✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 27 🌻
328. లౌకిక జ్ఞానము భౌతిక సంక్షేమ ప్రాప్తికి సంబంధించినది .
329. ధర్మశాస్త్ర జ్ఞానము ( కర్మకాండ మార్గము ) తార్కికమైన వాగ్యుద్ధముతో , శాస్త్రప్రమాణికములతో పరులను ఓడించుటకై సంపాదించు జ్ఞానము .
330. పునర్జన్మ ప్రక్రియ, స్థూల సంస్కారముల సరిహద్దునకు తీసుకొనిపోవును .
331. భౌతిక ప్రపంచానుభవము -
ఆత్మ మానవరూపములో అసంఖ్యాక యుగములు జనన-మరణములు పొందుటద్వారా, భౌతిక లోకానుభవమునకు పరిపక్వస్థితి ప్రాప్తించును. అంతటా యీ భౌతిక లోకానుభవము-సంస్కార భారమునుండి చైతన్యము విముక్తి పొందుటకు భౌతిక సంస్కారములు క్రమక్రమముగా చెరిగిపోయి, పూర్తిగా అదృశ్యమగుటకు ఎంతయో దోహదము చేయును.
332. మానవునిలోనున్న భగవంతుడు, సత్యవత్ తాను ఎరుకతో భగవంతుడు కాగలందులకు గాను, ఇప్పుడు మానవునిపై కేంద్రీకృతమైన భగవంతుని బహిర్ముఖ చైతన్యము, భగవంతునితో తాదాత్మ్యత నొసంగుటకై క్రమక్రమముగా, పూర్తిగా అంతర్ముఖం కావలసినదే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
20 Oct 2020
No comments:
Post a Comment