుకు పంపి అక్కడ గుమిగూడిన వారిని వెళ్ళిపోవలసిందిగా ఆదేశించారు.

కానిస్టేబులు దయనీయస్థిత గూర్చి అక్కడకి చేరగానే, శ్రీదేశాయికి తెలిసింది. అప్పుడు భక్తులతో, శ్రీమహారాజుకు బట్టలు తొడగవలసిందిగా ఆయన అన్నారు. ఆవిధంగా శ్రీమహారాజుకు పంచ కట్టించారు, కానీ ఆయన విశ్రాంతి గృహం వెళ్ళేదారిలోనే దానిని విసిరివేసి, నగ్నంగానే ఆయన కచేరీకి వెళ్ళరు. శ్రీజాఠరు మర్యాద పూర్వకంగా శ్రీమహారాజును ఆహ్వనించి కూర్చునేందుకు కుర్చీ ఇచ్చారు.

నగ్నంగా నగరంలో తిరగడం, చట్టరీత్యా సమంజసంకాదు, కావున నగ్నంగా తిరగవద్దని నేను మిమ్మల్ని అర్ధిస్తున్నాను అని శ్రీజాఠరు శ్రీమహారాజుతో అన్నారు. దానికి శ్రీమహారాజు నవ్వి... దానితో నీకేమిటి సంబంధం ? అటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వక, నాపొగగొట్టంలో పొగాకునింపు అని అన్నారు. ఇది విన్న శ్రీజాఠరు పూర్తిగా కరిగిపోయాడు. ఈయన ఈప్రాపంచిక విషయాలకు అతీతులు అని గ్రహించాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 84 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj


🌻 Chapter 17 - part 2 🌻

When he saw Yogiraj sitting in the ladies compartment, the station master requested the police officer that Shri Gajanan Maharaj be permitted to travel in that compartment, as he was a great saint, unlikely to commit any offence.

Thereupon the police officer said that he had already sent a telegram to his higher officer and nothing was left in his hands, so he may do whatever he liked.

Thereupon the station officer, as a mark of respect, took out his cap, and most humbly requested Shri Gajanan Maharaj to come out of the compartment to respect the law.

Subsequently a case was filed against Shri Gajanan Maharaj as per law. It was put for hearing in the court of Shri Jathar, who fixed the date for proceeding at Shegaon. He came to Shegaon and stayed at the rest house for the hearing of the case. Venkatrao Desai of Akola also happened to come to Shegaon on that day for some other work.

Hearing the announcement of the case, a lot of people gathered at the rest house. Shri Desai enquired from Shri Jathar about the case which made so many people to gather there. Shri Jathar was surprised at his ignorance and told that the case was against Shri Gajanan Maharaj for his moving out naked in public.

Shri Desai felt sorry and with folded hands said, This case is not proper. Shri Gajanan Maharaj is a great saint - the God incarnate, a divine person. He is a holy man having no bondage, a yogi of yogis respected by all. The police have committed a mistake by prosecuting him and now should correct it by withdrawing their prosecution.

Shri Jathar said that the police should have thought over it before filing the case, and under such circumstances he was helpless as per the law. He then ordered his clerk to call Shri Gajanan Maharaj.

The clerk thereupon sent one police constable to bring Him to the court. The constable went and asked Shri Gajanan Maharaj to accompany him and further threatened to take him forcibly if resisted.

Shri Gajanan Maharaj refused to go and challenged the Javan to take him by force. Saying so Shri Gajanan Maharaj extended his hand and caught hold of the hand of the constable. The grip was so tight that the blood flow in the constable’s hand was obstructed, making him uncomfortable with pain.

As the Javan did not turn up, Shri Jathar sent Venkatrao Desai to bring Shri Gajanan Maharaj and ordered people around to disperse. Shri Desai got information about the plight of the constable on reaching there, and asked the devotees to put clothes on Shri Gajanan Maharaj .

So Shri Gajanan Maharaj was made to wear dhoti, but he threw it away on way to Rest house and went naked to the court. Shri Jathar respectfully received Shri Gajanan Maharaj and offered him a chair to sit on.

Then, Shri Jathar said to Shri Gajanan Maharaj , It is not proper to move out naked in town as it is against the law.

So I request you not to move out naked. Shri Gajanan Maharaj smilingly replied, How are you concerned with that? Fill up my pipe with tobacco and don't give any importance to such things.

Hearing this Shri Jathar just melted and realized that Shri Gajanan Maharaj was far above the ways of material world, a Vrushab Dev of Bhagwati, A Shukachrya or an incarnation of Namdeo.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹



Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


20 Oct 2020

No comments:

Post a Comment